34
స్వాతి..... "అన్నయ్యా " కంప్యూటర్ లో మునిగిపోయిన ప్రదీప్, ఇందాకటి నుంచి స్వాతి రూమ్ వరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం గమనిస్తూనే ఉన్నాడు. తను ఏమడుగుదామనుకుంటోందో తెలిసినా స్వాతి మొహమాట పడ్తుంటే నవ్వొచ్చి అలాగే గమనించనట్లు ఉండిపోయాడు. చివరికి, "పిలిచిందే" అని మనసులోనే నవ్వుకుంటూ, "ఏంటి చిన్నూ" "ఏమి లేదన్నయ్యా. పని లో ఉన్నావేమో. తర్వాత మాట్లాడచ్చులే" అంటూ వెళ్ళబొయింది "పనేమీ లేదురా. లోపలికి రా. అక్కడే ఆగిపోయావేం. ఏం మాట్లాడాలి, చెప్పూ" "అదీ....... అన్నయ్యా..... బావా...." ప్రదీప్ "అనుకున్నానురా, నువ్వన్నిసార్లు తటపటియిస్తుంటేనే" అనుకుని "ఆ.... బావా... ఏంటి" "రేపు పొద్దునే వెళ్ళిపోతాడు కదా. ఎయిర్పోర్ట్ కి ఎలాగో కుదరదేమో, ఇప్పుడొకసారి వెళ్ళి కలిసొద్దామా" "ఇప్పుడా?? ఇప్పుడు నాకు పనుందిరా. అయినా నిన్ననే కదా కలిసింది. మళ్ళీ ఎందుకూ" అన్నాడు ప్రదీప్, స్వాతి ని చూసి నవ్వుకుంటూ "ఆ..... అవుననుకో..... ఒద్దంటావా అయితే..... సరేలే " అంటూ బాధగా వెళ్ల...