34

 స్వాతి..... "అన్నయ్యా " 


కంప్యూటర్ లో మునిగిపోయిన ప్రదీప్,  ఇందాకటి నుంచి స్వాతి రూమ్ వరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం గమనిస్తూనే ఉన్నాడు.  తను ఏమడుగుదామనుకుంటోందో తెలిసినా స్వాతి మొహమాట పడ్తుంటే నవ్వొచ్చి అలాగే గమనించనట్లు ఉండిపోయాడు.  చివరికి,  "పిలిచిందే" అని మనసులోనే  నవ్వుకుంటూ,  "ఏంటి చిన్నూ" 


"ఏమి లేదన్నయ్యా.  పని లో ఉన్నావేమో.  తర్వాత మాట్లాడచ్చులే" అంటూ వెళ్ళబొయింది


"పనేమీ లేదురా. లోపలికి రా.  అక్కడే ఆగిపోయావేం.  ఏం మాట్లాడాలి,  చెప్పూ" 


"అదీ.......  అన్నయ్యా.....  బావా...." 


ప్రదీప్ "అనుకున్నానురా, నువ్వన్నిసార్లు తటపటియిస్తుంటేనే" అనుకుని "ఆ....  బావా...  ఏంటి" 


"రేపు పొద్దునే వెళ్ళిపోతాడు కదా. ఎయిర్పోర్ట్ కి ఎలాగో కుదరదేమో, ఇప్పుడొకసారి వెళ్ళి కలిసొద్దామా"


"ఇప్పుడా?? ఇప్పుడు నాకు పనుందిరా. అయినా నిన్ననే కదా కలిసింది. మళ్ళీ ఎందుకూ" అన్నాడు ప్రదీప్, స్వాతి ని చూసి నవ్వుకుంటూ 


"ఆ.....  అవుననుకో.....  ఒద్దంటావా అయితే.....  సరేలే " అంటూ బాధగా వెళ్లబోయింది 


ప్రదీప్ గట్టిగా నవ్వేసి, "పదా వెళ్ళొద్దాం.  నువ్వేమంటావో అని అలా అన్నాను. నీ ఫేస్ చూడాలసలు. నాదగ్గర మొహమాటం ఎందుకురా. నేను కలవాలి తీసుకుని వెళ్ళు ఆటే వద్దంటానా. చిన్నూ....  తను వెళ్ళేటప్పుడు నవ్వుతూ సెండాఫ్ ఇయ్యి. సరేనా " అంటూ లేచీ బయల్దేరారు 


హరీష్ వాళ్ళ ఇంట్లో..... 


ప్రదీప్ "ఏంటి అత్తయ్యా.....  ఏం చేస్తున్నారు. భోజనాలయ్యాయా" 


"అయిపోయాయిరా....  మీరు తిన్నారా" 


"తినే బయలుదేరాము అత్తయ్య. లేట్ అయిపొయింది, పడుకుంటారేమో అనుకుంటూ వచ్చాము. హరీష్ పడుకున్నాడా" 


"లేదురా లేచే ఉన్నాడు. వెళ్ళండి, పైన వాడి రూమ్ లోనే ఉన్నాడు" అని అనగానే స్వాతి, ప్రదీప్... హరీష్ రూమ్ లోకి వెళ్ళారు


"ఏంటి బా.....  సద్దేసుకున్నావా మొత్తము. "  


"అన్నీ రెడీ బావా.... ఆఫీస్ పేపర్స్ చూస్కుంటున్నా కావాల్సినవి. కూర్చోండి..." అంటూ స్వాతిని చూసీ "డిన్నర్ అయ్యిందా స్వీటీ" 


"ఆ అయ్యింది బావా" 


"స్వీటీ ఇదిగో నీకోసం కొన్ని బుక్స్ తీసుంచాను" అంటూ ఒక కవర్ స్వాతి కి ఇచ్చాడు 


" వీడి బుక్స్ గోల వీడూను. నేనే మూడ్ లో ఉన్నాను,  వీడేం చెప్తున్నాడు" అని తిట్టుకుంటూనే "సరే" అనేసి తీసుకుంది 


"నీకు మళ్ళీ టైమ్ టేబుల్ చేసి పంపించనా. ఎగ్జామ్స్ డేట్ ఏమైనా ఇచ్చారా" 


ప్రదీప్ రాని దగ్గుని దగ్గేసరికి స్వాతి కోపం గా తనని చూసీ, "ఇంకో టూ మంత్స్ లో ఎగ్జామ్స్ బావా. లాస్ట్ టైమ్ లాగా సిలబస్ పంపిస్తాలే. నువ్వు టైమ్ టేబుల్ చేసి ఇవ్వూ. అదే ఫాలో అవుతాను" అని నవ్వుతూ చెప్పి 


"అన్నయ్యా వెళ్దామా" అని ప్రదీప్ ని అడిగేసరికి,  హరీష్ ఏమయ్యిందో అర్థం కానట్లుగా ప్రదీప్ వైపు చూసాడు


ప్రదీప్ కళ్ళతో హరీష్ లగ్గేజ్ ని స్వాతి కి ఇచ్చిన కవర్ ని చూపించి, "నువ్వేళ్తున్నావ్ కదా కలుద్దామని వస్తే పుస్తకాలు, చదువు అంటావేంటి" అంటూ సైగ చేసాడు 


హరీష్ గట్టిగా నవ్వేసి "స్వీటీ నీకిచ్చిన కవర్ ఓపెన్ చేయలేదు. చూడు ఆ బుక్స్ నీకు నచ్చుతాయేమో" 


"బుక్సే కదా బావా,  నచ్చడానికేముందిలే " అని కవర్ ఓపెన్ చేసి, "హేయ్ చందమామ బుక్స్.....  థాంక్యూ" 


"మరి చూడకుండానే తిట్టేసుకుంటావేం. సరే కానీ వాటిని ఒకరోజులోనే తినేయకు. ముందు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు. టూ మంత్స్ అంటే నేనొచ్చేస్తాలే. అయినా టూ మంత్స్ ముందర చెప్పారా. కొంచం టైమ్ ఇయ్యకపోతే ఎలాగా ప్రిపరషన్ కి" 


"వాళ్ళు ముందర చెప్పారు బావా,  కానీ నువ్వు గత కొన్నిరోజులు నుంచి మాట్లాడటం మానేసావు కదా అందుకే నీకు తెలీదు" 


ప్రదీప్ "మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తా ఒక కాల్ చేసుకోవాలి" అంటూ కిందకి వెళ్ళాడు 


ప్రదీప్ అలా వెళ్ళగానే స్వాతిని తన వైపుకి లాగటంతో హరీష్ కౌగిట్లో వాలిపోయింది. 


"దానికి సారీ చెప్పాను కదరా. మళ్ళీ అదే అంటావేంటి" 


"మరి నాక్కోపమొస్తోంది. ఎప్పుడూ చదువు చదువు అంటావు, ఇంక అది తప్ప నాతో చెప్పటానికేమి లేవా"


"నాకు మాత్రం నీకు దూరంగా ఉండటం ఇష్టమా చెప్పు. బావ ముందర ఇలా దగ్గరకి లాక్కుని మాట్లాడాననుకో నువ్వే ఇబ్బందిపడిపోతావ్. అందుకే మాములు టాపిక్స్ మాట్లాడాను"


"సరే......  ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండాలో అని బెంగొచ్చేస్తోంది కృష్ణా. త్వరగా వచేస్తావు కదూ. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. అమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకోదేమోనని" అంటూ హరీష్ ని గట్టిగా హత్తుకుంది.


"స్వీటీ త్వరగానే వచేస్తానురా.  అత్తయ్య ఎందుకు ఒప్పుకోదు. నీతో ఏమన్నా అన్నదా" 


"ఆహా... ఏమనలేదు. నాకు ఫోన్ చేయి రోజూ మర్చిపోకుండా. కుదరకపోతే మెసేజ్ అయినా చేయి" 


"అలాగే. కానీ, ముందర అడిగింది చెప్పూ. అత్తయ్యా ఏమైనా అన్నదా" 


"ఏమనలేదు బావా..... అంటే చెప్తానుగా. సరే కానీ, ఎంతసేపూ పని అనకుండా అంత దూరం వెళ్తున్నావ్,  చక్కగా చుట్టూ అన్నీ ప్లేసెస్ చూసి రా. వచ్చాక నాకు కళ్ళకు కట్టినట్లు చెప్పాలి. గుర్తుపెట్టుకో" 


"అలాగే మేడం" 


"కృష్ణా.... " 


"ఆ....  ఇందాకేమో ఏమిచ్చానో కూడా చూడకుండానే వీడు వాడు అని తిట్టేసుకున్నావు ఇప్పుడేమో బావా..... కృష్ణా అంటున్నావ్" 


"ఇది మరీ బావుంది నన్ను మనసులో కూడా తిట్టుకోనీయవేంటి నాకు నచ్చినట్లు" 


"అదే అనేది నేను కూడా. నీకు నచ్చినట్లుగా మనసులో ఎందుకు అనుకోటం. అనేదేదో బయటకే అనొచ్చు కదా అనే అంటున్నా. నేనే కదా. నువ్వెలా పిలిచినా ఇష్టమే, నువ్వెలా మాట్లాడినా ఇష్టమే" 


స్వాతి హరీష్ గుండెల మీద ముద్దు పెట్టి,  "లవ్ యూ" 


"లవ్ యూ టూ బంగారం" అని స్వాతి తల మీద ముద్దుపెట్టుకున్నాడు.


ఇంతలో ప్రదీప్ రావటం తో, స్వాతి "సరే బావా మేము బయల్దేరుతాము" అంది 


కిందకి వస్తుంటే, హరీష్ ప్రదీప్ ని ఆపి, " బావా ఇంట్లో ఏమైనా అయ్యిందా. ఒకసారి స్వాతి ని నువ్వు మాటల్లో పెట్టి కనుక్కో. నాకేదో అనుమానంగా ఉంది. ఇంట్లో  పెళ్ళికి ఒప్పుకోరేమో అంటోంది" 


"అవునా...అలాంటిదేమి అవలేదు. బా....అయినా నేనడుగుతానులే. నువ్వేం ఖంగారు పడకు. నువ్వు హ్యాపీ గా వెళ్ళిరా" 


కిందకి వచ్చాక ప్రదీప్... "మావయ్య మీకేదైన అవసరం ఉంటే మాకు చెప్పండి. హరీష్ ఊరెళ్లినా మేమందరము ఇక్కడే ఉన్నాము" అని చెప్పి వెళ్ళారు. 


హరీష్ తో పాటు ఎయిర్పోర్ట్ కి వాళ్ళ నాన్న మహేశ్వర రావు గారు కూడా వెళ్ళారు. దారిలో..... 


"నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను" 


"ఏంటి హరి" 


"నాన్నా..... నేనొకమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్ళి చేసుకుంటాను" 


అయన ఆశ్చర్యంగా "ఎవర్రా ఆ అమ్మాయి" 


హరీష్ ఆయన్ని చూస్తూ.... "మీకు బాగా తెలిసిన అమ్మాయే నాన్నా.... స్వాతి" 


"ఏంటి మన స్వాతా. ఎంత మంచి మాట చెప్పావురా. చాలా సంతోషంగా ఉందిరా. అయినా ముందరే చెప్పుంటే,  ఈ పాటికి పెళ్ళి చేసేసేవాళ్ళము కదా. ఇంతకీ తనకి ఇష్టమేనా" 


"తనకీ ఇష్టమే నాన్నా. తన పరీక్షలు అయ్యేవరకు ఇంట్లో చెప్దామనుకోలేదు. కానీ ఇప్పుడు మీకు చెప్పటానికి ఒక కారణం ఉంది  నాన్న. " 


"పర్వాలేదు లేరా. చదువు ముఖ్యం కదా. నువ్వు తనని డిస్టర్బ్ చేయటం లేదు అది నచ్చిందిరా. ఇంతకీ ఇప్పుడేమయ్యింది" 


"నాన్నా... ఎవరితోనూ చెప్పలేదు, కానీ నేను వెళ్ళే ప్రాజెక్ట్ రెండు నెలలు వరకు పట్టచ్చు. తనకి ఇప్పుడే చెప్తే బెంగ పెట్టేసుకుంటుందని చెప్పలేదు. అమ్మకీ అందుకే చెప్పలేదు. ఈ రెండు నెలల్లో ఇంట్లో ఏవైనా సంబంధాలు వస్తే మీరు చూస్కోండి నాన్నా. అమ్మ అసలు ఖాళీ లేకుండా పెళ్ళి వేట లో ఉంది. నేను తనని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను. అమ్మ తో ఇప్పుడే ఏమి చేప్పద్దు. నేను వచ్చాకా, నేనే చెప్తాను. కానీ అప్పటి వరకు మీరు హ్యాండిల్ చేయరా ప్లీజ్" 


"ఏంట్రా రెండు నెలలా. మరి నాకూ చెప్పనే లేదు"


"నాన్నా.....  నాకూ కరెక్ట్ గా తెలీదు. వర్క్ చూస్తుంటే రెండు నెలలు పట్టచేమో అంటున్నా" 


"సరేలేరా. ఇంట్లో నేను చూస్కుంటానులే. అత్తయ్య వాళ్ళకి తెలుసా" 


"లేదు నాన్న. అందరికీ తన ఎగ్జామ్స్ అయ్యాకే చెప్దామని. మీరు కూడా ఇప్పుడే ఈ విషయం ఎవరితోనూ అనకండి"


"సరే హరి. నీ ఇష్టం"


ఆ తర్వాత హరీష్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్లిపోయారు 


"స్వీటీ.....  గుడ్ మార్నింగ్.... లేచావా" అంటూ హరీష్ స్వాతికి మెసేజ్ చేయగా,


"గుడ్ మార్నింగ్....  లేచే ఉన్నాను బావా. నిద్ర పట్టలేదు. నువ్వెక్కడున్నావ్ " 


"చెక్ ఇన్ అయ్యాను. బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నా" 


"సరే కాల్ చేయచ్చా" 


వెంటనే  హరీష్ కాల్ చేసి, "గుడ్ మార్నింగ్ స్వీటీ" 


"గుడ్ మార్నింగ్ బావా" 


"ఎందుకురా రాత్రి నిద్ర పట్టలేదు. ఏం ఆలోచిస్తున్నావు" 


"ఏం ఆలోచించటం లేదు. ఎందుకో నిద్ర పట్టలేదు" 


"అలా నిద్ర పాడుచేసుకుంటే హెల్త్ ఎలారా బంగారం" 


"నేనేం చేయనూ నిద్ర రాకపోతే. సరేలే ట్రై చేస్తాను. బావా నీకు  సెండాఫ్ గిఫ్ట్ ఇయనా" 


"ఏంటి ఫోన్లోనా. నిన్న వచ్చినప్పుడు ఈయకుండాను. మొన్న ఒక్కసారి ముద్దు పెట్టవే అంటే  ఫోజ్ కొట్టావు.... ఫోన్ లో ఇస్తుందిట" 


"బావా.....  నేను గిఫ్ట్ అన్నాను కానీ ముద్దు అని చెప్పానా. సరేలే నేనేం ఇయ్యను" 


"స్వీటీ... ఇయ్యారా.... ప్లీజ్.... మా బంగారం కదూ" 


స్వాతి నవ్వుతూ.... "నీ ఫోన్ చూసుకో. ఆల్రెడీ పంపించేసా" 


"పంపించావా...  ఏం పంపించావు" అని చూసీ "హేయ్!!! ఈ ఫోటో ఎప్పుడు తీశారు. వావ్!!! గిఫ్ట్ అదుర్స్" 


"నేను అన్విని  ఇదే క్వశ్చన్ అడిగా.....  ఎప్పుడు తీసావే అని. "మీరిద్దరూ మైమరచిపోయి పక్కన పిడుగులు పడ్డా చూడకుండా ఒకళ్లనొకళ్ళు చూసుకుంటు అన్నం తినిపించుకుంటున్నప్పుడు   ఫోటో తీసినా ఏం తెలుస్తుందిలే" అని ఎక్సట్రా ఇంకొంచం ఏడిపించింది" 


"హహహ్.....  అన్నం తినే ప్రతీసారి నువ్వు నాకు తినిపించడం గుర్తొస్తుంది. చాలా మంచి మెమరీ రా అది నాకు". 


హరీష్.... "స్వీటీ బోర్డింగ్ కి పిలుస్తున్నారు. నేను మోస్టలీ రేపటి వరకూ మెసేజ్ చేయలేను. ఖంగారు పడకుండా,  జాగ్రత్త గా ఉండు. మంచిగా తిని పడుకో. హెల్త్ జాగ్రత్త. దేని గురించి ఎక్కువ ఆలోచించకు. ఉంటాను" 


"సరే బావా.....  నువ్వు జాగ్రత్త. హావ్ అ సేఫ్ ఫ్లైట్.  ఉంటా" అని స్వాతి ఫోన్ పెట్టేసి ఆ ఫోటో ని చూస్తూ ఉంది



Comments