33
"అన్విత గారు, ఇలాగే మనం కూర్చుని ఉంటే, మా అన్నయ్య నాతోనే మాట్లాడిస్తాడు. మనముంటే వీళ్ళు సిగ్గుపడ్తున్నారు. వీళ్ళనే మాట్లాడుకోనిద్దాం. మనం బయటకి వెళదాము" అంటూ అందరూ బయటకి వెళ్ళారు
స్వాతి, అన్విత చేయి గట్టిగా పట్టుకుంది, వెళ్లనీయకుండా
అన్వి "స్వాతి..... నీకిదే ఛాన్స్. తను నచ్చలేదని అతనికే చెప్పేసెయ్యి. బయట ఉంటాం " అని వెళ్ళిపోయింది
ఆ వచ్చినతను స్వాతిని కన్నార్పకుండా చూస్తుండగా, స్వాతి మాత్రం అతన్ని కన్నెత్తి కూడా చూడలేదు. ప్రదీప్ వాళ్ళు బయటకి వెళ్ళగానే ఆ గది నిశ్శబ్దంగా అయిపొయింది. అతను ఏదో మాట్లాడేలోపు స్వాతి లేచీ గుమ్మం దగ్గరకి వెళ్ళింది. తను అలా వెళ్లేసరికి ఆ వచ్చినతను ఖంగారుపడ్డాడేమో మరి, మాట్లాడబోయి ఆగిపోయాడు.
బయట ఎవరూ లేరని నిర్ధారించుకుని, లోపలికి వెళ్ళిపోతూ, అతను కూడా నిల్చున్నాడని గమనించి,
"చూడండి. మీరెవరో, మీ పేరేంటో కూడా తెలీదు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు, అవసరం అంతకన్నా లేదు. నేను, మా బావ ప్రేమించుకుంటున్నాం. నేను మా బావని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను. పెళ్ళి చేసుకోవాల్సి వస్తే, నేను చస్తాను. నా పక్కన, తనని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. మీకు నేను నచ్చలేదని చెప్పి వెళ్లిపోండి. ప్లీజ్" అని లోపలికి వెళ్ళిపోబోయింది.
అతను మొదటిసారిగా గొంతు విప్పాడు. "ఎక్కడికెళ్తున్నావు?? నాకు నువ్వు నచ్చావు. నేను నిన్నే పెళ్ళి చేసుకుంటాను"
స్వాతి చాలా కోపంగా "ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా. ఇంట్లో వాళ్ళకోసం మర్యాదగా మాట్లాడుతుంటే నాకు ఇష్టం లేదంటున్నా నన్నే పెళ్ళి చేస్కుంటా అంటున్నావు. ఎక్కడికెళ్తున్నానో నీకెందుకు చెప్పాలి. నేను చావటానికి వెళ్తున్నా. అప్పుడన్నా కృష్ణ వస్తాడు. నా తిక్కని వాడే భరించగలడు. నా ఏడుపుని వాడే ఆపగలడు. నేను నవ్వినప్పుడు వాడి కళ్ళలో వచ్చే మెరుపు ఎంత బావుంటుందో, అందుకోసమైనా నవ్వాలనిపిస్తుంది. వాడి గుండె చప్పుడు వింటున్న ప్రతీసారి మనసుకి ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. నా ప్రేమ ఎప్పటికి వాడికే. నా పక్కన స్థానం వాడిదే. మా అమ్మ, నాన్న, అన్నయ్య........ వీళ్ళ ముగ్గురి ప్రేమని తనలో చూపిస్తాడు. పెళ్ళి తర్వాత మా వాళ్లకి దూరంగా ఉన్నానని ఆలోచన కూడా రానీయడు, అంత గొప్పగా చూసుకుంటాడు. నా గమ్యం తనని చేరుకోటమే. ఒకప్పుడు తను నన్ను చుస్తే చాలు అనుకునేదాన్ని కానీ తను నన్ను గుండెల్లో దాచుకున్నాడు. అయినా, నేను మా బావని ఇష్టపడ్తున్నా అని చెప్పినా కూడా ఇంకా నన్నే పెళ్ళి చేస్కుంటానంటావేంటి?? పెళ్ళంటే తాళి కట్టటం కాదు, ఒకరి మనసులో ఒకరు స్థానం పొందటం. మా ఇద్దరి మనసులు కలిసిపోయినప్పుడే మా పెళ్ళి అయిపొయింది, నిన్ను నేను పెళ్ళి చేసుకోలేను. మర్యాదగా వెళ్ళిపో" అని అంటుండగా అతను స్వాతి చేతిని పట్టుకున్నాడు. స్వాతి కోపంగా చెయ్యెత్తి అతని వైపుకి తిరిగి ఆగిపోయింది
స్వాతిని తన దగ్గరగా లాక్కుని, పెదవుల మీద చిన్న ముద్దుపెట్టి, "ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్ళి చేస్కోవా"
"బావా.... " అంటూ హరీష్ ని గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులో తన ప్రేమనంత చూపిస్తూ, తను ఇన్నాళ్ళ నుంచి పడిన విరహాన్ని తెలిపింది. తనని గట్టిగా హత్తుకుని వాళ్ళ మధ్యన దూరాన్ని భరించలేకపోయానంది. స్వాతి ముద్దులోని భావాలని అర్థం చేస్కుంటూ, హరీష్ తన నడుము మీద చేయి వేసి దగ్గరకి లాక్కుని ఇంకో చేతిని స్వాతి తల మీద పెట్టాడు. వాళ్ళిద్దరి మధ్యన సమయం ఎంతసేపు ఆగిపోయిందో తెలీదు.
స్వాతి, హరీష్ ని ముద్దు నుంచి వీడి, తనని హత్తుకుని అలా ఉండిపోయింది. తనని అలాగే నుదిటి మీద ముద్దుపెట్టుకుని,
"స్వీటీ అయితే నన్ను పెళ్ళి చేస్కోవా, చెప్పలేదు"
స్వాతి "ఆహా చేసుకోను. నేను బావనే పెళ్ళి చేసుకుంటాను. నాకు తనే కావాలి"
"మరిందాకటి వరకు బావని వాడు - వీడు అన్నావ్, ఇప్పుడు మళ్ళీ, తను - మను లో కి వచ్చేసావ్" అన్నాడు నవ్వుతూ
స్వాతి మొహాన్ని హరీష్ గుండెల్లో దాచేస్కుంది. హరీష్... "ఇందాకా ప్రేమ ఎక్కువైపోయి అలా వచ్చేసిందా"
"మ్మ్"
"స్వీటీ .... నువ్వు నా దానివి అంటే నీ ప్రాణం నాదే కదరా. మరి నా ప్రణాన్ని తీసే హక్కు నీకెక్కడిది. చస్తాను అని చెప్తున్నావ్. అది నా ముందన్నా, వెనకన్నా కూడాను... అలా ఎలా అనగలిగావు. నీకేదన్నా అయితే నేనేం అవుతానో కూడా ఆలోచించవా. ఇంకోసారెప్పుడన్నా ఈ మాట నీ నోటి నుండి వస్తే ఇంకెప్పుడూ నీతో మాట్లాడను" అన్నాడు కొంచం కోపంగా.
"సారీ బావ. చాలా భయమేసేసింది. నిన్ను తప్ప ఎవరినీ నేను పెళ్ళి చేసుకోలేను బావ. నీకు దూరంగా ఉండలేను"
స్వాతి ని తన కౌగిట్లోంచి తీసి, "స్వీటీ నా కళ్ళలోకి చూసీ చెప్పు, నేను నిన్ను దూరం చేస్కుంటానా. నీతో మాట్లాడకుండా నేను మాత్రం ప్రశాంతంగా ఉండగలనా. మాట్లాడలేకపోయానంటే కారణం లేకుండా చేస్తానా. ఆ మాత్రం నమ్మకం లేదా నామీద"
"బావా..... నాకన్నా ఎక్కువ నిన్నే నమ్ముతాను. నువ్వు బిజీ గా ఉన్నావని తెలుసు, నువ్వెలా ఉన్నావో, నీకు కుదరట్లేదు, నువ్వే బెంగెట్టేస్కుని తిండి సరిగ్గా తినట్లేదో ఏమో, పడుకున్నావో లేదో మనసులో ఎంత టెన్షన్ పడేదాన్నో. అన్నయ్య దగ్గర ఏడుస్తూ మాట జారాను ఆరోజు. అది తప్పే" అంటూ మోకాళ్ళ మీద కింద కూర్చునిపోయింది కళ్ళకి చేతులు అడ్డుగా పెట్టుకునీ
హరీష్ ఖంగారుగా స్వాతి పక్కన కూర్చొని "స్వీటీ..... స్వీటీ.... ఏడువకురా......" అంటూ తన భుజాల మీద చేతులేసి దగ్గరకి తీసుకున్నాడు
స్వాతి గట్టిగా ఊపిరి తీస్కుని, మొహం మీద నుంచి చేతులు తీసేసి "లేదు బావా, నేను బానే ఉన్నాను. ఏడవటం లేదు. నేను బాధపడనని మాట ఇచ్చాను అన్నయ్యకి" అంది బలవంతంగా నవ్వుతూ
హరీష్ చిన్నగా నవ్వి, "నా బుజ్జి బంగారం...... బావ అలా అనకపోతే నేనొచ్చేవరకూ ఏడుస్తూ కూర్చుంటావ్ అని అన్నాడు పొద్దున్న"
స్వాతి అనుమానంగా, "నీకెలా తెలుసు, అన్నయ్య పొద్దున్న అన్నాడని" అంది గోడకి ఆనుకుని కూర్చుంటూ
హరీష్ తన పక్కనే కూర్చుని "అన్నీ నేను చూస్తూనే ఉన్నానురా. అన్వి నాకు వీడియో కాల్ చేసింది."
"నువ్వొస్తున్నావని నాకెందుకు చెప్పలేదు"
"నీకు పెళ్ళి చూపులు సరదా తీరుద్దాములే అనుకున్నాము. కానీ నువ్వేమో రివర్స్ లో ఎదురుగా ఉన్న నేను ఇష్టం లేను కానీ నేనంటేనే ఇష్టమని నాకే చెప్పావు" అన్నాడు నవ్వుతూ. "నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నాకే చెప్తున్నావు కానీ నువ్వే నాకు నచ్చావు నిన్నే పెళ్ళి చేసుకుంటాను అంటే నన్ను, నా గొంతుని ... గుర్తుపట్టలేదా "
స్వాతి ఆలోచిస్తూ తల పైకెత్తి..... "లేదు బావా..... ఎవడో వచ్చేసాడు, నీ నుంచి నన్ను దూరం చేసేస్తారనే భయం లో ఉన్నాను. అందుకే అసలు గమనించనేలేదు. అయినా కూడా....నాకెందుకు చెప్పలేదు"
"నిన్న బావ, నేను లంచ్ చేస్తూ ఎవరో ఆఫీస్ లో పెళ్ళి చూపులు కబుర్లొచ్చి అన్వి పెళ్ళి చూపులుకి వెళ్ళి చూడటానికి చాలా సరదా పడ్డావని చెప్పాడు. సరే అయితే రేపు నేనే వస్తాను అన్నాను. అప్పుడే బావ ఇదంతా ప్లాన్ వేసాడు. అందుకే అన్వి ని నిన్ననే పిలిచి, నన్నేమో నీతో ఇక్కడికొచ్చేవరకు మాట్లాడద్దన్నాడు. అప్పటికి, ఈ విషయంలో నువ్వు సర్ప్రైస్ ఏమో కానీ ఏడ్చి ఏడ్చి ఊరుని ముంచేస్తావని చెప్పాను. నిన్నేడవనీయకుండా చూస్కుంటా అన్నాడు. అందుకే ప్రామిస్ చేయమన్నాడు పొద్దున్న"
"అంటే అన్వి కి కూడా తెలుసా. ఇందాకా కూడా ఆ మాట చెప్పకుండా "తల ఎత్తి చూడవే ముందరా అని" అంది. నేనేమో పిచ్చమొహం లాగా వాగాను"
"తను అప్పటికి నీకు చెప్పింది కదా, ఇష్టం లేకపోతే నాకే చెప్పమని నువ్వేమో నా మొహం చూడకుండా మాట్లాడావు"
"అయినా కూడా మీరంతా ఒక్కటైపోయి నన్ను ఏడిపించారు. నువ్వు కూడా " అంది ఏడుపు మొహం పెడుతూ చిన్న పిల్లలాగా
"లేదురా.... నీకు సర్ప్రైస్ ఇయలనే కానీ ఏడిపించాలని కాదు బంగారం"
"సర్ప్రైస్ సంతోషాన్ని ఇయ్యాలి బావ. నువ్వు కాకుండా ఇంకెవరో చూడటానికి వచ్చారంటే నేనెలా సంతోషంగా ఉంటాను. అవును బావా..... నువ్వొక్కడివే వచ్చినా డౌట్ వచ్చేదేమో కానీ ఆ అమ్మాయి ఎవరూ, సంజన"
"హహహ..... తను వాసు వాళ్ళ ఫియాన్సే"
"వాసన్నయ్య కి పెళ్ళి సెటిల్ అయ్యిందా, నాకసలు చెప్పనేలేదు"
"మనం కాల్ చేస్తే వద్దామని బయటే వెయిట్ చేస్తున్నాడు, వాడితో పాటు అందరూను"
"అయ్యో, రమ్మను బావా"
"వస్తారులే కానీ, ముందర నీకు రెండు విషయాలు చెప్పాలి అవి చెప్పేసి అప్పుడు రమ్మని చెప్పచులే. వాళ్లొస్తే నువ్వు పారిపోతావ్ మళ్ళీ, ఇలా పక్కన కూర్చోవు కదా" అన్నాడు తన భుజం మీద తల వాల్చి
"సరే "
"స్వీటీ..... "
"చెప్పు బావా"
"ఎల్లుండి యూ ఎస్ వెళ్తున్నానురా. నిన్ననే తెలిసిందీ"
"అవునా..... మళ్ళీ ఎప్పుడొస్తావ్ బావా" బెంగగా అడిగింది స్వాతి
"వన్ మంత్ రా...... నేను వెళ్లకూడదని చాలా ట్రై చేసాను కానీ కుదరలేదు స్వీటీ"
స్వాతి, హరీష్ తల మీద తన తలని వాల్చి చేత్తో తన మొహం మీద ప్రేమ గా చేయి పెట్టి "బావా వన్ మంత్ యే కదా. నువ్వే వెళ్ళాలి అంటున్నారంటే నీ మీద వాళ్లకున్న కాన్ఫిడెన్స్. నీ హార్డవర్క్ ని వాళ్ళు గుర్తించారు. నీకిది మంచి అవకాశం బావా"
"కానీ నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉండటానికే అవలేదురా, అన్నీ రోజులంటే బెంగొచ్చేస్తోంది. అయినా నాకు చెప్తున్నావ్ కానీ నువ్వుంటావేంటి. ఇప్పటికే చూడు ఎలా అయిపోయావో, మొహమంతా పీక్కుపోయి"
"లేదు బావా..... నువ్వెళ్ళి రా. నేను బానే ఉంటాను. నాదొకే ఒక్క రిక్వెస్ట్"
"ఏంటిరా"
హరీష్ చేతి మీద ముద్దుపెట్టుకుంటూ "నువ్వు రోజులో ఒక్కసారైనా ఒక చిన్న మెసేజ్ పెట్టు, బానే ఉన్నావని చాలు. నిన్ను ఇంకేం సతాయించాను"
హరీష్ స్వాతి భుజం మీదనుంచి లేచీ తనని కౌగలించుకుని "సరే స్వీటీ. మరి నువ్వూ జాగ్రత్తగా ఉంటావు కదూ. బుద్దిగా చదువుకో, శుభ్రంగా తిని హాయిగా పడుకో. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటావు కదూ. నువ్వు బావుంటే నేనూ బావుంటానురా. నువ్విలా అయిపోతే నాకూ బాగోదు"
"అలాగే కృష్ణా ..... అవునూ రెండు విషయాలు చెప్పాలన్నావ్, ఇంకోటేంటి"
"అదా..... అదీ..... ఈ బ్లూ చీర లో ఎంత అందంగా ఉన్నావో....., టెంప్ట్ చేసేస్తున్నావురా" అంటూ స్వాతి నడుము మీద చేయి వేసి దగ్గరకి లాక్కున్నాడు.
"బావా.... నువ్వు నన్ను టెన్షన్ పెట్టకూ" అంటూ సిగ్గు పడుతూ దూరం జరిగి, "నువ్వు ఎల్లుండి నన్నొదిలేసి వెళ్తున్నావు కదా అందుకే ఇది పనిష్మెంట్. నీ దగ్గరకి రాను" అంది నవ్వుతూ.
"అప్పుడైతే నేనొచ్చాక నన్ను ఆపకూడదు మరి"
"నువ్వు వచేసాక నీ ఇష్టం"
"సరే, అందుకోసమన్నా త్వరగా వచ్చేస్తాను"
"హహ.... అదే కదా నాక్కావల్సింది కూడా"
హరీష్ నవ్వుతూ, "ఈలోపున ఇందాకటి లాగా ఇంకో ముద్దైనా పెట్టరా"
"ఆఁహాఁ అది కూడా నువ్వొచ్చాకే" అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకునీ, "వాళ్ళని రమ్మని చెప్పూ ఇంక. బాగోదు"
హరీష్ నవ్వుతూ వాసు కి కాల్ చేయబోతుంటే, స్వాతి ఫోన్ ఆపేసి "ఒక్క క్షణం బావా. ఎలాగో లేట్ అయిపొయింది కదా. అన్నయ్య ని లంచ్ కి ఏమన్నా తీస్కొచేయమనవా. నువ్వు ఈరోజుకి నాతో తినవా"
"నువ్వు తినిపిస్తానంటేనే ఇక్కడ తింటా, లేకపోతే నాకు నేను ఇంట్లో అయినా తినగలను"
"అందరి ముందు ఎలా బావా. అన్నయ్య కూడా ఉంటాడు. బాగోదు"
"సరే నేను ఇంటికెళ్ళిపోతా. వాళ్లకి రమ్మని చెప్తున్నా"
"అబ్బా వెళ్ళొద్దు. తినిపిస్తాలే. ముందైతే ఉండు" "తర్వాత సంగతీ కదా" అని మనసులో అనుకుంటూ
హరీష్ వాసు కి ఫోన్ చేసి రమ్మని చెప్పి, లంచ్ కూడా తీస్కొచేయమన్నాడు. వాసు అయోమయంగా "సరే" అని పెట్టేసాడు.
స్వాతి కింద నుంచి లేచీ, "బావా లే, సోఫా లో కూర్చో. వాళ్ళొచ్చే లోపు నేను డ్రెస్ మార్చుకుంటా" అంటూ చేయిచ్చింది లెమ్మన్నట్లుగా
హరీష్ స్వాతి చేయి పట్టుకుని లేచీ, స్వాతిని హత్తుకుని, "ఇంకెప్పుడూ నా గురించి బెంగ పెట్టుకునీ ఏడవటం, తినటం మానేయటం చేయకురా. నాకింకా బాధగా అనిపిస్తుంది. కావాలంటే కొట్టు అంతే కానీ నువ్వు డల్ గా ఉండకు. నేను పక్కన లేకపోయినా సరే, నువ్వెప్పుడూ ఇక్కడుంటావ్" అంటూ తన గుండెల మీద చేయి పెట్టుకుని, "నువ్వు బాధపడ్డావనుకో, ఇక్కడ నొప్పిగా ఉంటుంది. నీ ఇష్టం మరి"
"సరే బావా. బాధపడను. కానీ నువ్వు నీ హెల్త్ జాగ్రత్తగా చూస్కో"
"అలాగే. స్వీటీ..... చీర లో బావున్నావురా. మార్చుకోవాలా. ఇలాగే ఉండచ్చు కదా. పోనీలే మార్చుకో. నీకు ఇబ్బందిగా ఉండదు"
ఇంతలో బయటకి వెళ్ళినవాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ప్రదీప్ లోపలికి వస్తూ "బావా ఇంతసేపు పట్టిందా మా చెల్లి అలక తగ్గించటానికి"
హరీష్ "అలక ఏమి లేదు కానీ బావా.... మీ చెల్లి సైలెంట్ అనుకుంటాం, కనిపించదు కానీ చాలా వైలెంట్. సెకండ్ లో నా చెంప పగలగొట్టేసేదే"
స్వాతి హరీష్ ని కోపంగా చూడగా, వాసు "ఆ మాత్రం లేకపోతే నువ్వు ఆడేసుకోవు మా చెల్లెల్ని"
స్వాతి "థాంక్స్ వాసన్నయ్యా. నువ్వొక్కడివే నా పార్టీ" అంది ప్రదీప్ ని చూస్తూ.
"అన్నయ్యా, పెళ్ళి ఫిక్స్ అయ్యిందా?? నాతో చెప్పనేలేదు అసలూ. మీ ఆవిడ కూడా వీళ్ళతో కలిసి నన్ను ఆడేసుకుంది"
ప్రదీప్ "నేను ఏం చేసానురా అసలూ "
వాసు "హహ .... నేను అసలు ఈరోజు వచ్చిందే మిమ్మల్ని పెళ్ళికి పిలుద్దామని. ఈలోపు వీడు తనని లాక్కొచ్చాడు. ఎనీవేస్, తనే సంజన, నా వుడ్ బి... సంజు తను స్వాతి"
"హాయ్ స్వాతి.... సారీ...... ఇందాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. అలా అని పెళ్ళికి రావటం మానేయకండి"
"అదేం లేదండి. డెఫినిట్ గా రావటానికి ట్రై చేస్తాను"
వాసు..... "ట్రై ఏంటి, రావాల్సిందే. మీ అన్నయ్యకి కూడా చెప్పాము. హరీ ఆ టైమ్ కి వచ్చేస్తాడో లేదో తెలీదంటున్నాడు. నువ్వూ రాకపోతే ఎలాగా"
ప్రదీప్.... "అవును స్వాతి, వెళదాము"
"వస్తానులే అన్నయ్యా" అని ప్రదీప్ ని పట్టించుకోనట్లుగా వాసు కి చెప్పింది.
ప్రదీప్ "అన్వి ఇదేంటి నా మీద పీకల దాకా ఉన్నట్లుంది కదా. ఇందాకటి నుంచి కోపంగా చూస్తోంది నన్ను, నాతో మాట్లాడటమే లేదు"
"పొద్దున్న నీ ఓవర్ యాక్షన్ కి మరి కాలదా ఎవరికన్నా. వెళ్ళి బుజ్జగించుకో... అసలే ఇందాకా అన్నయ్య మీద చేయి లేపింది అంటున్నాడు, జాగ్రత్త" అంటూ నవ్వింది
"ఆగవే భయపెట్టకు"
వాసు "అవునురా హరీ .... లంచ్ తీసుకొస్తున్నామని చెప్పాము కదా, మళ్ళీ స్పెషల్ గా చెప్తావేంటి"
ఇందాకా హరీష్ లంచ్ తినమంటే తను తినిపిస్తేనే ఉంటా అని తనతో ఆడుకున్నాడా అనుకుని, హరీష్ కి మాత్రం వినిపించేలాగా "నన్నిందాకా బ్లాక్ మెయిల్ చేస్తావా. నేను నీకు అస్సలు పెట్టను" అంటూ లోపలికి వెళ్ళింది.
ప్రదీప్ "ఇప్పుడే వస్తాను. అన్వి లంచ్ కి ఆరెంజ్ చేయి" అంటూ స్వాతి వెనకాలే లోపలికి వెళ్ళాడు
హరీష్, వాసు ఏదో మాట్లాడుకుంటుండగా అన్విత, సంజన ఫుడ్ ఆరెంజ్ చేశారు
అన్విత .... హరీష్ కి సైగ చేసి "సైలెంట్ గా లోపలకి చూడు ప్రదీప్ బతిమాలుతున్నాడు"అని హరీష్ ని పంపింది నవ్వుతూ
లోపలికి వెళ్ళిన ప్రదీప్, "చిన్నూ ఏమయిందిరా నా మీద కోపంగా ఉన్నావు, నాతో మాట్లాడవా"
"మాట్లాడను...... పొద్దున్న నుంచి అనేవన్ని అనేసి, చేసేవన్నీ చేసేసి, ఇప్పుడొచ్చి ఏమయిందిరా మాట్లాడవా అంట"
"నేనేం చేసానురా"
"ఒక్కసారి బావా గురించి ఏదో బుద్ధిలేక వాగానే అనుకో, అది పట్టుకుని అలాంటివాడి కోసం ఎందుకు బాధపడటం అంటావా. నాకు ప్రతి విషయంలో మంచి చెడు చెప్తావు అలాంటిది బావని నువ్వే అంటావా. అసలా మాటే ఎక్కువగా బాధనిపించింది"
"మరి పొద్దున్న నిన్ను ఈ ప్రోగ్రాం కి ఎలా కన్విన్స్ చేయాలో తెలీలేదురా. అయినా బావ వెనకాల మాట్లాడితే తప్పు కానీ తన ఎదురుగానే చెప్పానుగా. తనేమి ఫీల్ అవలేదు.. నువ్వలా ఉండకురా చిన్నూ"
"ఆ.... ఇదో పెద్ద ప్రోగ్రాం. అసలు అన్నయ్యా, నీకిలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి. అన్వి తో చేరి నువ్వూ చిన్న పిల్లాడి వేషాలు వేస్తున్నావు"
"చిన్నూ మధ్యలో అన్వి ని ఎందుకంటావు"
"ఆమ్మో అన్నయ్యా.... ఇంత మాట పడనీయట్లేదే దాన్ని. అప్పుడే నా మీద అరుస్తున్నావా, నేనేదో సరదాగా అంటే"
స్వాతి ని దగ్గరకి తీసుకొని "అరవలేదురా. అన్వి, నేనో చేసింది కాదు ఈ ప్లాన్ అంతా బావది. తనే చెప్పాడు, ఇంకోక్క రోజు ఆగి ఈరోజు వస్తే, పెళ్ళి చూపుల్లో తనని చూసీ పడిపోతావు అన్నాడు. ఒద్దురా బావా అది బాధపడ్తుంది అంటే అది ఏడిస్తే నేను ఊరుకోను వెంటనే వచ్చేస్తాలే అన్నాడురా" అన్నాడు ప్రదీప్ దీనంగా మొహం పెట్టి
"చచ్చాను..... అడ్డంగా దొరికిపోయాను" అని తలమీద కొట్టుకునేసరికి హరీష్ వైపు స్వాతి, ప్రదీప్ ఒకేసారి వెనక్కి తిరిగి చూసారు.
వాళ్ళు చూసేసరికి హరీష్ నోటి మీద చేయి పెట్టుకునీ చల్లగా జారుకున్నాడు.
ప్రదీప్ నవ్వుతూ కోపంగా చూస్తున్న స్వాతితో "పాపం చిన్నూ, ఏదో నీకు సర్ప్రైస్ ఇద్దామనుకున్నాడు. కోప్పడకు"
"నాకేం కోపం లేదన్నయ్యా. సరదాగా చూసా అలా. అయినా ఇందాక నాకు మొత్తం నీ ప్లాన్ అని చెప్పాడు. అందుకే కోపంగా చూసేసరికి సైలెంట్ గా వెళ్ళిపోయాడు"
"ఓహ్. పోనీలే. నువ్వు చేంజ్ చేస్కుని రా" అని బయటకి వెళ్ళిపోయాడు
స్వాతి, చీర మార్చుకుని లంగా వోణి వేస్కుని వచ్చింది. "వావ్.... ముద్దుగా ఉన్నావురా. ఇందాకా డ్రెస్ అన్నావు మళ్ళీ ఇదేసుకున్నావే" అన్నాడు హరీష్ స్వాతి చెవిలో
"నీకు ఇలాగే బావుందన్నావ్ కదా. నీకోసమే" అంటూ స్వాతి అన్విత దగ్గరకి వెళ్లిపోయింది.
తినడానికి కూర్చోగానే, వాసు... "సరదాగా ఎవరి పార్టనర్ కి వాళ్ళు గోరు ముద్దలు పెట్టాలి. పెద్దవాళ్ళుంటే ఇలాంటి ఛాన్స్ రాదు కదా. ఈరోజు ఫుల్ ఎంజాయ్"
అన్వి " మీకు కావాలంటే మీరు కానీయండి. మేమేమి అనుకోము"
"కాదు కాదు అందరమూను" అంటూ సంజన పట్టుబట్టి, అన్వితని ప్రదీప్ కి తినిపించమంది.
స్వాతి... వాసుకి మాత్రమే వినిపించేలా "అన్నయ్యా ఇది మీ ఫ్రెండ్ ప్లానే కదా"
"అవును సిస్టర్. సంజుతో నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తానని బెదిరించాడు. అందుకే ఒపుకోవాల్సొచ్చింది" అన్నాడు నవ్వుతూ
అలా స్వాతి హరీష్ ఒకరికొకరు తినిపించుకుని, మిగతా రోజంతా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపి, సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు.
Comments
Post a Comment