Posts

Showing posts from February, 2026

56

 lహరీష్.... "స్వీటీ,  నేను రెడీ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ చేసేసి ఆఫీస్ కి బయల్దేరుతాను" అన్నాడు హరీష్ నిద్ర లేస్తూనే  "సరే కృష్ణా"  "ఏమయినా చెప్పాలంటే ఇప్పుడే చెప్పేయి" అన్నాడు స్వాతిని దగ్గరకు తీసుకుంటూ స్వాతి సిగ్గుపడుతూ.... "కృష్ణా...  అదీ... మరీ.. "  "ఏంటిరా"  "ఆఫీస్ కి జాగ్రత్తగా వెళ్ళిరా" అంటూ దగ్గరకి తీసుకున్న హరీష్ ని తోసేసి నవ్వుతూ రూమ్ బయటకి పరిగెత్తింది.   తను కిందకి వచ్చేలోపున,  సత్య గారికి వంటలో సాయం చేసి,  హరీష్ కి బాక్స్ రెడీ చేసి పెట్టేసి,  టిఫిన్ చేసింది. "అత్తయ్యా.... ఈరోజు టీ నేను పెట్టనా అందరికీ"  "అందరికీ... ఎవరున్నారు. నేను మావయ్యా తాగేసాము. వాడికి నువ్వే కలుపులే. నువ్వూ ఏమైనా తాగు కొంచం"  స్వాతి చిన్నగా నవ్వి,  "సరే అత్తయ్యా"  ఇంతలో హరీష్ పిలవటంతో,  రూమ్ లో కి వెళ్ళి "ఏంటి బావా...  పిలిచావు"  "స్వీటీ....  ఇదిగో చందమామ పుస్తకాలు. బోర్ కొడితే చదువుకుంటావని తీసి పెట్టాను"  "ఆఁహాఁ.....  ఎప్పుడు తీసావు"  "అంటే పెళ్ళికి ముందరే తీశాను. అప్పుడే చూప...

55

 హరీష్ చెప్పింది విన్నాక అప్పటి వరకు స్వాతి మొహంలో ఉన్న నవ్వు మాయమయింది. తన ఒడిలో కూర్చున్నది లేచీ డెక్ దగ్గరకి వెళ్ళి నిల్చుంది. ఉబికి వస్తున్న కన్నీటిని దాచటానికి ప్రయత్నిస్తోంది "స్వీటీ.. " అంటూ ఖంగారుగా తన వెనకే వెళ్ళాడు హరీష్  స్వాతి చేత్తో ఆగమన్నట్లుగా పెట్టి,  "బావ నేను బానే ఉన్నాను,  భయపడకు. కొంచం టైమ్ ఇయ్యి సద్దుకుంటాను"  "స్వీటీ.....  నీ చేయి నన్ను దగ్గరకి రావద్దంటోంది. నువ్వేమో టైమ్ కావాలంటున్నావ్....  అలా దూరంగా ఉండకురా.... " అంటూ  హరీష్ స్వాతి ని వెనకనుంచి హత్తుకుని,  "నువ్వు వద్దన్నా సరే నీకు దూరంగా ఉండలేను. నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయమేసి చెప్పలేకపోయాను కానీ,  దాచాలన్న ఉద్దేశం లేదురా. నిన్ను బాధపెట్టాలని కాదు"  "కృష్ణా ఇప్పుడు నువ్వెందుకు భయపడ్తున్నావ్, కోపం వచ్చి నీకు దూరంగా వెళ్ళిపోతాననా. నువ్వు చెప్పగానే ఒక్క క్షణం నా కన్న తండ్రీ తాగినప్పుడు నన్ను ఎలా కొట్టేవాడో గుర్తొచ్చి భయమేసింది" స్వాతి ఆపుకుంటున్న కన్నీళ్ళు జలజలా పరవళ్లు తొక్కుతూ చెక్కిళ్లని దాటి ఆమెని చుట్టేసిన హరీష్ చేతిని అందుకున్నాయి. "స్వీటీ..... ...

54

 స్వాతికి ఫ్లైట్ ఎక్కటం అదే మొదటి సారి.  ఎంత మాములుగా ఉండటానికి ప్రయత్నించినా,  ఫ్లైట్ ఎక్కేటప్పుడు కాళ్ళు వణికాయి. హరీష్ తన భుజం మీద చెయ్యేసి పట్టుకుని నడుస్తూ ఉంటే తన కళ్ళలోకి చూసింది. హరీష్ నవ్వుతూ నడుస్తున్నాడు కానీ అతని కళ్ళు మాత్రం "ఏమి కాదు,  నేను పక్కనే ఉన్నాను" అనే భరోసానిచ్చాయి.  కొచ్చిలో  రిసార్ట్ కి  వెళ్లేసరికి రాత్రయిపోయింది. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది.  "స్వీటీ....  ఇందాకటి నుంచి ఎందుకురా నీలో నువ్వు అంతలా నవ్వుకుంటున్నావు"  "రిసార్ట్ కి వచ్చేటప్పుడు,  మళ్ళీ రిసెప్షన్ నుంచి మన రూమ్ వరకు ఇక్కడ అన్నీ బోట్ లే. ఆ బోట్ ప్రయాణం చేస్తున్నంత సేపు నీ పుట్టినరోజుకి మనం బొట్ లో వెళ్ళటం,  నీతో కేక్ కట్ చేయించటం అవన్నీ గుర్తొచ్చి నవ్వొచ్చింది"  "హాహా....  అది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ. నేనూ ఇందాక అదే గుర్తు చేస్కుంటూ ఉన్నా. ఆరోజు అది పెద్ద సర్ప్రైస్ రా. చాలా కాలం తర్వాత నీ వలనే మళ్ళీ సెలెబ్రేట్ చేస్కున్నాను" అంటూ స్వాతి ని ముద్దుపెట్టుకున్నాడు.  స్వాతిని అనుమానంగా చూస్తూ,  "స్వీటీ....  ప్ర...

53

 స్వాతి.... "హలో నాన్నా....  ఎలా ఉన్నారు"  రామ్ గారు.. "బావున్నాము తల్లీ.  నువ్వెలా ఉన్నావురా.  అక్కడంతా బావుందా"  "నేను బావున్నాను.  మీరేంటి డల్ గా ఉన్నారు"  "డల్ ఏమిలేదురా.  హరీ ఎలా ఉన్నాడు"  "బావ కూడా బావున్నారు.  నాన్నా,  మీరు ఇంట్లోనే ఉన్నారా"  "ఇంట్లోనే ఉన్నాము. వస్తున్నారా తల్లి"  "రావాలనుంది ....  మిమ్మల్ని చూడాలనుంది నాన్నా"  "రారా బంగారు. ఇంట్లోనే ఉన్నాము. వచ్చేయండి"  "బావని అడుగుతాను. సాయంత్రం ప్రయాణం కదా,  ఏమనుకుంటాడో  అని ఆలోచిస్తున్నా.  అడిగి మెసేజ్ చేస్తాను వచ్చేదుంటే"  "తనని ఇబ్బంది పెట్టకమ్మా. నీకు కుదరకపోతే మేమే వచ్చి కలుస్తాము"  "అలాగే నాన్న "  "సరేనమ్మా..... జాగ్రత....  ఉంటాను"  పద్మ గారు ఆయన మాటలు వినీ,  "వస్తోందా అదీ"  "రావాలనుంది, ప్రయాణం కదా ఇప్పుడిక్కడికి వస్తా అని హరిని అడగటానికి మొహమాట పడుతోంది"  "దీని మొహమాటం ఏంటో. సరేలెండి .....  అది మాట్లాడింది కదా,  కొంచం తృప్తి గా ఉందా"  "పెళ్ళయ్యి అప్పుడే పది రోజు...

52

  ప్రదీప్ మెసేజ్... "చిన్నూ ఎలా ఉంది బావా" హరీష్ దానికి రిప్లై చేసాడు...."నిన్న వచ్చాక కొంచం సేపటికి సద్దుకుంది బావ. నేను నీతో ఒక్క సారి మాట్లాడాలి తర్వాత" స్వాతి రెడీ అయ్యి వచ్చి హరీష్ పక్కన కూర్చుంది.  హరీష్ తనని దగ్గరికి తీసుకొబోతుంటే,  "బావా... ఫ్రెష్ అయ్యిరా ముందర.  లేవగానే ఫోన్ చూస్తున్నావు" "మరేం చేయమంటావు, నిన్ను చూద్దామంటే నేను లేచేసరికి వాష్రూమ్ లో కి దూరుతున్నావు,  అయినా నువ్వు మాత్రం లేవగానే ముద్దు పెట్టుకోవట్లేదేంటి. ఒక్క ముద్దురా... " స్వాతి .... "కృష్ణా....  మారం చేయకుండా  ఫ్రెష్ అయ్యిరా... లే....కావాలంటే అప్పుడు ముద్దు పెట్టుకోలే" హరీష్ వాష్రూమ్ లో కి వెళ్తూ,  "ముద్దు కోసం ఎంతలా బతిమాలించుకుంటున్నావురా. దీనికి వచ్చి పనిష్మెంట్ ఇయ్యకపోతే చూడు" స్వాతి నవ్వుకుని కిందకి వెళ్ళింది. ఎవరూ ఇంకా లేవకపోవటంతో,  దేవుడి దగ్గర దీపం పెట్టుకునీ,  హరీష్ కి టీ ఇద్దామనుకుని,  అత్తయ్య ఇప్పుడే వంట చేయకూడదని చెప్పటం గుర్తొచ్చి హరీష్ దగ్గరకి వెళ్ళింది. హరీష్ స్నానం చేసి వచ్చి రెడీ అవటం చూసీ,  "కృష్ణా....  ఇప్పుడు చెప్పు....

51

 హాల్ లో అందరూ కబుర్లు చెప్తుండగా అన్విత స్వాతిని లోపలికి రమ్మనమని సైగ చేసి వెళ్ళిపోయింది.   స్వాతి... "ఏంటే పిలిచావ్"  "ఏమైనా కబుర్లు చెప్పవే. పొద్దున్న,  మా అన్న గురించైతే ఎంతైనా చెప్పచ్చన్నావ్ కదా. మరీ అంతలా ఏం చేసేసాడేంటి" అంది అన్విత,  కథ వినటానికి రెడీ అయినట్లుగా మంచం మీద కూర్చుని  "హాహాహ...ఏంటే అంత ఇంటరెస్ట్. నేనింకేంటో అనుకుని వచ్చా. నేనెళ్తున్నా"  "ఆగవే. కూర్చో. వాళ్ళేవో మాట్లాడుకుంటారులే కొంచం సేపు"  "హేయ్ పాపం బావ కి బోర్ కొడ్తుందే"  "బోరా.... వాళ్ళు రాజకీయాలు డిస్కషన్ మొదలెట్టారు. ఇప్పుడప్పుడే అవ్వదులే కానీ నువ్వు చెప్పు"  "నీ సరదా....  ఏం చెప్పాలే"  "సరేలే నేను చెప్తా వింటావా"  "సెన్సార్ అయితే చెప్పకు సెన్స్ లేకుండా"  "సరే....లే.... అవి కాదు కానీ....  మీ అన్నయ్య నేను జాబ్ చేయచ్చన్నారు.  అత్తయ్యా వాళ్ళు కూడా నా ఇష్టం అన్నారు" అంది ఆనందంగా  "ఒహ్హ్. . .  అది తెల్సిందేలే.......  మా అన్నయ్య ఒద్దంటాడని నేనూ అనుకోలేదు .. మరింతకీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావ్ ట్రయల్స్...

50

అప్పుడే సూర్యుడు ఇప్పుడే రావాలా వొద్దా అని ఆలోచిస్తూ పైకి వస్తున్నాడు.  అలవాటుగా స్వాతికి పొద్దునే మెలుకువొచ్చేసింది.  ఎదురుగా హరీష్ తనకి దగ్గరగా పడుకుండటం చూసీ చిన్న ముద్దు తన పెదవులపై పెట్టింది. ఆ స్పర్శ తెలిసినట్లుగా,  హరీష్ నిద్రలోనే చిరునవ్వు వచ్చింది. స్వాతి బద్ధకంగా లేచీ చుట్టూ చూసీ,  ఇందాక హరీష్ ని చూస్తూ మర్చిపోయిన విషయం ఇప్పుడు గుర్తొచ్చి,  నిట్టూర్చింది.  హరీష్ పడుకుని,  స్వాతి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ,  "ఏమాలోచిస్తున్నావురా" అన్నాడు బద్దకంగా తన చేతుల్ని ముద్దు పెట్టి విడిపించుకుంటూ,  "ఏమీ లేదు కృష్ణా" అంది నవ్వుతూ స్వాతిని మళ్ళీ అలాగే చేయి వేసి వెనక్కి వాల్చి, తన కళ్ళలోకి చూస్తూ,  ముంగురులు సరిచేస్తూ,  "నాతో చెప్పవా"  "ఇల్లు గుర్తొచ్చింది. ఈరోజు నుంచి ఒక కొత్త లైఫ్ కృష్ణా. ఆ లైఫ్ లాగా ఉండదు కదా" అంది బాధగా  "స్వీటీ నేనున్నాను కదా ఏ లైఫ్ అయినా నువ్వు హ్యాపీగా ఉండేలా చూడటానికి" అన్నాడు ముద్దు పెట్టుకుంటూ  "థాంక్స్ కృష్ణా"అంటూ తనని హత్తుకుని,  లేవబోయింది.  "గువ్వ పిట్టలాగా అలా గుండెల...