56
lహరీష్.... "స్వీటీ, నేను రెడీ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ చేసేసి ఆఫీస్ కి బయల్దేరుతాను" అన్నాడు హరీష్ నిద్ర లేస్తూనే
"సరే కృష్ణా"
"ఏమయినా చెప్పాలంటే ఇప్పుడే చెప్పేయి" అన్నాడు స్వాతిని దగ్గరకు తీసుకుంటూ
స్వాతి సిగ్గుపడుతూ.... "కృష్ణా... అదీ... మరీ.. "
"ఏంటిరా"
"ఆఫీస్ కి జాగ్రత్తగా వెళ్ళిరా" అంటూ దగ్గరకి తీసుకున్న హరీష్ ని తోసేసి నవ్వుతూ రూమ్ బయటకి పరిగెత్తింది.
తను కిందకి వచ్చేలోపున, సత్య గారికి వంటలో సాయం చేసి, హరీష్ కి బాక్స్ రెడీ చేసి పెట్టేసి, టిఫిన్ చేసింది.
"అత్తయ్యా.... ఈరోజు టీ నేను పెట్టనా అందరికీ"
"అందరికీ... ఎవరున్నారు. నేను మావయ్యా తాగేసాము. వాడికి నువ్వే కలుపులే. నువ్వూ ఏమైనా తాగు కొంచం"
స్వాతి చిన్నగా నవ్వి, "సరే అత్తయ్యా"
ఇంతలో హరీష్ పిలవటంతో, రూమ్ లో కి వెళ్ళి "ఏంటి బావా... పిలిచావు"
"స్వీటీ.... ఇదిగో చందమామ పుస్తకాలు. బోర్ కొడితే చదువుకుంటావని తీసి పెట్టాను"
"ఆఁహాఁ..... ఎప్పుడు తీసావు"
"అంటే పెళ్ళికి ముందరే తీశాను. అప్పుడే చూపిస్తే దాంట్లో మునిగిపోతావని చెప్పలేదు"
"నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు మరి. నాకెప్పుడో వాసన తగిలింది. అవి ఇప్పటికీ రెండు సార్లు చదివేసా"
"ఎప్పుడు చదివావురా"
"నువ్వు స్నానం చేస్తున్నప్పుడో, కింద కబుర్లు చెప్తున్నప్పుడో, మధ్యాహ్నం పడుకున్నప్పుడో, నువ్వు పక్కన లేని ప్రతి నిమిషం లో చదివేసా. హహహ "
"సరేలే సాయంత్రం వేరేవి తీద్దాములే"
"నేను తీస్కుంటాలే బావా..... పర్వాలేదు"
"ఏంటి తీసుకునేది, నువ్వు జిమ్నాస్టిక్స్ చేయకు. అయినా త్వరగానే వచేస్తానులే ఈరోజు"
"హ్మ్మ్..... సరేలే"
"స్వీటీ.....ఆఫీస్ కి వెళ్ళి పని చేసుకోవాలంటే ఎనర్జీ ఉండాలి కదా. ఏమైనా ఇయచ్చు కదరా"
"ఆ ... టీ రెడీ గా ఉంది బావా, టిఫిన్ కూడా రెడీ. నీదే ఆలస్యం"
"ఎనర్జీ అంటే అది కాదే టింగరి" అంటూ తల మీద చిన్నగా తట్టాడు
"మరింకేం కావాలి బావా.... " అంది అమాయకంగా మొహం పెట్టి
స్వాతిని తనమీదకి లాగి, ముద్దుపెట్టుకుని, "నాకు కావాల్సిన ఎనర్జీ డ్రింక్ ఇదీ, టిఫిన్ అంటే... "
"బావా.... అర్థమయ్యింది..... చెప్పక్కర్లేదు.... నీకెప్పుడూ ఇంతేనా. వేరే పని లేదేంటి. టైమ్ అవుతోంది. పదా"
"ఏంటిరా అరుస్తున్నావు"
స్వాతి నవ్వుతూ, .... "అయ్యో అరవలేదు బావా.... గట్టిగా ప్రేమ చూపించా అంతే. సరే కాని ఇలాగే కూర్చుంటే కింద టిఫిన్ చల్లారిపోతుంది. రా బావా"
ఇద్దరూ కిందకి వెళ్ళి, హరీష్ టిఫిన్ చేసాక టీ తాగుతూ సోఫా లో కూర్చున్నాడు. మహేశ్వర రావు గారు బయట నుంచి వచ్చి,
"ఏంటిరా హరీ.... త్వరగా వెళ్తున్నావా ఈరోజు"
"లేదు నాన్నా. రెడీ అయ్యి కూర్చున్నా అంతే. టైమ్ ఉంది. మీరేంటి వాకింగ్ నుంచా. ఈ టైమ్ వరకూ వాకింగ్ ఏంటి. ఎండొచ్చేసాక"
"వాకింగ్ చేసి వస్తూ వస్తూ గుడి లో కొంచం సేపు కూర్చుంటానురా. ఈరోజు ఇంకా త్వరగా వచ్చాను, నువ్వెళ్ళిపోతావెమోను, నీతో మాట్లాడాలని"
"చెప్పండి నాన్నా. టైమ్ ఉందిలే"
"అమ్మా స్వాతి నువ్వూ ఇటొచ్చి వాడి పక్కన కూర్చో. మీ అత్తయ్యని కూడా రమ్మనూ"
"ఏంటి నాన్నా. అందరినీ రమ్మంటున్నారు. ఏంటి అంత ముఖ్య విషయం"
ఇంతలో సత్యగారు, స్వాతి వచ్చి కూర్చున్నారు.
మహేశ్వర రావు గారు.... "హరీ నీ శాలరీ ఇప్పటి వరకు రాగానే, నాతో పాటు ఉన్న జాయింట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా పెట్టావు కదా"
"అవును... అయితే"
"ఆ అకౌంట్ నుంచి నాది తీసేసి స్వాతి ని ఆడ్ చేయి. లేదా నన్ను తీస్కెళ్ళి చేయించమంటే చూస్తాను"
హరీష్ స్వాతిని ఒకసారి చూసీ, "నాన్నా.... ఇప్పుడవన్నీ ఎందుకు"
సత్య గారు కూడా కొంచం అసహనంగా, "అవును. ఎవరి పేరుంటే ఏంటి. మార్చటమెందుకు. ఇప్పుడు దీని కోసం అందరినీ కూర్చోపెట్టి ఏదో సమావేశాలు పెట్టారు పొద్దునే" అంటూ రుసరుసలాడారు
మహేశ్వర రావు గారు... "మన ఇంట్లో ఏదీ నేనొక్కడినే డెసిషన్లు తీసుకోలేదు. అందులోను డబ్బు విషయాలు ఇంట్లో ఆడవాళ్ళకీ తెలియాలన్నది నా ఉద్దేశం"
"సరే నాన్నా మీ ఇష్టం, తన ఇష్టము. నాకే అభ్యంతరము లేదూ"
ఆ మాటకి అప్పటి వరకూ నేల చూపులు చూసిన స్వాతి, హరీష్ వైపు చూసీ మళ్ళీ తల దించేసుకుంది. ఆ చూపుకి అర్థం తెలిసిన హరీష్ మనసులోనే నవ్వుకుని, స్వాతితో, "నన్ను కోపంగా చూస్తావేంటి. నువ్వే చెప్పచ్చుగా నాన్నతో. సరేలే.... నాన్నా.... మీకు వీలున్నప్పుడు ఆ బ్యాంకు పనేదో చూస్కోండి అయితే. ఇప్పుడు ఓకే నా " అంటూ మళ్ళీ స్వాతిని చూసీ అడిగాడు
హరీష్ వాళ్ళ అమ్మగారికి ఇవేవి నచ్చటం లేదు. కొడుకు మీద వాళ్లకున్న అధికారాన్ని కోడలు లాగేసుకుంటున్నట్లుగా ఉంది ఆవిడకి. కానీ కొడుకు ఆమె ఇష్టమే అంటున్నాడు, మొగుడు మీ ఇద్దరి జీవితం అంటున్నారు..... స్వాతి మీద చిన్నగా కోపం, కానీ ఏమి మాట్లాడలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉండిపోయారు
మహేశ్వర రావు గారు, .... "అదేంటమ్మా. వాడి మీద కోపడ్డం ఎందుకు. అది మీ ఆయనదే కదా. నాకూ అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఈరోజే వెళ్ళి నీ పేరు మీదకి మార్చుదాము, సరేనా"
ఈసారి స్వాతి, ఆయన వైపు చూసింది.
మహేశ్వర రావు గారు, ..... "అయ్యయ్యో అదేంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడేమయ్యిందనీ"
హరీష్ కూడా అప్పటి వరకు తన కన్నీళ్ళని గమనించలేదు. వాళ్ళ నాన్నగారు అలా అనగానే స్వాతి కన్నీళ్ళు తుడవబోయాడు. కానీ హరీష్ చేతిని తోసేసి, "ఏంటి మావయ్యా ఇదీ. నేనెప్పుడైనా ఇది మా ఆయనది అని మాట్లాడానా. డబ్బు విషయాల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా. తను ఏం చేసినా కూడా, మీ తర్వాతే నేను. తనని కూడా ఎప్పుడూ తన జీతం ఎంతో దాన్ని ఏం చేస్తున్నాడో అడగలేదు, ఇప్పుడు మీరు చెప్పేవరకూ కూడా నాకు తెలీదు. నాకు తన మీద నమ్మకముంది, లైఫ్ లో నాకైనా ఎక్కువ ప్లానింగ్ తో, పొదుపుగా ఉంటాడు. తను మీ పేరు మీద ఉంచాలనుకున్నాడంటే అది ఆయనకీ మీ మీద ఉన్న గౌరవం. దాన్ని నేనెందుకు మార్చాలనుకుంటాను. నాకు బావ అంటే ప్రాణం, తను కావాలి కానీ నేను ఏనాడు తన సంపాదన కావాలనుకోలేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే, ఉన్నాడుగా మీ ఎదురుగానే, ఇందాకటి నుంచి నన్ను అన్ని మాటలు అంటున్నాడుగా, అడగండి తనని. తనకి జాబ్ వచ్చింది అన్నప్పటి నుంచి ఈరోజు వరకు తన శాలరీ కానీ ఖర్చులు కానీ దేనికి లెక్క అడగలేదు. అవునో కాదో అడగండి. నాకు మీరందరు కావాలి. ఈ డబ్బులు టాపిక్ తీసుకొచ్చి ఈరోజు నేను పరాయిదానిలాగా మాట్లాడుతున్నారు"
హరీష్ "అది కాదురా, నీ గురించీ నాకు తెలీదా చెప్పు. నువ్వేమంటావా అనే సరదాగా అన్నాను. ఇలా ఏడుస్తారేంటి" అంటూ ఓదార్చాడు.
మహేశ్వర రావు గారు, "అదేంటమ్మా, నిన్ను పరాయిదాన్ని చేయటమేంటి. ఈ ఇంటికి కోడలివైన కూతురివైన నువ్వేను. అందరికైనా ఎక్కువ నాకు నువ్వేనమ్మా. సరే ఈ విషయం మళ్ళీ అననులే. నువ్వు అలా బాధపడకు"
సత్యగారికి, స్వాతి మీద మొదలైన చిన్న అసూయా, ద్వేషాలు మొలకెత్తకముందరే నశించిపోయాయి. స్వాతి స్వభావాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేస్కుంటున్నారావిడ.
"స్వాతి...." అంటూ ఆమె పక్కకి వెళ్ళి, "ఇంత చిన్న విషయానికి బాధపడ్తారా చెప్పు. మీ మావయ్య మళ్ళీ అడగనన్నారు కదా. ఇంక నువ్వూ ఏడుపు ఆపెయ్యాలి. పోనీ మావయ్యని సారీ చెప్పమందామా"
"అత్తయ్యా..... మావయ్యా సారీ చెప్పటమేంటి. ఆయనేదో నాకు మంచి చేద్దామనుకున్నారు కానీ నాకలాంటి మంచి ఇష్టం లేదని తెలీదు కదా"
"సరే అయితే మరి కళ్ళు తుడుచుకో. ఇదిగో మీ ఆయన ఈరోజు పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ ఆఫీస్ కి వెళ్తుంటే ఏడుస్తూ పంపిస్తావా. తప్పు కదా. వెళ్ళి మొహం కడుక్కునిరా. వాడూ బయల్దేరతాడు"
స్వాతి హరీష్ వైపు కోపంగా చూసీ అక్కడ నుంచి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక,
"ఏరా.... నీకు అర్థమైతే నువ్వు చెప్పద్దు. అన్నిటికీ ఆటలేనా. అనవసరంగా తనని బాధపెట్టాము అందరమూ. వెళ్ళి తనని తీస్కునిరా" అంటూ కొడుకుని మెల్లిగా మందలించి పంపించారు
హరీష్ లోపలికి వెళ్ళాక, "ఏంటి సత్య నీకు అర్థమయ్యిందా స్వాతి అంటే నాకెందుకు అంత ఇష్టమో. నా చెల్లెలి కూతురని కాదు, అదెప్పుడూ తన చుట్టూ ఉన్నవాళ్ళ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. దాని మొగుడు సంపాదన దానికిస్తానంటే నీ మనసు చివుక్కుమంది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, నీ కొడుకు నీకు దూరమైపోతాడనిపించింది. కానీ వాడెప్పుడూ తనకి భర్తకైనా, ముందర మన కొడుకని చెప్పింది. చిన్నపిల్ల అయినా ఎంత ఉన్నతంగా ఆలోచించింది"
"అవునండి, మీరు చెప్పేది నిజమేను. కానీ అన్నీ తెలిసినా, అమ్మనండి నేను. నా బిడ్డే నాకెక్కువ. నా నుంచి వాడు దూరమైపోతాడేమోననే బెంగ నాకు ఎప్పుడూ ఉంటుంది, కోడలు మంచిదని తెలిసినా కూడా" అని లోపలికి వెళ్ళిపోయారు
హరీష్ స్వాతి దగ్గరకి వెళ్ళి, .... "స్వీటీ... సారీ రా. నువ్వెంటో నాకు తెలుసు. కానీ నీ నోటితో నువ్వే చెప్తే నాన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అని అలా అన్నాను. నిన్ను బాధపెట్టాలని కాదు. అలా డల్ గా ఉండకురా, నేను వెళ్ళలేను"
"అయ్యో నేను బానే ఉన్నానండి. మీరు బయల్దేరండి. లేట్ అవుతుందేమో మీకు. బాక్స్ సద్దేసానండి. ఇస్తాను పదండి"
"ఓయి ఏంటిరా అన్నీ మీకు లు, అండి లు. మాములుగా మాట్లాడు. నాకు నచ్చదని తెలుసు కదా"
"నన్ను మీరు సతాయించారు కదండీ, మరి నేను ఏమి చేయగలను చెప్పండి. నేనెంత ఫీల్ అయ్యానో మీకు తెలియాలి కదండీ. అందుకే ఈరోజంతా ఇలాగే మాట్లాడతానండి"
హరీష్.... "ఓహో అలాగా అండి, అయితే ఈరోజు నేను ఆఫీస్ కి వెళ్ళనండి. మీరు తిన్నగా మాట్లాడేవరకు మిమ్మల్ని ఈ గదిలో నుంచి కదలనీయనండి. మంచిగా ఉంటే మాట వినటం లేదండి. మీ పైత్యం ఎలా వదిలించాలో మాకూ తెలుసండి"
"అబ్బా బావా.... చెయ్యొదులూ, నొప్పెడుతోంది"
"ఏ ... వెంటనే దారిలోకి వచ్చేసావ్"
"అందుకని అంత గట్టిగా లాగుతావా. అయినా చేసిందంతా నువ్వే కదా"
"సారీ చెప్పాను కదా. ఇప్పటికైనా శాంతించి ఒకసారి నవ్వితే నేను బయల్దేరుతా. ఇప్పటికే లేట్"
"ఏం మానేస్తా అన్నావుగా ఇప్పుడే"
"మానేయనా అయితే"
"హాహా..... ఒద్దులే వెళ్ళిరా బావా... సరదాగా అన్నాను. పదా"
"ఆఁహాఁ.... నాకియ్యల్సింది ఇచ్చేస్తే నేను బయల్దేరుతా"
"ఇందాక తీసుకున్నావు కదా...."
"అది ఆ తర్వాత వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది కదా. అందుకే ఫ్రెష్ గా కావాలి"
స్వాతి హరీష్ కి కావాల్సింది ఇచ్చేసి తనని ఆఫీస్ కి పంపించి వాళ్ళ అత్తయ్యా మావయ్యతో కబుర్లు చెప్తూ వంట నేర్చుకుంటూ గడిపింది.
మధ్యాహ్నం, పద్మ గారికి ఫోన్ చేసి....."అమ్మా ఏం చేస్తున్నావ్"
"ఏంలేదమ్మా. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నాము నేనూ మీ నాన్నా కూర్చుని"
"అన్విత లేదా"
"అదేదో ఇంటర్వ్యూ ఉందని వెళ్ళింది. సాయంత్రమవుతుందేమో"
"ఓహ్ సరేలే. మీరూ మాట్లాడుకోండి. పెట్టేస్తున్నా"
"ఆగవే. ఫోన్ చేసి పెట్టేస్తున్నా అంటావు. ఏమిటి సంగతులు"
"ఏమిలేదమ్మా.... బోర్ గా ఉంది. అత్తయ్యా, మావయ్యా పడుకుంటారు మధ్యాహ్నం. నాకేమో ఏం చేయాలో తోచటం లేదు"
"స్వాతి తోచటం లేదంటే ఎలాగా. అందుకే జాబ్ చేసుకోవాలి అనేది. ఇంట్లో ఉంటే అలాగే ఉంటుంది"
"అబ్బా పెట్టేస్తున్నా"
"ఇదిగో ఆగు. నాన్నతో మాట్లాడు"
రామ్ గారు.... "బంగారు ఎలా ఉన్నావమ్మా"
"నాన్నా.... బావున్నాను. మీకిప్పుడు ఎలా ఉంటోంది. నీరసం తగ్గిందా"
"ఏరా ఫోన్ నేను తీసుకుంటే అప్పుడు అడుగుతున్నావు. లేకపోతే ఫోన్ పెట్టేయనా అంటున్నావ్" అన్నారు అలిగినట్లుగా
"అది కాదు నాన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా జాబ్ చేయమని సతాయిస్తోంది. మీరైనా చెప్పండి"
"టైమ్ పాస్ అవుతుందని అంటుందిరా అమ్మ. నువ్వూ ఏదో ఒక హాబీ పెట్టుకోవచ్చు కద నాన్నా. ఈ టైమ్ ని యూస్ చేస్కుని కొత్తవి నేర్చుకో.
పద్మ గారు.... "మొన్న అన్నయ్య నీకేవో డ్రాయింగ్ క్లాస్సేస్ గురించీ చెప్పాడట కదా. అవేవో జాయిన్ అవచ్చు కదా. అవి రోజు లో ఎంతో సేపు ఉండవు. ఈ టైమ్ లో కూర్చుని ప్రాక్టీస్ చేస్కో"
స్వాతి మెల్లగా.. "అమ్మా, నేనడగలేను బావని. ప్లీజ్. అర్థం చేస్కో. ఇంకేమనకు ఇప్పుడు. వేరే ఏమైనా చెప్పు"
రామ్ గారు..... "తల్లీ..... పెళ్ళయ్యి నెల కావొస్తోంది. ఎప్పుడైనా వచ్చి అరగంట ఉండి వెళ్ళిపోతున్నావ్. ఒక రెండు రోజులు ఉండేలాగా రావచ్చు కదమ్మా. మాకు నువ్వు మళ్ళీ ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలనుందిరా. హరిని నువ్వూ అడుగమ్మా మేము మాట్లాడతాము"
"సరే నా....న్నా.."
పద్మగారు.... "ఏమైందే, ఇంట్లో ఏమైనా అంటారనా.... దేనికి ఆలోచనా"
"అది కాదమ్మా, మీరే అడగండి ఒకసారి బావని. అత్తయ్య వాళ్ళతో కూడా చెప్పాలేమో"
రామ్ గారు... "సరేలే తల్లీ, మేము మాట్లాడతాములే. అంత మొహమాటమెందుకురా, మాతో చెప్పటానికి. నువ్వు చెప్పకపోయినా మేమైనా అడుగుతాము. ఇవన్నీ మామూలేనమ్మా"
"సరే నాన్న....... ఉంటాను" అంటూ ఫోన్ పెట్టేసింది
స్వాతి తనలో తను..... "ఎంత మార్పో. నా పెళ్ళికి ముందర వరకు, నాన్న అంటే గౌరవం ఇచ్చి ఎంతో మర్యాదిచ్చి మాట్లాడే వాళ్ళనే చూసాను. ఎప్పుడూ నాన్న ఎవరి ముందర అడగటం కానీ వంగటం కానీ తెలీదు. మొన్నా మధ్య అయితే బావని అల్లుడుగారు అంట, ఆయనలా అంటుంటే ఎంత బాధగా ఉంటోందో మనసుకి, కానీ ఎవరితోనూ చెప్పుకోలేను, చెప్పినా అదేమీ పెద్ద విషయం కాదు మామూలే అంటారు. ఆడపిల్ల తండ్రీ కాబట్టే కదా ఆయన అణిగి ఉండాలి. ఈరోజు నా వలన ఆయన ఒకరిని పర్మిషన్ అడగాల్సిన వస్తోంది. తన కూతుర్నే తన ఇంటికి పంపించటానికి పర్మిషనా. నేనే అడగొచ్చు కానీ అత్తయ్య వాళ్ళతో నేను చెప్తే బాగోదేమో. అర్థం చేస్కునే భర్త ఉన్నా, పుట్టింటి గురించీ మనసులో మాట పంచుకోటానికి మొహమాటం. ఇది నాకేనా ఏ ఆడపిల్లకైనా ఉంటుందా"
ఇంతలో ప్రదీప్ ఫోన్ చేసేసరికి, "అన్నయ్యా చెప్పు. ఏంటి ఈ టైమ్ లో చేసావు"
"ఏంలేదురా, బావ నేను కబుర్లు చెప్పుకుంటున్నాం. నువ్వేం చేస్తున్నావో అని కాల్ చేసాను"
"మాది లంచ్ అయ్యిందన్నయ్యా. ఇప్పుడేం చేయటం లేదు, కూర్చున్నా"
"చిన్నూ.... ఎందుకురా డల్ గా ఉన్నావు. ఏమయిందమ్మా"
"ఏమిలేదన్నయ్యా, నీకసలు ఎలా తెలిసిపోతుంది అలా, నువ్వు నువ్వే, బావా అంతేను"
"పొగడ్తల కార్యక్రమాలు తర్వాత కానీ ఏమయిందిరా"
"అమ్మ ఫోన్ చేసిందీ..... "
"ఏమయినా అన్నదా. నేను వెళ్ళాకా మాట్లాడతానులే"
"అమ్మ ఏమి అనలేదు, నాకే ఏంటో బాద్ధొచ్చింది.నా వలన నాన్న.... "
"ఏమయ్యింది. మధ్యలో ఆపేస్తావేం"
"నువ్వు బావా కలిసి ఫోన్ చేశారు కదా"
"అవునూ..... తను లేడురా ఇప్పుడు. నువ్వు చెప్పు"
"ఏమిలేదన్నయ్యా. నాన్న ఇంటికి రమ్మంటున్నారు. అంతే"
"దానికి నువ్వు డల్ అయ్యావా. అది కాదు మేటర్ అని నాకు తెలుసు"
"అన్నయ్యా.... అంతేను ఇంకేమి లేదు"
"సరే.... ఉండనా మరీ "
"అలాగే అన్నయ్యా. బావ కి కూడా బాయ్ చెప్పానని చెప్పు. పక్కనే సైలెంట్ గా కూర్చుని వింటున్నాడని తెలుసులే" అంది నవ్వుతూ
హరీష్.... "హహ... సరేరా.... బాయ్" అంటూ ఫోన్ పెట్టేసారు
సాయంత్రం అయ్యింది. స్వాతి ఖంగారుగా హరీష్ కి ఫోన్ చేసింది, కానీ ఫోన్ తీయలేదు. రెండు మూడు సార్లు చేసి, ప్రదీప్ కి ఫోన్ చేసింది. ప్రదీప్ కూడా కాల్ తీయలేదు. ప్రదీప్ కి ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉంది. ఇంతలో హరీష్ నుంచి ఫోన్ రాగానే....
"బావా ఎక్కడున్నావు, ఎంతసేపట్లో వస్తావు ఇంటికి. ఇంతసేపు ఫోన్ ఎత్తవేంటి"
"స్వీటీ డ్రైవ్ లో ఉన్నానురా. కొంచం రష్ గా ఉంది. పక్కకి ఆపి కాల్ చేస్తున్నా"
"సరే ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావ్"
"దగ్గర్లోనే ఉన్నాను ఇంకో 10మినిట్స్. ఏమయిందిరా ఖంగారుగా ఉన్నావెందుకు"
"ఏమిలేదులే నువ్వు రా"
"అమ్మా వాళ్ళేమి చేస్తున్నారు. అంతా ఓకే నా. వాళ్లెలా ఉన్నారు"
"బావా.... అత్తయ్య వాళ్ళు బానే ఉన్నారు. అందుగురించి కాదు కానీ నువ్వురావా త్వరగా"
"సరే వస్తున్నా...ఉంటా" అంటూ ఫోన్ పెట్టేసాడు
ప్రదీప్ కి మళ్ళీ ఫోన్ చేసింది. అయినా తీయకపోవడం తో మెసేజ్ చేసింది.
"అన్నయ్యా, ఇక్కడికి రావా ప్లీజ్. భయంగా ఉందన్నయ్యా..."
Comments
Post a Comment