49
స్వాతి హరీష్ ని చూస్తూ దగ్గరకొచ్చి, "కృష్ణా .... "
హరీష్.. "నువ్వెంత బతిమాలినా సరే...." అంటూ సీరియస్ గా మాట్లాడటానికి ప్రయత్నించాడు.
స్వాతి తనని అల్లేసుకుని ... "కృష్ణా.. .... కోపంగా బానే మాట్లాడావ్ కానీ, నువ్వు ఇలా ఎన్ని చెప్పినా నీ కళ్ళలో నా మీద ప్రేమే కనిపిస్తోంది. నేను ఏడ్చినప్పుడు కూడా నీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి" అంది నవ్వుతూ
హరీష్ కూడా వెంటనే నవ్వేసి, తనని దగ్గరకి తీస్కుని, "ఇంత నమ్మకమేంటిరా నా మీదా"
"అది నీ మీద కాదులే"
"మరి" అయోమయం గా అడిగాడు
"నా ప్రేమ మీద నాకు నమ్మకముంది. మా అన్న మీద కోపంతో చేసుకుంటే నేను హాస్పిటల్ లో ఉంటే నువ్వెందుకు బాధపడ్డావో.... అయినా నీ ఫేస్ కి వయోలెన్స్ సూట్ అవదులే. నువ్వెప్పటికీ నా ముద్దుల కృష్ణయ్యవే"
హరీష్ తన పక్కన స్వాతి ని కూర్చోమని, తన భుజం మీద చేయి వేసి దగ్గరకి తీస్కుని
"స్వీటీ నువ్వేడిస్తే నాకు మాత్రం బావుంటుందా. (ఇక్కడ చదువుతున్నవాళ్ళు అందరూ నమ్మేసినా) నేను సరదాగానే అంటున్నా అని నువ్వు నమ్మావు. ఆ నమ్మకం చాలురా. .. మరి నేనలా మాట్లాడను అని తెలిసినదానివి, నీకు అత్తయ్యా వాళ్ళని చూడాలనిపించిన ప్రతీసారీ, నేను తీస్కుని వెళ్ళనా?? మీ అన్నయ్య అన్నాడే అనుకో, నువ్వు చెప్పద్దూ?? ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఏం కావాలన్నా నన్ను అడుగు, ఏదైనా ఇబ్బందనిపిస్తే నేనున్నాను ఇక్కడే. నాతో షేర్ చేసుకో.. సరేనా. అంతే కానీ దేనికి కూడా ఒక్కదానివి బాధపడకురా" అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
"సరే కృష్ణా" అంటూ స్వాతి లేవబోతుంటే,
"ఉండరా కొంచంసేపు"
"నువ్వు బానే చెప్తావు. అక్కడ రమ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వెళ్ళ్తాను. బాగోదు" అంటూ లేచింది
"సరే ..... నువ్వు కొంచం రెస్ట్ తీసుకోరా. మళ్ళీ తర్వాత ఏవో కార్యక్రమాలున్నాయి.
"నువ్వూ బజ్జో. నేనెళ్తున్నా "
"స్వీటీ ఒక్క ముద్దయినా ఇయ్యారా" అంటూ దగ్గరకి వెళ్ళాడు హరీష్
"పో బావా" అంటూ రమ్య వాళ్ళున్న గదిలోకి వెళ్ళిపోయింది.
రమ్య, అక్కా ఇద్దరూ పడుకునుండటంతో, "వీళ్ళు పడుకున్నారు కదా, కొంచం సేపు బావ దగ్గరకే వెళ్ళనా.... ఒద్దులే ఎవరైనా చూస్తే బాగోదేమో. బావ ఉండమంటూనే ఉన్నాడు నేనే ఫోజ్ కొట్టాను. ఒక సారి అమ్మకి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది. కానీ ఫోన్ ఎక్కడ ఉందొ..." అని వెతికి ఫోన్ దొరకక, మంచం మీద వాలింది. కానీ నిద్ర పట్టలేదు.
"కిందకి వెళ్తే మావయ్యా ఫోన్ లో నుంచి మాట్లాడచ్చేమో" అనుకుంటూ రూమ్ లో నుంచి బయటకి వచ్చింది. కానీ మెట్ల దగ్గరకు నుంచి కింద ఎవరూ కనిపించకపోవడం తో ఏం చేయాలో తెలీక, హరీష్ ని అడుగుదామంటే తనూ పడుకున్నాడేమో అనుకుంటూ అక్కడే నిల్చునిపోయింది.
ఇంతలో హరీష్ అక్కడికి రావటం తో, "స్వీటీ ఏమయిందిరా..... ఏం చేస్తున్నావ్ ఇక్కడా. పడుకోలేదా"
"లేదు కృ...బావా" కృష్ణా అని పిలవబోయి ఎవరైనా వింటారేమో అనుకుంటూ బావా అనటం హరీష్ గమనించి, "రమ్య వాళ్ళు ఏం చేస్తున్నారు"
"వాళ్లిద్దరూ పడుకున్నారు. నాకు బోర్ కొట్టింది. పడుకుందామంటే నిద్ర పట్టలేదు. అమ్మతో మాట్లాడదామంటే ఫోన్ ఎక్కడుందో తెలీలేదు. నిన్ను అడుగుదామంటే నువ్వు పడుకున్నావేమో, తలుపు కొడితే డిస్టర్బ్ అవుతుందని మావయ్యని అడుగుదామనుకున్నా. కానీ కింద అసలు చప్పుళ్ళేమి లేకుండా సైలెంట్ గా ఉంది. అందుకే ఏం చేయనా అని ఆలోచిస్తు ఇక్కడే ఉండిపోయా " అని జరిగింది మొత్తం చెప్పింది
"స్వీటీ.... ఇటు రా" అంటూ తన రూమ్ లో కి తీస్కుని వెళ్ళి...
"ఇది మొన్నటి వరకూ నా రూమ్ కానీ నిన్నటి నుంచి ఇది నీది కూడా. నీ రూమ్ లో కి రావటానికి నువ్వు తలుపు కొట్టనవసరం లేదు. నీకు నా మీద, నాకు సంబంధించిన ప్రతీ దానిమీద హక్కుంది. దేనికీ పర్మిషన్ అడగక్కర్లేదు. సరే. ఇదిగో ఫోన్ తీస్కుని మాట్లాడుతూ ఉండు. నేను కిందకి వెళ్ళు మంచినీళ్ళు తీసుకొస్తాను" అంటూ వెళ్ళిపోయాడు
కొద్దిసేపటికి రూమ్ లోకి వచ్చేసరికి, స్వాతి ఇంకా ఫోన్ లో ఉంది.
"సరే అమ్మా.... సరే....చేస్తాలే..... మీరు త్వరగా వచ్చేయండి. బాయ్" ఫోన్ పెట్టేసి
"థాంక్స్ కృష్ణా. అమ్మ తో మాట్లాడాక కొంచం హాయిగా ఉంది" అంటూ ఫోన్ ఇచ్చింది
ఆ చేతిని అలాగే పట్టుకుని, "ఈ ఫార్మాలిటీస్ ఎక్కువయ్యాయనిపించటం లేదా నీకు"
"హీహీ... సారీ.... ఐ మీన్... అదె... సరేలే కానీ... నువ్వు పడుకోలే నేను ఫ్రెష్ అవుతా"
పట్టుకున్న చేతులతో స్వాతి ని దగ్గరకి లాక్కుని, "మళ్ళీ పారిపోకు, ఈసారి ముద్దిస్తే కానీ వదలను"
"వదలకపోతే అత్తయ్యని పిలుస్తాను"
"పిలుచుకో, నాకేమి భయం లేదు. ముద్దిస్తావా, లేదా"
"ఆఁహాఁ ఇప్పుడు కాదు"
"నువ్విప్పుడు ఇయ్యకపోతే తర్వాత అందరి ముందర ముద్దు పెట్టుకుంటాను. నీ ఇష్టం"
"నువ్వు చేసినా చేస్తావు" అని మనసులో భయపడుతూనే, "కృష్ణా.... " అంది బతిమాలుతూ
"నువ్వలా నా వీక్ పాయింట్ తెలుసుకుని, ముద్దుగా పిలిస్తే ఈసారి మాత్రం వదలను. ముద్దు పెడతావా, తీసుకొనా"
స్వాతి... హరీష్ బుగ్గ మీద పెట్టి తనని దూరం తోసింది.
హరీష్.... "ఓయి దీన్ని ముద్దంటారా"
"ఇప్పటికైతే ఇంతే....తర్వాత ముద్దులన్నీ... తర్వాతే" అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది
కొద్దిసేపటికి వ్రతం మొదలయ్యింది. అక్కా, రమ్యా స్వాతిని రెడీ చేశారు. పద్మ రామ్ గారు, అమ్మమ్మ గారు మాత్రమే వచ్చారు. స్వాతి సంతోషంతో వాళ్ళని చుట్టేసింది. అమ్మమ్మగారు, పద్మగారి మధ్యలో కూర్చుని, ముగ్గురితో కబుర్లు చెప్తోంది. హరీష్ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ దూరం నుంచి స్వాతి ని చూస్తూ ఉన్నాడు. తనలా, వాళ్ళతో చిన్నపిల్లలాగా కబుర్లు చెప్తుంటే తనలో తనే నవ్వుకున్నాడు.
"అమ్మా.... అన్నయ్య రాలేదేం. వాళ్ళు రారా" అనడిగింది మొహం వేలాడేసి
అమ్మమ్మగారు.... "మీ అన్నయ్య ఆగుతాడా. వద్దంటే మానేస్తాడా. వస్తారు, కొంచం ఆలస్యంగా వస్తారులే"
హరీష్ వాళ్ళ ఫ్రెండ్, వాసు రావటం తో, "ఏంటిరా నిన్న పెళ్ళికి మొహం చూపించేసి వెళ్ళిపోయావు. ఇప్పుడైనా మా చెల్లిని తీస్కోచ్చి మంచి పని చేసావ్, లేకపోతే నా చేతుల్లో అయిపోయేవాడివే"
"లేదురా. నిన్న సంజు వాళ్ళ వాళ్ళకి బాలేదని హాస్పిటల్ కి వెళ్లాల్సొచ్చింది. అందుకే నేనొక్కడినే వచ్చాను. సరే కానీ ఏంట్రా, పెళ్ళైనా ఇంకా దూరంగా నిల్చునే సైట్ కొడ్తున్నావ్ మా సిస్టర్ కి"
"సైట్ ఆ ఇంకేదైనానా.... తనని చూస్తే చిన్న పిల్లలా అనిపిస్తుంది నాకైతే. అటు చూడు అసలూ. వాళ్ళని ఎన్నో రోజులతర్వాత చూసినట్లు ఎలా ఎగురుతోందో"
సంజన (వాసు వాళ్ళ వైఫ్ )...."మేము అమ్మాయిలం అంతే అన్నయ్యా. అమ్మా వాళ్ళకి దూరం గా ఉండాలంటే ముందరే బెంగొచ్చేస్తుంది. అందులోను తను వాళ్ళ ఇల్లు దాటి ఎప్పుడూ ఎక్కడకి వెళ్ళలేదుట కదా. కొన్ని రోజులు తను అడ్జస్ట్ అయ్యేవరకూ తప్పదు" అంది నవ్వుతూ
హరీష్.... "హ్మ్... అదీ నిజమే... అవునురా ప్రియా రాలేదేం. ఫోన్ చేసి కూడా చెప్పాను మరీ మరీ రమ్మనమని"
వాసు సంజన ఉందన్నట్లుగా, ఆమెని చూస్తూ, "వర్క్ ఏదో ఉంది, రాలేకపోతున్నా అని చెప్పిందిరా. నేనూ నిన్న మాట్లాడాను. తన గురించి వదిలేయి కానీ, నీ సంగతీ చెప్పు" అంటూ కబుర్లలో పడ్డారు
ఇంతలో పద్మగారి దగ్గరికి వచ్చిన సత్యగారు... "అన్నయ్యగారు కాఫీ తీస్కున్నారండి" అంటూ వియ్యంకులకి మర్యాదలు జరుగుతున్నాయో లేదో చూడటానికి వచ్చారు
సత్య గారు... "స్వాతి, నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. మీ అమ్మా వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. వాళ్ళకి అన్నీ అందుతున్నాయో లేదో చూడూ" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు
స్వాతి అమ్మమ్మగారి చేతులు పట్టుకుని అప్పటి వరకు కబుర్లు చెప్తున్నదల్లా, సత్యగారి మాటలకి చేతులు వదిలేసి తల దించుకుంది. అమ్మమ్మగారికి తన బాధ అర్థమయినట్లుగా, " మీ అత్తయ్యా తప్పుగా ఏమందిరా, ఇప్పుడు బాధపడటానికి"
"అవునమ్మమ్మా... తప్పేమి లేదు"
పద్మగారు, స్వాతి భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకున్నారు. అమ్మమ్మగారు, "తల్లీ ఇటు చూడు, ఇదిగో అమ్మమ్మ ని చూడు ముందర" అంటూ తన మొహం పైకి ఎత్తగానే, స్వాతి కళ్ళు మూసుకుంది, కన్నీళ్ళు బయటకి రాకుండా.
పద్మగారు.... "ఏంటిరా ఆ కన్నీళ్ళు. ఇప్పుడేమయ్యిందని"
వాసుతో మాట్లాడుతూ హరీష్ స్వాతి వైపు చూసీ తను ఎందుకో బాధపడటం, పద్మగారు వాళ్ళు ఓదారుస్తున్నారని అర్థం చేస్కుని, "ఇప్పుడే వస్తాను" అంటూ అటు వెళ్ళాడు
స్వాతి.... "అమ్మమ్మా సడన్ గా నేను ఈ ఇంటికి కోడలిని అయిపోయాను మీరందరూ చుట్టాలైపోయారు. ఇన్నాళ్ళు పెంచినవాళ్లు బయటవాళ్ళయిపోయారు" అంది బాధగా.
"ఆవిడ ఆ ఉద్దేశం లో అనలేదమ్మా. ఇప్పుడు నాకు కాఫీ ఇయలేదనుకో ఎవరిని అడుగుతాను, నిన్నైతే చనువుగా అడగగలను కదా. వాళ్ళైతే మొహమాట పడతాను. అందుకనే నిన్ను చూసుకోమన్నారు. అంతేను"
"అత్తయ్య ఏమి అనలేదులే. నాకే బాధోచ్చింది. సరేలే బానే ఉన్నాను"
హరీష్ అక్కడికి వచ్చి, "స్వీటీ.... అంతా ఓకేనా " అన్నాడు పద్మగారు వాళ్ళని చూస్తూ
"ఏమిలేదు బాబు, వాళ్ళ అన్నయ్య రాలేదని అలిగింది. అంతేను" అన్నారు అమ్మమ్మ గారు సర్ది చెప్తూ
స్వాతి అమ్మమ్మగారిని చూసింది. ఆ చూపులో, ఆవిడ నిజం చెప్పట్లేదని హరీష్ కి అర్ధమయ్యి, "స్వీటీ.... వాసు, సంజన వాళ్ళొచ్చారు. ఒక సారి వస్తావా" అంటూ వాళ్ళ దగ్గరకి తీస్కెళ్ళి మాటల్లో పడ్డారు
పద్మ గారు, రామ్ గారితో, "హరీ పక్కనుండగా దాన్ని బాధపడనీయడులెండి. మీరు బెంగ పెట్టుకోకండి" అన్నారు మెల్లిగా
"బెంగ ఏమి లేదు పద్మా. నాకు తెలుసు కదా అది బానే ఉంటుంది"
"బెంగ లేకపోతే అది బాధపడేసరికి మీకు కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకో" అన్నారు నవ్వుతూ
"నా సంగతీ సరే, మీ అబ్బాయి వచ్చాక వాడిని చూడు"
"అందుకే కదా, లేట్ గా పూజ మొదలయ్యాక బయలుదేరమని చెప్పాను అన్వితతో. అప్పటికి ఇదీ కొంచం సద్దుకుంటుంది"
కొద్దిసేపటికి పూజ ముగిసింది. స్వాతి వాళ్ళ అమ్మగారు వాళ్ళతో పాటు ప్రదీప్ కూడా తను స్వాతి కోసం తీసుకున్న నెక్లెస్ ఇచ్చాడు. అందరూ భోజనాలు చేసి, వచ్చిన బంధువులందరి దగ్గరకి వెళ్ళి పలకరించి చివరిగా ప్రదీప్, అన్విత పక్కన వెళ్ళి కూర్చుంది.
"చిన్నూ మీరు తిన్నారా"
"తినేశాము.... అన్నయ్యా నీకొక విషయం చెప్పాలి" అంటూ హరీష్ పొద్దున్న తనతో ప్రదీప్ గురించి చెప్పినవి చెప్పింది
"అదేంటిరా, నేను తననేమి అన్నాను అసలూ. ఏంటిదంతా. చిన్నూ, హరీష్ ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను కానీ తనే నిన్ను బాధపెడతాడనుకోలేదు. అయినా ఇప్పుడు చెప్తున్నావా ఇదంతా. మనం ఇప్పుడే వెళ్లిపోదాము. నువ్విక్కడ ఉండద్దు" అంటూ కోపంగా లేచాడు
ప్రదీప్ ని వెళ్ళనీయకుండా పట్టుకుని, అన్విత..... "స్వాతి, నాకు నమ్మబుద్ధి కావటం లేదు, అన్నయ్య అలా మాట్లాడాడంటే. బావా కోపం తెచ్చేసుకోటం కాదు, ఒక్క నిమిషం పూర్తిగా అసలేమయ్యిందో తెలుసుకో..... స్వాతి ఏంటే నవ్వుతావు"
"అన్నయ్యా ముందు కూర్చో. అవన్నీ అనేసాక, నేను తను అలా అన్నా కూడా "నమ్మనూ" అని చెప్పాను. అంత నమ్మకముంటే మరి ఇంటికి వెళ్తా అంటే నేను తీస్కుని వెళ్ళనా, నన్నెందుకు అడగలేదు అని తిట్టాడు"
అన్విత.... "అవును కదే మరి. తను అన్నదాంట్లో తప్పేముంది. పైగా మీ అన్న కి కంప్లైంట్ చేస్తున్నావు" అంటూ కోప్పడింది
స్వాతి... "సారీ " అంది బుంగమూతి పెట్టుకునీ
"చిన్నూ నువ్వెందుకురా సారీ చెప్పటం. ఏదైనా చెప్పాలంటే మంచిగా చెప్పాలి కానీ జోకులా వేసేది. నువ్వు నమ్మలేదు కాబట్టి సరిపోయింది. పైగా హరీష్ ని అనటం మానేసి చిన్నూ ని అంటున్నావేంటి అన్వి"
"కదా..... చూడన్నయ్యా, నా మీద ఎలా అరుస్తుందో అసలూ. నువ్వు ఇప్పుడు పక్కన ఉంటేనే ఎలా అరుస్తోందో"
"హాహా..... అదేమీ అనదురా.... అయినా, మీ ఇద్దరి మధ్యలోకి నన్ను లాగి నాతో ఫుట్బాల్ ఆడుకోకండి"
అన్విత.... "హహహ.... సరేలే.... స్వాతి.... మీ అన్నయ్య గిఫ్ట్ రేపు పూజ కి పెట్టుకునిరా... ఇద్దరం పెట్టుకుందాము"
"సరేలే.... మీరేంటి అసలూ ఇంత లేట్. నేను కూడా రేపు లేట్ గా వస్తాను చూడు"
అన్విత.... "రాత్రి బిజీ కదా, రేపెలాగో లేట్ గానే లేస్తావు, లేట్ గానే వస్తావని తెలుసులే" అంది స్వాతికి మాత్రమే వినిపించేలా
పక్కనే ఉన్న ప్రదీప్, నాకు వినిపించింది అన్నట్లుగా... అన్విత తల మీద మెల్లిగా తట్టి, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు.
ప్రదీప్.. హరీష్ దగ్గరకి వెళ్ళి.... "ఏంటి బావా.... మా చెల్లి ని భయపెడ్తున్నావుట?? "
"బావా.... చెప్పేసిందా..... ఏడుస్తుంటే ఆపటానికి చిన్న ఝలక్ ఇచ్చాను అంతే. తనని ఎందుకు భయపెడ్తాను బావా. నేను అలా అంటున్నప్పుడు స్వీటీ మొహం లో ఒక చిన్న కలవరం కనిపించినా ఆపేసేవాడినే"
"సరే బావా. నేనూ సరదాగానే అన్నాను. కానీ బావా... అది జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తున్నాం అనుకోకు. చిన్నప్పటి నుంచి చాలా బాధ భరించింది బావా. ఎప్పుడూ ఇల్లు వదలలేదు. అన్విత తో ఎంత క్లోజ్ గా ఉన్నా, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉండమన్న మేము లేకుండా ఉండేది కాదు. కొంచం ఏదైనా మారం చేస్తే విసుగు తెచ్చుకోకు బావా"
"ఏంటి బావా ఇదీ. స్వీటీని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తనేంటో తెలీదా నాకు. నువ్వంతలా చెప్పాలా. అది నా ప్రాణం. తన మీద విసుగు తెచుకోటానికి, చిన్నపిల్లలు విసిగించరు.... ఏం చేసినా బావుంటుంది కదా"
"ఇదే మాట చిన్నూ తో చెప్పు. ఇల్లు పీకి మళ్ళీ కొత్త పందిరి వేస్తుంది" అంటూ నవ్వాడు
పద్మ, రామ్ గారు కూడా హరీష్ కి వాళ్ళ అమ్మాయి ని మళ్ళీ అప్పచెప్పారు. ఇంతలో అమ్మమ్మ గారు వచ్చి,
"బాబు నేను రేపు సాయంత్రం ఊరు బయల్దేరుతాను. మా బంగారానికి ఎలాంటి భర్త వస్తాడో అనుకుని భయపడేదాన్ని, నిన్ను చూసాకే నా బెంగ పోయిందయ్యా"
హరీష్.... "బామ్మగారు....అదేంటి. నా కట్నం పూర్తిగా ఇయ్యకుండానే వెళ్తానంటారేంటి. నేను ఒప్పుకోను"
పద్మ, రామ్ గారు హరీష్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మొహామొహాలు చూసుకున్నారు.
స్వాతి.... "ఖంగారు పడకండి నాన్నా. బావ, అమ్మొమ్మ ని ఎంగేజ్మెంట్ కి వచ్చి పెళ్ళి వరకు మనతో ఉండి, పెళ్ళయ్యాక మాతో ఒక్కరోజైనా ఉండాలని అడిగాడు కట్నం గా. దాని గురించే అడుగుతున్నాడు"
"మీ ఇంట్లో ఉండటం భావ్యం కాదు బాబు, పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో"
వాళ్ళ మాటలు విన్న, మహేశ్వర రావు గారు, "పిన్నీ గారు, మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం వరకూ ఉండండి, స్వాతి కి తోడుగా. సాయంత్రం మిమ్మల్ని నేను పద్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాను"
ఆయన మాట కాదనలేక అమ్మమ్మ గారు ఒప్పుకున్నారు. పద్మగారు, రామ్ గారు, హరీష్ వాళ్ళ అమ్మ నాన్న గారికి కూడా స్వాతి ని చూసుకోమని చెప్పి బయల్దేరారు. వాళ్ళు వెళ్తుంటే స్వాతి వాళ్ళనే చూస్తూ నిల్చునిపోయింది.
హరీష్ తన భుజం మీద చేయి వేసి, "స్వీటీ.... రేపు వెళ్ళి అత్తయ్యా వాళ్ళని కలుద్దాము. బాధపడకు"
వ్రతానికి వచ్చినవాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి, స్వాతి, అమ్మమ్మగారు, రమ్య మాట్లాడుకుంటున్నారు.
*****************************
"స్వాతి ..... ఎవరితోనూ మాటపడకమ్మా. తను నీ భర్త. వాళ్ళకి నువ్వు అలా పిలవటం ఇష్టం లేకపోతే అలా పిలవద్దులే. మీ ఇద్దరూ ఉన్నప్పుడు మీ ఇష్టం. కానీ బయట అతని పరువుని కాపాడాల్సిన బాధ్యత నీదే"
రమ్య..... "అమ్మమ్మగారు మీరూ అలా అంటారేంటి. అన్న పరువు తీసేలాగా అదేం చేసిందసలు. బావా అని పిలవటమే తప్పా. అయినా స్వాతి, నువ్వు బ్రదర్ కి ఆల్రెడీ చెప్పావు కదా జాబ్ చేయటం ఇష్టం లేదని. తను ఓకే అన్నాడు కదా. ఇప్పుడివన్నీ ఏంటి. పెళ్ళయ్యి వన్ డే అవలేదు. ఇన్ని కంప్లైంట్స్ ఆ. "
అమ్మమ్మగారు.... "రమ్యా, ఆ అబ్బాయో వాళ్ళ అమ్మ గారో అంటే ఆలోచించాలి. అతనేమీ అనలేదు కదా. దాని ఇష్టమే అన్నాడు. వాళ్ళ పిన్నీ గారి మాటలు వినీ బాధపడటం ఎందుకమ్మా. అందరిని పట్టించుకోవక్కర్లేదు స్వాతి. నువ్వు, నీ కాపురం, నీ అత్త మామలు చూసుకో. వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదా, వాళ్ళు కానీ మీ అమ్మ వాళ్ళు కానీ మాట పడకుండా చుస్కో"
రమ్య.... "అమ్మమ్మగారు.... మీకు తెలీదు, పెళ్లిరోజున కూడా వాళ్ళ పిన్నీ, బ్రదర్ వాళ్ళ అమ్మ గారు ఎలా మాట్లాడుకున్నారో స్వాతి గురించీ"
స్వాతి... "రమ్మీ..... ఆపవే. ఎవరైనా వింటే గొడవైపోతుంది. ఎవరో అక్కర్లేదు బావ ఎదురు రూమ్ లో ఉన్నాడు. వినిపిస్తుంది. ప్లీజ్ అరవకే"
అమ్మమ్మగారు..... "ఏమన్నారమ్మా" అనడిగారు ఖంగారుగా
స్వాతి ఆరోజు తను విన్నది చెప్పి, "అమ్మమ్మా, అమ్మా వాళ్ళకి ఇవేవి కూడా చెప్పకూ. అత్తయ్య కూడా నాతో మామూలుగానే ఉంది. ఈ టాపిక్ ని పెద్దది చేయకు. నువ్వూ ఖంగారు పడకు. అంతా బానే ఉంటుంది, బావ ఉన్నాడు కదా తనే చూసుకుంటాడు"
"సరేనమ్మా. కానీ జాగ్రత్త తల్లీ"
************************************
సాయంత్రం అవటం తో అమ్మమ్మగారు స్వాతి కి జాగ్రత్తలు చెప్పి, రమ్య ని తీస్కుని వెళ్ళిపోయారు. స్వాతిని ముస్తాబు చేసి పాల గ్లాసుతో హరీష్ రూమ్ లో కి పంపించారు.
ఆ గదిలో ఇంతక ముందర కూడా వచ్చినా, ఇప్పుడు మాత్రం అడుగు ముందుకి పడటం లేదు. తల ఎత్తటానికి బిడియం అడ్డొస్తోంది.
స్వాతిని చూసీ హరీష్ తన దగ్గరకి వెళ్ళి గ్లాస్ పక్కన పెట్టి, "స్వీటీ... "
"హ్మ్మ్.... "
"ఇటు చూడరా" అంటూ తన చెంపలు పట్టుకుని తల పైకి ఎత్తాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టుకునీ, "ఇప్పుడు ముద్దు పెట్టుకోవచ్చా" అన్నాడు నవ్వుతూ
స్వాతి సిగ్గే సమాధానమయ్యింది. "బావా... "
"చెప్పురా"
"నువ్వు.... నేను... అదీ.... "
"ఏంటి స్వీటీ, ఏమైంది"
"బావా.... భయంగా ఉంది"
"నన్ను చూస్తేనా" అన్నాడు ఆశ్చర్యంగా
"కాదు"
"సరే ఇటు రా... ఇవన్నీ మర్చిపో. ఇలా కుర్చొ." అంటూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని, తనని గట్టిగా హత్తుకున్నాడు. "ఇప్పుడు చెప్పు, ఎందుకు భయం. నీకు నచ్చనిది ఏది ఇక్కడ జరగదు"
హరీష్ అలా అనటం తో స్వాతి మొహం మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆన్చుకుని వాలిపోయింది. హరీష్ కూడా తనని అలాగే పొదవి పట్టుకున్నాడు. కొద్దిసేపటికి స్వాతి హరీష్ భుజం మీద ముద్దు పెట్టింది. తను కూడా అలాగే ముద్దు పెట్టుకున్నాడు.
"కృష్ణా"
"చెప్పరా.. "
"నా గిఫ్ట్ నాకు ఇస్తావా"
మొదట తనేం అడుగుతోందో అర్థం కాకపోయినా, తర్వాత స్వాతి ని పక్కన కుర్చోపెట్టి, వెళ్ళి తను కొన్న పట్టీలు తీసుకొచ్చాడు. అవి పెట్టబోతుంటే, "కృష్ణా.... తప్పు... నేను పెట్టుకుంటాను ఇయ్యి"
"చుప్..... మన మధ్యన ఏది తప్పు కాదు. నన్ను పెట్టనీయి"
స్వాతి తన మాటలకి నవ్వుకుంది. పట్టీలు పెట్టి హరీష్ వాటినే చూస్తూ తన పాదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"కృష్ణా...." అంటూ హరీష్ ని తన దగ్గరకి తీస్కుని ఆమె ఆధారాలతో మధుర సంతకం చేసింది.
హరీష్... "ఇప్పుడు భయం తగ్గిందా"
"హ్మ్మ్... " అంటూ సిగ్గుతో హరీష్ ని అల్లేసుకుంది.
హరీష్ ఆమె మెడ ఒంపు లో ముద్దు పెట్టి చిన్నగా గాలి ఊదాడు. స్వాతికి మత్తుగా అనిపించి, పైకి లేవబోయింది. తనని మీదకి తీస్కుని అలాంటి ఎన్నో మధుర సంతకాలతో ఆ రాత్రి ఎంతో మధురంగా ఒకటయ్యారు.
Comments
Post a Comment