36

"ఒక్క నిమిషం బావా" అంటూ తన రూమ్ లో కి వెళ్ళి,  తలుపు దగ్గరకి వేసి జరిగినది మొత్తం చెప్పాడు. "బావా వాళ్లెవరో  ఇది చూడలేదంటోంది" 


హరీష్ మెల్లగా....  "తను చూసింది బావా. తనకి తెలుసు" 


"నీకెలా తెలుసూ,  అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకెలా తెలిసిందీ" 


"బావా కొంచం సేపటి క్రితం,  నాకో మెసేజ్ వచ్చింది......మనోజ్ దగ్గర నుంచి" 


"మనోజ్ ఆ... తను అంత దూరం లో ఉన్న నీకు మెసేజ్ చేయటం ఎందుకు. నిన్ను టెన్షన్ పెట్టటం కాకపోతే" 


"బావా....  నీ నెంబర్ తన దగ్గర లేదుట. తనకి నేను ఇక్కడికొచ్చినట్లు తెలీదు. మీ నైట్ నుంచి కాల్ చేస్తున్నాడుట  నాకు. నా ఫోన్ రీచ్ అవ్వకపోయేసరికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు" 


"ఏం చెప్పాడు" 


"చదువుతా విను ఆ మెసేజెస్.... " 


"సర్ థిస్ ఇస్ మనోజ్. మీకు నిన్న నైట్ స్వాతి కి జరిగింది తెలిసింది కదా. నైట్ నుండి కాల్ ట్రై చేస్తున్నాను రీచ్ అవటం లేదు. ప్రదీప్ సర్ నెంబర్ లేదు. 


యెనీవేస్,  నిన్న  నైట్ ఇక్కడ ఇద్దరు,  స్వాతి విక్రమ్ తో గొడవ పడుతుండటం విన్నారుట.విక్రమ్ కి అది ఎప్పుడూ మామూలే అని పట్టించుకోలేదుట. అంతా  తెలిసాక,  గొడవల్లో ఎందుకులే అని సైలెంట్ అయిపోయారు. 


సర్ మీరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పండి. ఏం హెల్ప్ కావాలన్నా నేను రెడీ. స్వాతి నాకు మంచి ఫ్రెండ్. ఒక్కసారి కాల్ చేయండి" 


........


"బావా....  ఇప్పుడు చెప్పు. స్వాతి వాడితో గొడవ పడిందంటే వాడిని చూడకుండా ఉంటుందా. నువ్వు గొడవ పడతావని చెప్పలేదు. బావా ఇప్పుడేం చేసినా తనింకా ప్రాబ్లెమ్ లో పడ్తుంది. నిన్న మీరు కరెక్ట్ గా టైమ్ కి సేవ్ చేయగలిగారు. లేకపోతే  ....." హరీష్ కి మాట్లాడటం చాలా కష్టం గా ఉంది


"బావా ఏమీ జరగలేదు కదా. ఇప్పుడవన్నీ ఆలోచించటం ఎందుకు. అది కూడా మెల్లిగా సద్దుకుంటుందిలే. టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను. అయినా నేను అక్కడే ఉన్నా ఏమి చేయలేకపోయాను....." 


"ఇంక ఇద్దరూ ఆపుతారా. ఎవరికీ వాళ్ళు అనుకోటాలు" అని స్వాతి మాట్లాడేసరికి,  గుమ్మం వైపు చూసాడు ప్రదీప్. 


హరీష్... "బావా......  స్వాతి ఆ. ఒక్కసారి చుపించవా.....  తను లేచేసిందా. ఇప్పుడెలా ఉంది" 


ప్రదీప్ స్వాతినే చూస్తున్నాడు. హరీష్ మాటలు వినీ,  వీడియో ని తన వైపుకి తిప్పి


"చిన్నూ ఇప్పుడెలా ఉందమ్మా. అప్పుడే ఎందుకు లేచావు. ఏదైనా కావాలా. నొప్పిగా ఉందా " 


"అన్నయ్యా.  కొంచం నొప్పి తగ్గింది. ఇందాకే లేచాను. అమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఏం చేస్తున్నావో అని ఇటొచ్చా. నువ్వేదేదో చెప్తున్నావ్,  నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు. నువ్వు కావాలని వదిలేయలేదు కదా,  నువ్వు మళ్ళీ నన్ను కాపాడావు అన్నయ్యా" అంటూ ఏడ్చేసింది


"చిన్నూ.....  ఇటు రారా " అని ప్రదీప్ పిలవగానే ప్రదీప్ పక్కన కూర్చుని తన భుజం పైన వాలిపోయింది. 


స్వాతి... హరీష్ ని చూస్తూ "బావా.. ఎందుకలా బాధపడ్తున్నావు. కొంచం నొప్పిగా ఉందంతే. తగ్గిపోతుంది. మీరందరూ ఇలా అయిపోతే నాకింకా భయమేస్తుంది" అంది ప్రదీప్ ని,  హరీష్ ని మార్చి మార్చి చూస్తూ. 


"అదేమీ లేదురా. స్వీటీ నేను ఇండియా వద్దామనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లైట్ కి. టికెట్స్ చూస్తున్నా" 


ప్రదీప్.... "బావా ఇప్పుడు సడన్ గా ఎందుకూ"


స్వాతి..... "అదేంటీ అయిపోయిందా నీ వర్క్. నిన్ననే ఇంకా టైమ్ పడ్తుందన్నావ్ కదా" 


"వర్క్ అవలేదు. ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా" 


"బావా.....  కంపెనీ ఒప్పుకుంటుందా" 


"వాళ్ళొప్పుకునేదేముంది. నిన్ను కలిసి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతానులే" 


"బావా....  ఒద్దు..... "


ప్రదీప్ పక్కకి జరిగి,  "చిన్నూ నువ్వు మాట్లాడుతూ ఉండు,  ఇప్పుడే వస్తాను" అని లేచీ బయటకి వెళ్ళాడు 


"కృష్ణా.....  " 


"స్వీటీ ప్లీజ్ రా....  ఒక్కసారి నిన్ను దగ్గరకి తీస్కోవాలనుందిరా. నీకు బాలేకపోతే నేనిక్కడ ఎలా ఉండనురా" 


"కృష్ణా....  నీకు దూరంగా నేను మాత్రం ఉండగలనా. కానీ రావద్దని చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. ఎమర్జెన్సీ అయితే ఎలాగో తప్పదు. ఇప్పుడేమి లేదు కదా. చిన్న దెబ్బలే,  తగ్గిపోతాయి. బాధపడకురా"


"స్వీటీ నాకోసం అబద్దం చెప్తున్నావ్ కదా" 


"లేదు. రాత్రి చాలా భయమేసింది. అన్నయ్య రాకపోతే ఏంటి నా సిట్యుయేషన్ అని అక్కడ ఉన్నంత సేపు ఎన్ని ఆలోచనలొచ్చాయో. నువ్వేమయిపోతావు. నువ్వెలా వస్తావు, నిన్ను మళ్ళీ చూడగలనా..... ఎన్ని ఆలోచించేసానో. చాలా భయపడ్డాను. ఇంటికొచ్చాక కూడా భయంగానే ఉండింది. ఇప్పుడు పర్వాలేదులే బానే ఉన్నాను. సద్దుకుంది. రేపటికి మాములుగా అవుతాను. కొంచం టైమ్ ఇయ్యి" 


"సరే" 


"కృష్ణా. ఒక హెల్ప్ చేయవా. మా బుజ్జి కదూ... " 


"హహహ..... వెన్న నువ్వు పూసుకో నాకు పూయకు. ఏం కావాలో అడుగు" 


"నేను కాలేజ్ కి వెళ్ళను కృష్ణా. ప్లీజ్ నువ్వే అన్నయ్యని ఒప్పించవా. ప్లీజ్ రా" 


"స్వీటీ....  మీ అన్నయ్య కి నీకు మధ్యలో రావటం నాకిష్టం లేదు. నువ్వు మరీ అడుగుతున్నావు కాబట్టి,  ఫస్ట్ నువ్వు అడిగి చూడు. కాదు కూడదు అంటే అప్పుడు చూద్దాం. సరేనా" 


"సరేలే.....  ఆగు పిలుస్తా అన్నయ్య ని" అంటూ ప్రదీప్ ని పిలిచింది 


"ఏమైంది చిన్నూ" 


"ఇటురా అన్నయ్యా తలుపు దగ్గరకేసి "


ప్రదీప్ స్వాతి ఎందుకు పిలిచిందో,  ఎలా ఉందొ అని ఖంగారుగా, 


"ఏంటిరా చిన్నూ .... బావా ఏమైంది" 


హరీష్.......  "బావా నాకు తెలీదు. తననే అడగాలి ఏంటో మేటర్" 


"అన్నయ్యా..... అదీ.......  నేను కాలేజ్ కి వెళ్ళనన్నయ్యా. ఎలాగో ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. ఇంట్లోనే చదువుకుంటాను. ప్లీజ్ ఒప్పుకోవా. ప్లీజ్" 


ప్రదీప్ కోపం గా......  "నువ్వింట్లో ఉంటే చదవవు చిన్నూ......" హరీష్ కి మాత్రమే అర్థమయ్యేలాగా కన్నుకొట్టి 


"లేదు చదువుతాను అన్నయ్యా . బావా నీకు కష్టమవుతుందేమో కాని నువ్వూ హెల్ప్ చేస్తావ్ కదా, నేను పాస్ అవుతానులే. నువ్వైనా చెప్పు బావా" 


"నాకు కుదిరినంతలో  నువ్వు పాస్ కాదు మంచి మర్క్స్ వచ్చేలాగా చదివిస్తా ఇక్కడున్న కూడా. కానీ కాలేజ్ కి వెళ్ళాలా వొద్దా అనేది మీ ఇద్దరూ తేల్చుకోండి" 


హరీష్ ని కోపంగా చూసి, ప్రదీప్ తో "ప్లీజ్ అన్నయ్యా  .... ఒపుకోవా" 


"సరే...  నీ ఇష్టం చిన్నూ" 


"హేయ్....  అమ్మ తో చెప్పొస్తా.... థాంక్యూ బావా" అంటూ లేచీ పద్మగారి దగ్గరకి వెళ్ళింది


ప్రదీప్ హరీష్ తో.... "బావా ఇప్పుడే,  ఇదే మాట అమ్మ వాళ్ళకి చెప్పాను. నాకెందుకో సేఫ్ కాదనిపిస్తోంది కాలేజ్ కి పంపించటం. ఎలాగో కాలేజ్ కూడా లాస్ట్ మంతే కదా" 


"సరే బావా...  నాకూ అదే కరెక్ట్ అనిపించింది. మనం ఏం స్టెప్ తీసుకున్నా, వాడు మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తే మధ్యలో బాధపడేది స్వీటీనే. అందుకే వాడి దగ్గరకి వెళ్ళకు.  సరే నేను ఉంటాను బావా. స్వాతి జాగ్రత్త. ఏమైనా ఉంటే కాల్ చేయి, ఏ టైమ్ అయినా కూడా. తను మన కోసం సంతోషంగా ఉంటోంది ఇప్పుడు. చూసుకో బావా... ఉంటా " అని పెట్టేసాడు 


ప్రదీప్ ఆలోచనలో పడ్డాడు. "అవును హరీష్ చెప్పింది కూడా నిజమే. ఏమి జరగనట్లుగా నవ్వుతోంది, మా కోసం. చూసినవాడిని నాకే ఇంకా వణుకు తగ్గలేదు, దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమా" అని లేచీ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు 


*******


రామ్ గారు....  "పద్మా,  నిన్న దేవుడి దయ వలన ఏమి జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగుంటే.... " 


పద్మ గారు...."అలా ఏమి జరగలేదు కదండీ. ఆ ఊహే భయంగా ఉంది" 


"పద్మా....  దానికి పెళ్ళి చేయాలన్న నిర్ణయానికి వచ్చాను.  నువ్వేమంటావు" 


"మీరు నిర్ణయానికి వచ్చేసారు కదా" 


"పద్మా అదేంటి అలా అంటావు. దాన్ని పెళ్ళి చేసి పంపించేస్తే  నేను మాత్రం సంతోషంగా  ఉండగలనా. దానికి జీవితాంతం ఒక తోడు ఉండాలి"


"అది చదువు తర్వాత చేస్కుంటా అంటోంది కదా ఇప్పటి నుంచి ఎందుకు దాన్ని బాధ పెట్టటం"


"రేపే పెళ్ళి చేస్తానని నేనూ అనటం లేదు. ఇప్పటి నుంచి చుస్తే,  ఏవైనా సంబంధాలు వచ్చి అవి ముందుకు కదలడానికి కూడా టైమ్ పడ్తుంది కదా"


"సరే. కానీ పిల్లలతో ఇప్పుడే ఏమి చెప్పనూ" 


"అలాగే పద్మ. నువ్వు ఎవరికైనా చెప్పి పెట్టు.....  మంచి సంబంధం,  తెలిసినవాళ్ళైతే మన బంగారం కూడా సంతోషంగా ఉంటుంది,  మనకీ ధైర్యం. నేనూ కనుక్కుంటాను. .....ఈరోజు దానికి కష్టమొస్తే అమ్మా నీ దగ్గర పడుకోవచ్చా అని వచ్చింది. రేపన్ననాడు మనం లేకపోతే అదేమైపోతుందో అని బెంగగా ఉంది. దాన్ని గుండెల్లో పెట్టుకునీ చూసే మంచివాడు రావాలి పద్మా. ఇన్నాళ్ళు పడిన కష్టాలు చాలు " 

  

"దానికి అంతా మంచే అవుతుందిలెండి. స్థిమితంగా చూద్దాము" 


ఆ ఇంట్లో ఒక్కో రూమ్ లో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలాగా పరిగెడుతున్నాయి. స్వాతి మనసులో ఆలోచన ఏంటో అంతుబట్టడం లేదు. అందుకోసేమే అన్నట్లుగా వచ్చింది రమ్య. 


"ఆంటీ బావున్నారా. స్వాతి ఎలా ఉంది ఇప్పుడు" 


"తన రూమ్ లో పడుకుందమ్మా. నీకు తేలినీదేముంది, అది భయపడిందంటే వెంటనే జ్వరం వచ్చేస్తుంది. టెంపరేచర్ ఎక్కువుంది. టాబ్లెట్ వేస్కుని పడుకుంది. బానే ఉందన్నట్లుగా మాతో నవ్వుతూ మాట్లాడుతోంది కానీ చిన్నప్పటి నుంచి చూసినవాళ్ళము దాని మనసులో బాధ ఉందొ లేదో  తెలీదా మాకు" 


"ఆంటీ......  నేనొచ్చేసాను కదా. నేను మాట్లాడతానులెండి. బాధపడకండి. ఒకసారి చూసొస్తాను, ఏంచేస్తోందో" అంటూ లోపలికి వెళ్ళింది. కానీ, స్వాతి పడుకునుండటంతో బయటకి వచ్చేయబోతుంటే 


"రమ్మీ....  " 


"హేయ్ స్వాతి. లేచే ఉన్నావా. పడుకున్నావనుకున్నా" 


"లేదే నిద్ర రావట్లేదు. అలా అంటే వీళ్ళ సంగతీ తెలుసు కదా" 


"సరేలే ఫీవర్ తగ్గిందా" అంది నుదుటి మీద చేయి పెడ్తు


"తగ్గింది... కూర్చో నువ్వు" 


"సరేలే. ఇదిగో నీ ఫోన్. నిన్న అక్కడ పడిపోయింది" 


"థాంక్సే. రమ్మీ...  విక్రమ్ కి,  బావ ఎలా తెలుసు. వాళ్ళిద్దరికీ మధ్య గొడవయ్యిందా" 


"అదీ  ....... అదేమీ లేదే. అయినా ఇప్పుడు విక్రమ్ టాపిక్ ఎందుకూ. అంటే నిన్న రాత్రి......  విక్రమా నిన్ను కట్టేసింది??" అంది ఆశ్చర్యంగా చూస్తూ 


"వాడే..... విక్రమ్ పేరు మాత్రం బయటకి అనకే. కానీ ముందర నేనడిగింది చెప్పూ. అసలెవరే వీళ్ళకి కాలేజ్ లో విషయాలు చెప్పేది. పోయి పోయి వాడితో ఎందుకు పెట్టుకున్నారు"


"నువ్వారోజు హాస్పిటల్ లో ఉన్నప్పుడు తను కాలేజ్ కి వచ్చి, విక్రమ్ ని చితక్కొట్టాడు అప్పుడు"


"మరి ఈరోజు నాకు బాలేదని ఎలా తెలిసింది బావకి. విక్రమ్ చెప్పడు, నువ్వు చెప్పలేదు మరి ఇంకెలా తెలిసింది"


"ఏమోనే బాబు అవన్నీ కాదు ముందు ఏమైందో చెప్పు నిన్న, టెన్షన్ తో చచ్చిపోతున్నాను"


"నేను అన్నయ్య దగ్గరకి వెళ్ళబోతుంటే,  ఆ విక్రమ్ ఫ్రెండ్ వచ్చి మీ అన్నయ్య అటు వైపు ఉన్నాడు పిలుస్తున్నాడని చెప్పాడు. పక్కకి వెళ్ళగానే,  విక్రమ్ ని చూసీ భయపడి వెనక్కి వెళ్ళిపోబోతుంటే నన్ను లాగి కొట్టి కిందపడేశాడే. వాడు, వాడి ఫ్రెండ్ ఇద్దరూ కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పుడే,  వాడు అరుస్తూ ఉన్నాడు.... నీ అన్న, నీ బావా కలిసి నా పరువు తీశారు. ఒకడు అందరి ముందర నన్ను కొడితే ఇంకొకడు జరిగింది మా ఇంట్లో చెప్పాడు. నీ సంగతీ చూసీ ముందర, అప్పుడు  వాళ్ళ పని పడతాను..... అని అరిచాడు.  మా అన్న కి కాలేజీ విషయాలే తెలీవు వదిలెయ్యి,  మా బావకి నువ్వెవరో కూడా తెలీదు తనెందుకు కొడతాడు, నువ్వే పొరబడ్డావ్ అని చెప్పాను. నేనొక రోజు బావతో కాల్ మాట్లాడటం వాళ్ళ ఫ్రెండ్ గమనించాడుట. అప్పుడే వాడికి తెలిసిందిట. ఇంతలో బయట అలికిడి అవుతోంది, నేను అరవకుండా అని నా చున్నీనే నోటికి  కట్టేశారు. అసలైతే మీరందరూ వెళ్ళిపోయాక వాళ్ళు మళ్ళీ అక్కడికి రావాలని ప్లాన్. కానీ ఇంతలో అన్నయ్య వచ్చి కాపాడాడు" అంటూ భోరున ఏడిచింది 


"ఇంత జరిగితే మరి మీ అన్నయ్య కి ఎందుకు చెప్పలేదే" 


"చెప్తే వాడిని ఊరికే వదిలేస్తాడా?  ఈ సారి పెద్ద గొడవ చేస్తాడు. ఇప్పుడేమో అన్నయ్య కి తోడు బావ కూడాను. ఇద్దరూ కోపిష్టోళ్ళే. అప్పట్లో వాసన్నయ్య చెప్పాడు, బావ కి కోపం ఎక్కువ అని. ఎంత ప్రేమగా ఉంటాడో,  ఎంత నెమ్మదో అలాంటిది తనకి కోపం ఏంటిలే ఏదో సరదాగా అంటున్నాడనుకున్నా. ప్రస్తుతానికి బావ ఇక్కడ లేడు, అన్నయ్య గురించని భయమేసింది. వాడి ఫ్రెండ్ కూడా నిన్న మీరు వచ్చినప్పుడు మీతోనే ఉన్నాడు. అలా చెప్పుండకపోతే అన్నయ్య వెనకాలే ప్రమాదం ఉండింది. అప్పుడే కాదు రమ్మీ ఇంకెప్పటికీ చెప్పకూడదని ఫిక్స్ అయిపోయాను" 


రమ్య.... "నువ్వు చెప్పక పొతే,  తనకి ప్రాబ్లెమ్ అవచ్చేమో కదే " 


"అన్నయ్య దగ్గరకి వెళ్ళడే. వాడి కోపం నా మీదే. నేనూ కాలేజ్ కి రాను ఇంక. ఎగ్జామ్స్ అయ్యాక అటు చుట్టూ పక్కలోకి కూడా వచ్చే అవసరం లేదు" 


"సరే స్వాతి.....  ఇంక ఊరుకో. ఇంకేమి ప్రాబ్లెమ్ లేదని నువ్వే చెప్తున్నావు కదా" 


"రమ్యా భయమేసింది చాలా. ఇంట్లో అందరూ బెంగగా ఉన్నారని నవ్వుతూ తిరుగుతున్నాను" అంటూ రమ్యని పట్టుకుని భోరుమంది. 


కొద్దిసేపటి కి సద్దుకుని, "కానీ ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పకూ. ప్లీజ్."


"చెప్పకూడదంటే,  నువ్వు మనసులో నుంచి టెన్షన్ తీసేసి,  ఇంట్లోనే ఉంటావ్ అన్నావు కదా,  హాయిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. అందరికోసం హ్యాపీగా ఉండటం కాదు స్వాతి నువ్వు నిన్నటి టాపిక్ వదిలేయాలి. అలా ఉండగలిగితేనే నేనూ చెప్పను" 


"సరే. నేనూ ట్రై చేస్తాను రమ్మీ. థాంక్యూ " 


"గుడ్ గర్ల్..... సరే రా బయటకి,  ఆంటీ వాళ్ళకి హాయ్ చెప్పేసి నేను బయల్దేరుతా" అంటూ లేచింది


అందరితో మాట్లాడి,  సాయంత్రం వరకూ అక్కడే ఉండి, స్వాతి మనస్ఫూర్తిగా కొంచం బానే ఉంది అనిపించాక,  ప్రదీప్ ఇంటి దగ్గర దింపుతానంటే ఇద్దరూ బయల్దేరారు. 


కార్ లో ఉన్నంతసేపు ప్రదీప్, రమ్య వైపు చుస్తూండటంతో, "ఏంటన్నయ్య?? ఎందుకలా చూస్తున్నావ్ నన్ను" 


"రమ్యా.....  నన్ను అన్నా అంటావ్ అక్కడ బావ ని అన్నా అంటావ్,  పాపం చిన్నూకి వరసలు మార్చేయకూ" అంటూ నవ్వాడు 


"సరే సార్" 


"అంటే.... మొన్న వచ్చిన బావనే 'అన్న'అని ఫిక్స్ అయ్యావా....హహహ" 


"అంతే కదా.....  ఇంతకీ ఏం అడగాలనుకుంటున్నావో అడిగెయ్యి" 


"నీకు కాల్ చేసి ఇంటికి రమ్మనప్పుడే నాకేం కావాలో అడిగాను, ఇప్పుడు నీకు మాత్రమే మేటర్ తెలుసు. ఏమయిందో చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా" 


"సార్.....  ఎవరి వలన ప్రోబ్లేమో నీకూ తెలుసు. నువ్వు,  అన్నయ్యా జాగ్రత్తగా ఉండండి. మీకేమవుతుందో అని అది భయపడుతోంది. ఈ టాపిక్ ని లాగకండి. వదిలేసెయ్యండి. వాడే పోతాడు. మీరు వాడి జోలికి వెళ్తే స్వాతి ఇంకా ప్రాబ్లెమ్ లో పడ్తుంది" అని స్వాతి చెప్పింది మొత్తం చెప్పింది 


ప్రదీప్ "సరే రమ్య. మేమూ అదే అనుకున్నాములే" 


***********************************


మొత్తానికి ఈ విక్రమ్ వలన,  స్వాతికి పెళ్ళి చేయాలన్న ఆలోచన మొదలయ్యింది వాళ్ళ పెద్ద వాళ్ళకి. మరి పిల్లలకి ఇప్పుడే చెప్పకపోతే ఎప్పుడు చెప్తారో...... ప్రదీప్ మాట్లాడటానికి, ఇప్పుడు తనకీ తెలీదు ఏం జరుగుతోందో.... మరి ఏమవుతుందంటారు



Comments