9
ప్రదీప్... "ఏదో అలా అడిగితె ఎవరో ఏంటో ఇప్పటికైనా చెప్తావేమో అని, నా ప్రయత్నం నేను చేశా. ముందు మాత్రం చదువు మీద ధ్యాస పెట్టు. పిచ్చ వేషాలు వేయకుండా"
ముద్దు చేస్తూనే వార్నింగ్ ఇచ్చాడుగా అనుకుంది స్వాతి
తర్వాత రోజు, కాలేజ్ కి వెళ్ళాక జరిగినది మొత్తం రమ్య కి చెప్పగా, "ముద్దు పెట్టుకున్నాడా" అంది రమ్య కళ్ళు రెప్ప వేయటం మర్చిపోయినదానిలాగా
"ఇంత స్టోరీ జరిగిందే అంటే నీకు బండి ఆ స్టేషన్ లో నే ఉండిపోయిందా" అంది స్వాతీ ఏడిపిస్తూ
"నిజంగానే ముద్దు పెట్టుకున్నాడా" మళ్ళీ అడిగిందీ రమ్య, నువ్వేం చెప్పిన నా చెవులకి వినిపించవు కానీ నేను అడిగిందీ చెప్పవే అన్నట్లూ
"ఆ " అంది స్వాతి సిగ్గుపడుతూ
"నువ్వు తనని తోసేసావా, పైగా ప్రేమ అంటే ఇది కాదూ అంటూ క్లాస్ పీకావా" కళ్ళు పెద్దవి చేసి
రమ్య అలా అడుగుతుంటే, ఇప్పటి వరకూ తప్పు చేశానని అనిపించకపోయినా ఇప్పుడు మాత్రం తప్పు చేసినట్లుగా తల వంచుకుని, "అవును" అంది
"ఫస్ట్ డే నే సార్ ని డిసప్పోఇంట్ చేసేసావా. పాపం ఎంత ఫీల్ అయ్యాడో. మరీ ఇంత ముద్ద పప్పువేంటే. నిన్నెలా భరిస్తాడో" అంది రమ్య స్వాతిని ఆటపట్టిస్తూ
"ఆ లేకపోతే ముద్దు వరకేనా ఇంకా అడ్వాన్స్ అవమంటావా. ఏం చెప్తున్నావే. అది నోరా మురిక్కాలవ. నేనింతే. మా బావ నన్ను అర్థం చేసుకుంటాడులే. నీ లాగా కాదు" అంది ఉడుక్కుంటూ
రమ్య..... "సరే కానీ మరి నా పార్టీ ఏదే?"
"పార్టీ ఆ.... ఎందుకే"
" మీ బావ ని ప్రేమిస్తున్నా అని చెప్పేసావు తనూ ఆక్సప్ట్ చేసేసాడు. నువ్వు ఫుల్ హ్యాపీ. మరి నాకు పార్టీ ఇయ్యవేంటి"
"హ్యాపీనే కానీ అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందే "
"ఎందుకూ"
"ఎందుకేంటే..... అన్నయ్య ఏమన్నాడో చెప్పాను కదా. ఇంట్లో చెప్పకపోటం అంటే ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోందే. అలా అని చెప్పటానికేమో, బావకి జాబ్ వచ్చాక చెప్పటమే కరెక్ట్. ఏం అర్థం కావట్లేదు. నిన్న నాన్నకి అన్నయ్యకి అబద్దం చెప్తుంటే చాలా తప్పుగా అనిపించింది" అంది తలవంచుకుని
"ఓయి..... హ్యాపీ గా ఉండటం రాదా నీకు. ఫస్ట్ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయి. తనకి జాబ్ వచ్చినప్పుడు చెపుదాం అన్నాడు కదా అప్పటి వరకూ ఇంకేం ఆలోచించకు. అబద్ధాలు చెప్పాల్సిన వస్తోందంటావా... అది ఒకసారేగా. చెప్తే వచ్చే సమస్యలకన్నా అదే బెటర్ ఇప్పటికైతే". మళ్ళీ ఏదో గుర్తోచిన్నట్లు.... "ఇంకేం ఆలోచించకు అంటే ఎగ్జామ్స్ కూడా మర్చిపోమని కాదు, సప్లీస్ ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. ఇదే ఫైనల్ ఇయర్ అసలే. ఇంతకీ మీ బావ కి ఆ విషయం తెలుసా"
"తెలీదు, చెప్పలేదు. అవసరమానే. ఫస్ట్ డే నే పరువు తీసుకోమంటావ్" అంది వెర్రి నవ్వు ఒకటి నవ్వి.
"సరేలే పదా. క్లాస్ కి టైమ్ అవుతోంది. మాకు ఎక్సట్రా క్లాస్ ఉందీ, నువ్వు వెయిట్ చేస్తావా వెళ్ళిపోతావా "
స్వాతీ..... "ఉంటానే. ఈలోపు గుడికి వెళ్ళేసి వస్తాను. మీరొచ్చాకే వెళదామూ "
"సరే. బాయ్" అని ఇద్దరూ వెళ్లిపోయారు
స్వాతీ క్లాస్సేస్ అయిపోయాక, కాలేజ్ నుంచి బయటకి రాగానే వెనకాల నుంచి ఎవరో పిలిచినట్లనిపించి వెనక్కి చూసేసరికి అక్కడ హరీష్ నవ్వుతూ తన దగ్గరకి వస్తున్నాడు. అతన్ని చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యంగా
"హాయ్ బావా నువ్వెంటిక్కడా"
"ఇటువైపు పని ఉంటే, ఫ్రండ్ తో పాటు వచ్చాను. వాళ్ళ తమ్ముడిది ఇదే కాలేజ్ అంటే ఇటొచ్చాను... నిన్ను చూసాను. నువ్వెంటి బయటకి వెళ్తున్నావా"
"బయాటికా..... కాదే, కాలేజ్ అయిపోయిందీ " అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటే, హరీష్ నవ్వుతూ, "అది కాదురా, బస్ స్టాప్ అటైతే ఇటు ఎక్కడికో వెళ్తున్నట్లున్నావు"
"అదా.... పక్కనే గుడి ఉందీ. నిన్న వెళదామనుకున్నా, కానీ అవలేదు. నువ్వు ఫ్రండ్ తో వెళ్తున్నావా ఇంటికి"
"కాదు. వాడు వాళ్ళ తమ్ముడితో వెళ్ళిపోతాడు. నీకు ఓకే అయితే నాతో వస్తావా"
స్వాతి.... "సరే బావ పదా" అంటూ వెనుదిరిగింది. కార్ లో కూర్చున్నాక,
"గుడికి ఎటు వెళ్ళాలి"
"పర్వాలేదు బావా, నీకు లేట్ అవుతుందీ. నేను రేపు వెళ్తానులే"
"ఎటో చెప్పూ"
స్వాతీ చెప్పిన వైపు వెళ్లి, గుడిలో దర్శనం చేస్కుని అక్కడ కొంచం సేపు కూర్చున్నారు.
"వచ్చిందే నీతో టైమ్ స్పెండ్ చేయటానికి, అది ఎక్కడైతే ఏంటి. నీతో గుడికి రావటం ఇంకా బావుంది"
స్వాతి నవ్వి, ఏదో గుర్తొచ్చినదానిలాగా "మరి మీ ఫ్రెండ్ కోసం వచ్చా అన్నావూ"
"హహ్హహ్హ.... నీకోసం వస్తుంటే ఫ్రెండ్ కనిపించాడు. రోడ్ మీద నుంచుని నీకోసమే వచ్చా అంటే ఏమంటావో అని అలా చెప్పాను"
"నేనేమంటాను బావా. ఎవరైనా చుస్తే ఏమనుకుంటారో అని భయపడతానేమో కానీ నువ్వొస్తే నీతో టైమ్ స్పెండ్ చేయచ్చని నాకుండదేంటి"
ఇంతలో స్వాతి ఫోన్ రింగ్ అయిందని, "ఒక్క నిమిషం బావ" అంటూ ఫోన్ తీసి "హలో" అనగా,
"ఎక్కడున్నావే. మేము బయటకి వస్తున్నాం. బస్ స్టాప్ లో కలుద్దాం" అంటూ రమ్య ఫోన్ పెట్టేయబోతుంటే
"హేయ్ రమ్యా, నేను గుడిలో ఉన్నాను. మీరు వెళ్ళండిలే. నేను తర్వాత వస్తాను"
"ఏ?? గుడిలో ఉండిపోతావా" అంది రమ్య వెటకారంగా
స్వాతి "కాదే బాబూ, బావ వచ్చాడు, తనతో వస్తాను. మీరు వెళ్ళండి" అంది హరీష్ కి వినిపించకూడదని మెల్లిగా, కానీ గుడిలో నిశ్శబ్దంగా ఉండటం వలన తనకి స్వాతివే కాదు ఫోన్ లో రమ్య మాటలు కూడా వినిపిస్తున్నాయి.
"ఓహో.... ఇంకేం మరీ. ఎంజాయ్" అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య.
హరీష్ రమ్య అరుపులకి నవ్వుకుని, "మీరందరూ కలిసే వెళ్తారా. అందరూ ఇంటి దగ్గరేనా"
"ఆ కలిసే వెళ్తాము. నా క్లాస్సేస్ ముందరే అయిపోతాయి కానీ వీళ్ళు వచ్చేవరకూ వెయిట్ చేస్తాను. చాలా వరకూ లైబ్రరీలో నే కూర్చుంటాను. ఇపుడు బస్ ఎక్కితే రెండు గంటలు పడ్తుంది ఇంటికి వెళ్ళటానికి "
"మరి ఆగటం ఎందుకు, నీ క్లాస్సేస్ అయిపోయాక వెళ్లిపోవచ్చు కదా, ఒక గంట సేవ్ చేస్తావు"
"అవుననుకో, కానీ ఆ గంట లైబ్రరీ లో హోంవర్క్స్ అనో చదువుకోటామో చేస్తాను కదా, వేస్ట్ ఏమవదు. డే మొత్తం లో కి వాళ్ళతో పాటు ఉండే ఆ కొంచం టైమే బావుంటుంది బావా " అంది స్వాతి డల్ గా
హరీష్... స్వాతి ఫేస్ లో చేంజ్ ని గమనించాడు కానీ ఏమి మాట్లాడలేదు.
స్వాతీ "సరేలే. ఇంటికి వెళ్దామా" అంటూ లేచీ కార్ ఎక్కారు
కార్ లో..... "అవును బావా.... ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నావ్ కదా, నువ్వు ఏ ఫీల్డ్ లో చూస్తున్నావు, అసలు ఇంటర్వ్యూ లో సాఫ్ట్వేర్ కి సంబంధించి ఎలాంటివి అడుగుతారు"
హరీష్ తన కెరీర్ ప్లాన్స్ అవీ చెప్తూ, స్వాతి కి ఇంటర్వ్యూస్ గురించి చెప్పాడు.
"స్వాతీ.... స్టడీస్ అయ్యాక నీ ప్లాన్ ఏంటి. ఏదైనా జాబ్ చేద్దామనా లేదా ఇంకా చదువుకోవాలనా లేదా ఎనీ అధర్ థాట్స్"
స్వాతి నవ్వేసి, "ఏమో. నీకేం ఇష్టం "
"హ హా.... నాకేం ఇష్టం ఉంటుంది. నీకు ఏది నచ్చితే అది చేయి. సజేషన్ కావాలంటే డిస్కస్ చేయగలను కానీ ఫైనల్ డెసిషన్ నీదే. అండ్ నీకేది ఇష్టమో దానికి నా సపోర్ట్ ఉంటుందీ. నా కోసం నువ్వేమి నీ లైఫ్ ని, లైఫ్ స్టయిల్ ని మార్చుకోవాలని నేను ఎక్సపెక్ట్ చేయటం లేదూ, అలా చేయటము ఇష్టంలేదు"
స్వాతీ చిన్నగా నవ్వేసి..... "సరే" అంది
"సరే కాదురా, చెప్పచ్చుగా"
"ఏమో బావా ఇంకా అంత ఆలోచించలేదు" అంది మొహమాటంగా
"సరే.... ఇంకా ఏమైనా చెప్పు"
"బావా నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా"
"అదేం క్వశ్చనే "
"అదే..... గర్ల్ ఫ్రెండ్స్ "
"ఆ ఉన్నారు. కాలేజ్ లో ఉన్నప్పుడు అఫైర్స్ ఉండేవి"
"బావుంటారా "
"ఆ సూపర్ ఉంటారు. వీకెండ్ వస్తే చాలు పబ్లు అవీ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళము"
"ఓహ్ అవునా.... " అంది ఏదో ఆలోచిస్తూ
స్వాతి తల మీద తడుతూ "ఏంటి ఓహో లు..... నాకెవరున్నారే. నీకిలాంటి డౌట్లు కూడా వస్తాయా. ఏదో సరదాగా అంటే ఓహో అని ఆలోచించేస్తున్నావు"
"ఏం ఉండకూడదెంటి. నీకేం.... కత్తి లా ఉంటావ్. ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు"
"నువ్వు కనిపించవు కానీ బాగా.... కబుర్లొచ్చే. అయితే నువ్వూ అలాగే ఫ్లాట్ అయ్యావా"
"ఛా.... కాదు బావా. నాకు నువ్వు నచ్చటానికి చాలా రీసన్స్ ఉన్నాయి కానీ అందం వలన మాత్రం కాదు. నువ్వు హాట్ గా ఉంటావని ఇందాకే రియలైజ్ అయ్యాను" అంది నవ్వుతూ
"ఇందాకా.... ఎందుకూ"
"నువ్వు గమనించలేదేమో కానీ ఇందాకా కాలేజ్ దగ్గర అమ్మాయిలు ఎన్ని ఆక్సిడెంట్ లు చేశారో నిన్ను చూస్తూ" అంది ఇంకా గట్టిగా నవ్వుతూ
"నీకేమో కుళ్ళు వచ్చి గబగబా కార్ ఎక్కేసావా. నేనింకా నా కోసం అనుకున్నా "
"నీకోసమే బావా. ఇంకెవరైనా ఎక్కేస్తారేమో అని వెళ్దాం పదా అన్నాను"
"స్వాతీ..... ఇంటికి ఇప్పుడే వెళ్ళాలా. కొంచం సేపు ఉండచ్చు కదా. నీతో ఇంకా మాట్లాడాలనుంది"
"బావా మళ్ళీ కలుస్తాము కదా"
"రేపు ఇంటర్వ్యూ ఉందీ. నేను రేపు కలవలేనేమో "
"అవునా..... ఇప్పుడు చెప్తావేంటి మరీ. రేపు కలవలేకపోతే ఎప్పుడు వీలు ఉంటే అప్పుడే కలవచ్చు. ఫోన్ ఉందీ మెసేజ్ చేయచ్చు. అయినా రోజూ నీతో వస్తే మా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసేస్తారు. బాగొదులే. " అంటూ కార్ దిగింది.
"సరేలే. బాయ్"
స్వాతి.... "అల్ ది బెస్ట్ హాట్టి" అంది నవ్వి
హరీష్ కూడా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు
Comments
Post a Comment