8

 



"నేనే....  మరేం చేయనూ నీ నెంబర్ కూడా లేదు నాదగ్గరా" అన్నాడు హరీష్ నవ్వుతూ 


"సరే "


"సరే ఏంటీ.....  నెంబర్ ఇవ్వూ ఇప్పుడైనా "


స్వాతి చిలిపి గా "ఎందుకూ మావయ్యతోటి చేయించూ... అవును బావా..... మావయ్యకి ఏమని చెప్పావూ. అసలు వాళ్లిద్దరూ చెప్పినది వింటే నాకైతే ఫ్యూస్ ఎగిరిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా వచ్చేద్దాన్ని కాదూ, కానీ ఎందుకో తెలీదు నిన్ను ..." మాట ఆపేసి,  మళ్ళీ "ఏమో ఎందుకో ఒకసారి వస్తే డౌట్ తీరిపోతుందని వచ్చేసా" అంది చివరిలో తడబడుతూ


హరీష్ కి ఆ తడబాటు అర్ధమయ్యి, చిన్నగా నవ్వుకుని "అంత ఫ్యూస్ ఎగిరిపోయేలా ఏమన్నారేంటి"


స్వాతి వాళ్ళ అమ్మ గారు చెప్పిన విషయం చెప్పి, "నువ్వింట్లో చెప్పేసావా, చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాడంటే ఏమనుకోవాలి?? అందుకోసం రావటం మానేయద్దంటే ఎందుకు రాననుకుంటున్నారు?? తెలిసి అంటున్నారా లేదా మాములుగా మాట్లాడింది నేనే అలా ఆలోచిస్తున్నానా?? నువ్వు చెప్పి ఉంటే అసలు మావయ్య, అత్తయ్యకి నా మొహం మళ్ళీ చూపించగలనా??" 


హరీష్ గట్టిగా నవ్వుతూనే ఉన్నాడు,  "ఇన్ని డౌట్లెంటే"


"అది కాదూ, ముందర నువ్వు ఇంట్లో చెప్పేసావా....  చెప్పూ" అడిగింది స్వాతి అనుమానంగా. హరీష్ చెప్పలేదన్నట్లు తల అడ్డంగా ఊపగా, "నిజంగా" బతిమాలుతున్నట్లుగా మళ్ళీ అడిగిందీ.


"ఆ రోజు మన మధ్యన జరిగినది ఏదీ ఇంట్లో తెలీదు. నీతో మాట్లాడాక కానీ నాకసలు ఇంకో ఆలోచనలే రాలేదు. చెప్పాలో చెప్పకూడదో కూడా ఆలోచించలేదు" అన్నాడు స్వాతినే ఆరాధనగా చూస్తూ. 


స్వాతి ఆలోచిస్తూ "సరే " అంది. 


"ఇప్పుడేం ఆలోచిస్తున్నావు" అడిగాడు హరీష్ ఆమెనుండి చూపు తిప్పకుండ.  


"బావా నిన్నొకటి అడగొచ్చా" 


"ఏంటిరా.....  ఎందుకంత మొహమాటంగా మాట్లాడ్తున్నావూ,  ఎప్పుడూ లేనిది కొత్తగా" 


"అదీ.....  మరీ ....  అత్తయ్యా వాళ్ళు నన్ను ఆక్సెప్ట్ చేస్తారా" అడిగింది  అనుమానంగా 


"నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా. వాళ్ళు నిన్ను ఆక్సెప్ట్ చేస్తారు కానీ మీ ఇంట్లోనే..... " 


"ఏమో బావా నేనూ ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడాలోచిస్తే  భయమేస్తోంది. ఏ చిన్న ప్రాబ్లెమ్ అయినా,  ఫ్యామిలీ లో అందరి ముందర అమ్మా వాళ్ళకి మాటొస్తుంది. అసలు అన్నయ్య ఎలా రియాక్ట్ అవతాడో. బావా..... భయమేస్తోంది" అంది కంగారు పడుతూ 


హరీష్ ఏడిపిస్తూ " వచ్చిన  కొంచం సేపట్లో అన్నీ షేడ్స్ చూపించేసావు. ఇంతలోనే నన్ను ప్రేమిస్తున్నా అంటావు అంతలోనే భయమంటావు ఇంతలోనే నవ్వుతావు అంతలోనే బాధపడిపోతావు. అంత టెన్షన్ పడటానికి ఏముందీ..... నాకు మాత్రం తెలీదా మన ఫ్యామిలీ గురించి. ముందర నాకు జాబ్ రానీయి, ఆల్ర్రెడీ ఇంటర్వ్యూస్ లైన్ అప్ అయి ఉన్నాయి. మోస్ట్లీ వన్ మంత్ లో వస్తుందనే అనుకుంటున్నా.  నీ స్టడీస్ అవటానికి టైమ్ ఎలాగో కావాలి. ముందర చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ తర్వాత పెద్దవాళ్ళతో  నేను మాట్లాడతాను,  నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ  ఏం ఆలోచించి టెన్షన్ పడిపోకు. సరేనా" 


"మ్మ్ " 


"కోపమొచ్చిందా "


"లేదు బావా. నువ్వలా చెప్తుంటే ధైర్యంగా ఉందీ"


"స్వాతీ" 


"ఆ "


"స్వాతీ"


"ఆ.... చెప్పు బావా"


"లవ్ యూ స్వాతి. నా మనసులో మాట చెప్పటానికి ఇన్నాళ్ళు పట్టింది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. అందరినీ ఒప్పించే బాధ్యత నాది. ప్రామిస్"


స్వాతి తల ఊపి"బావా నేను బయల్దేరతాను. లేట్ అవుతోంది"


స్వాతిని అలా కళ్ళార్పకుండా చూస్తూనే  "మళ్ళీ ఎప్పుడొస్తావు" అనడిగాడు 


"నీ నెంబర్ ఇవ్వూ,  కాల్ చేస్తాను" అని నెంబర్ తీసుకొని బయల్దేరుతూ, గుమ్మం వరకూ వెళ్లి మళ్ళీ వెనక్కొచ్చి " బావా....  ఇది కల కాదు కదా. నీకు నేనంటే ఇష్టమే కదా, నన్నొదిలేయవు కదా" అంది ఏడుపు మొహం పెడుతూ


స్వాతి భుజం మీద చెయ్యేసి దగ్గరకి తీసుకునీ, "నువ్వంటే ఇష్టం కాదురా, పిచ్చి. లవ్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నా వినూ,  నేనొదలటం కాదు నువ్వే నేనొద్దు అన్నా కూడా,  నేను మాత్రం నిన్నొదులుకోను. అర్థమయ్యిందా. ఇది కల కాదు" 


"సరే " అంది. తన మొహం లో ఏదో ప్రశాంతత. తలుపు దగ్గరగా వెళ్లి ఆగిపోయిందీ,  ఏం చేస్తుందీ. మనసే కాదు కాళ్ళు కూడా వెళ్లనంటున్నాయి అతని నుంచి దూరంగా. 


"బావా.....  సారీ" అని చెప్పి పరిగెత్తింది


మొదట ఎందుకు చెప్పిందో అర్థం కాకపోయినా,  తర్వాత అర్థమైనట్లుగా హరీష్ తనలో తానే నవ్వుకున్నాడు. 


*******స్వాతి వెళ్లిపోయేటప్పుడు ఎందుకు సారీ చెప్పిందీ,  హరీష్ ఎందుకు నవ్వాడు. మీ ఎవరికైనా అర్థమయ్యిందా. నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి*******


అక్కడ నుంచి స్వాతీ వెళ్ళాక హరీష్ కి ఏదో మెసేజ్ వచ్చిందని ఫోన్ చూసుకున్నాడు. అదీ స్వాతి దగ్గర నుంచి.


"లవ్ యూ టూ బావా 


రోజూ కలలలోనే నిన్ను చూస్తున్నాను


నేడు కళ్ళలో నింపుకున్నాను 


మళ్ళీ నిన్ను చూసే క్షణం వరకూ


ఎదురుచూస్తూ ఉంటాను 


ఇదే నా నెంబర్... నీ స్వాతి" 


హరీష్ ఆ మెసేజ్ చూసీ వెంటనే కాల్ చేసాడు 


"నా స్వాతి ఇంత బాగా రాయగలదని నాకస్సలు తెలీదురా. అయినా నువ్వు ఎదురుచూడగలవేమో కానీ నా వల్ల కాదు. రేపు కలుస్తున్నాం... అంతే"


"మరి ఇన్నాళ్ళూ ఎలా ఉన్నావు బావ. నేను నోరు తెరవకపోతే అప్పుడేం చేసేవాడివి" నవ్వుతూ అడిగింది.


"నీకేం తెలుసు నేనేమేమీ చేసానో" అని నువ్వుకుంటుండగా "బావ ఈరోజంటే క్లాస్సేస్ ఏమి లేవు. రేపటి నుంచి మళ్ళీ మాములే. కాలేజీ అయ్యి ఇంటికొచ్చేసరికే లేట్ అయిపోతుందీ" అంది బతిమాలుతున్నట్లు 


"సరే. ఎక్కడున్నావు"


"మీ సెల్లార్ లోనుండి బయటకి వెళ్తున్నా... బావా..." అంటూ మెల్లగా అరిచింది. 


హరీష్ అది గమనించకుండా, "హేయ్ ఆగు,  నేను దింపుతాను. వస్తున్నా" 


"ఆఁహా ఒద్దు బావ. నాన్న వచ్చారు. బాయ్" 


"సరే జాగ్రత్త. ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేయి" అని పెట్టేసాడు


తండ్రి కార్ దగ్గరకి వెళ్ళి "నాన్నా మీరేంటి ఇక్కడా?? మావయ్య వాళ్ళింటికా?? నేనూ అందుకే వచ్చాను కానీ వాళ్ళు లేరు ఇంట్లో"


"నువ్వు ఒకదానివి వస్తావుగా. అన్నయ్య నాకు ఫోను చేసాడు. మొన్న రోడ్డు మీద ఎవరో ఇబ్బంది పెట్టారుట కదా. ఒకదానివి ఎందుకూ రావటం అని నన్ను వెళ్ళమన్నాడు. అయినా అలా ఏదన్నా జరిగితే మాతోనన్నా చెప్పాలి కదమ్మా " అన్నారు స్వాతి కార్ లో కూర్చున్నాక. 


స్వాతి ఇంట్లోకి వెళ్తూనే కాలేజ్ బాగ్ ని పక్కకి పడేసి వాళ్ళ అమ్మగారిని పట్టుకుని తిప్పేసి గట్టిగా ముద్దు పెట్టుకుంది


"ఏమిటే ఏమయ్యిందీ" అన్నారు కూతురిని చూస్తూ


"ఏంలేదమ్మా.  ఈరోజు చాలా హ్యాపీగా ఉందీ" అంది అమ్మని కౌగిలించుకుంటూ


" అదే....  ఆ రీసన్ ఏంటో తెలిస్తే మేమూ సంతోషిస్తాం కదా"అని పక్కన  నుంచి మాట వచ్చింది


ఎవరన్నారో కూడా పట్టించుకోకుండా,  "అన్నిటికీ రీసన్స్ చెప్తారేంటి. చూడు నేనెంత ఉల్లాసంగా ఉన్నానో...  ఎంత ఉత్సాహంగా ఉన్నానో ......" అంటూ వాళ్ళ అమ్మగారిని వదిలి పక్కకి తిరిగేసరికి,  సోఫా లో కాఫీ తాగుతూ కూర్చున్న ప్రదీప్ కనిపించాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు,  అది అడిగింది అమ్మ కాదూ అన్నయ్య అని. 


"అన్నయ్యా నువ్వా...... "


"ఆ నేనే. సోఫా లో మనుషులు ఉన్నారో లేదో కూడా చూడకుండా ఆ బాగ్ ని విసిరేసి ఏమిటా గెంతులు. పొద్దునేమో మొహం వేలాడేసుకుని వెళ్ళావు కాలేజ్ కి ఇప్పుడేమో ఉల్లాసంగా ఉత్సాహంగా అంటున్నావు" 


ప్రదీప్ చెప్పాక కానీ తను ఇందాక విసిరేసిన బాగ్ సోఫా లో ప్రదీప్ పక్కనే పడిఉండటాన్ని గమనించలేదు. అతనకి ఏ వస్తువైనా దాని ప్లేస్ లో అది ఉండకపోతే చాలా కోపం వస్తుంది,  వాళ్ళ అమ్మా గారైనా ఊరుకుంటారేమో కానీ అతను వాళ్ళ అమ్మగారు అలా చేసినా ఊరుకోడు. అతను కోపంగా చూస్తున్నాడని అర్ధమయ్యి వెంటనే సైలెంట్గా  ఆ బాగ్ తీసుకునీ తన రూమ్ లో పెట్టటానికి వెళ్ళిపోయింది. 


"అదేదో మంచి మూడ్ లో ఉంటే ఎందుకురా దాన్ని  కోప్పడతావు. ఇప్పుడే కదా లోపలికి వచ్చింది. చూడు మొహం వేలాడేసుకుని ఎలా వెళ్లిందో.  నువ్వేదైనా చెప్తుంటే నేను మధ్యలో మాట్లాడితే నా మీద ఇంత ఎత్తున లేస్తావు. అది ఏం చెప్తోందో పూర్తిగా వినకుండానే అరిచావు. అదసలే తొందరగా భయపడిపోతుంది,  నువ్వేమో ఇంకా బెదరగొట్టేస్తావు. అన్నవి....  ఫ్రెండ్లీ గా ఉండీ  దాని మంచి చెడులు చూసుకోవాలి,  ఇన్నేళ్ళైనా ఇంకా నేను చెప్పాలా" అంటూ మెల్లిగానే మాట్లాడినా ... గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.


"ఏంటమ్మా. నువ్వు దానికి చెప్పటం మానేసి నాకు క్లాస్ పీకుతున్నావ్. అయినా నేనేదన్నా దాన్ని తిట్టానా అరిచానా"


"నువ్వేమి తిట్టక్కర్లేదు.....  ఆ కళ్ళేసుకుని ఉరిమి చూస్తావు. చాలదేంటి. అదేమో తాబేలు లాగా తల లోపలికి దాచేస్కుంటుంది"


ఆ పోలిక కి ఆ తాబేలు కళ్ళ ముందు కనిపించిందేమో  ప్రదీప్ నవ్వేసాడు,  ఆవిడ కోప్పడుతున్నా కూడా. 


"సరేలే చూసొస్తా" 


"ఎందుకూ.....  ఈసారి  తిట్టటానికా"


"మీ అమ్మాయిని తాబేలు తో పోల్చావు కదా,  ఇంకేం అంటాను. అది ఇంట్లో ఉన్నప్పుడు చప్పుడు చేయకుండా తిరుగుతానులే" అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు 


స్వాతీ రూమ్ లో... 


బయట ఇంత డిస్కషన్ జరుగుతున్నా స్వాతి మాత్రం తన ఆలోచనల్లో తను ఉంది. 


"అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడని చూసుకోలేదు. బాగ్ అక్కడ ఉండటం వలన అది తీసుకునీ లోపలికి వచ్చేసాను. అవునూ.....  అన్నయ్య కి బావ గురించి ఇప్పుడే చెప్పనా. ఒద్దులే. ముందు చదువుకో అని కోప్పడతాడేమో. బావ మీద ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోతుంది. సారీ అన్నయ్యా....  నీ దగ్గర దాచాల్సి వస్తోంది. కానీ అన్వి కి చెప్పేసానే. ఇప్పుడొచ్చిందంటే ఫుల్ డీటెయిల్స్ చెప్తే కానీ వదలదు. కానీ చెప్తే అన్నయ్య కి చెప్పేస్తుందా?  చెప్పదులే. ఆలోచించకుండా తొందరపడి కాల్ చేసేసానంటావా" అని తనలో తానే మాట్లాడుకుంటోంది.


స్వాతి తో మాట్లాడటానికి వచ్చిన ప్రదీప్,  స్వాతి ఏదో ఆలోచిస్తూ ఉండటాన్ని చూసీ,  "ఇదేంటి. అమ్మ అన్నట్లు నిజంగానే భయపడిందా" అనుకుంటూ 


"అవునూ ఇంతకీ ఎందుకంత హ్యాపీ గా ఉన్నావో చెప్పనే లేదు. ఏంటీ సంగతీ. నీ వన్ సైడ్ లవ్ కి క్లియరెన్స్ దొరికిందా"


స్వాతి కి గొంతులో వెలక్కాయ పడింది. 

"అన్నయ్యా " ఖంగారుగా అన్నా అది మాత్రం బయటకి అరిచినట్లే   ఉందీ 


"ఇదేంట్రా దేవుడా నేనసలేమి అననే లేదు,  ఎలా తెలిసిపోతాయి అన్ని అలాగ. అన్నయ్య దగ్గర దాచటం కూడా కష్టమే" అనుకుంటూ ఉంటే


ప్రదీప్...  "ఏదో అలా అడిగితె ఎవరో ఏంటో ఇప్పటికైనా చెప్తావేమో అని. అదే అయితే, ఆ అబ్బాయి మీ కాలేజీనే అనమాట".


స్వాతి చిన్నగా నవ్వి "నువ్వెలా అడిగినా నేనేమీ చెప్పను అన్నయ్యా ఇప్పుడు"  


ప్రదీప్ "నా ప్రయత్నం నేను చేశా. ముందు మాత్రం చదువు మీద ధ్యాస పెట్టు. పిచ్చ వేషాలు వేయకుండా" అని వెళ్ళిపోయాడు. ముద్దు చేస్తూనే వార్నింగ్ ఇచ్చాడుగా అనుకుంది స్వాతి. 

*******************************************************



Comments