25

 "ఈ పిల్ల వచ్చిందంటే చాలు హడావిడి చేసేస్తుంది. ఎంత కలుపుగోలుగా ఉంటుందో. డబ్బున్న వాళ్ళు,  ఒక్కతే పిల్ల. ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం. వీడికీ ఆ అమ్మాయంటే ఇష్టం. ఆ అమ్మాయిని హరీష్ కి అడిగితె ఎలా ఉంటుందంటావే"


హరీష్ వాళ్ళ అమ్మగారు అడిగిన ప్రశ్నకి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. "అత్తయ్యా నా బావని తనకి ఇచ్చేస్తానంటావేంటి"అని అడగాలనిపించింది. కానీ నోటిని అదుపులో పెట్టుకునీ,  


"అత్తయ్యా బావకి ఆ అమ్మాఅంటే ఇష్టమని నీకు నువ్వు అనేసుకోవటం ఎందుకు. ముందర బావని అడుగు తన మనసులో ఏముందో".


"వాళ్ళని చూస్తే నీకు అర్థం కాలేదేంటే. వాడు చెప్పటానికి మొహమాట పడ్తున్నాడు. ఆ అమ్మాయికి వంక పెట్టటానికి ఏమీ లేదు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడమని మావయ్యతో చెప్తాను" స్వాతితో మాట్లాడుతూ ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆవిడ.


"ఏమో అత్తయ్య. ఇది బావ లైఫ్. మనం ఊహించుకోవటంకన్నా, తనతోనే డైరెక్ట్ గా మాట్లాడితే బావుంటుంది" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది 


"బావా రెడీనా" 


"స్వీటీ....  ఇటురా" అంటూ పక్కకి పిలిచి,  "ఎలా ఉంది కొత్త షర్ట్" 


"నీకేంటి బావా ఏ  షర్ట్ వేసినా నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావు.  నువ్వు నా హాట్టీ కదా" అంటూ అతని బుగ్గ లాగి నవ్వింది 


"అయితే మరి కళ్ళల్లో నీళ్ళెందుకు" 


"ఏమవలేదు బావ. వెళ్దాం పదా, ఆకలేస్తోంది" అంటూ చేయి పట్టి లాగగా, నలుగురూ ఇంటి నుంచి బయట పడ్డారు.  


లంచ్ చేసే అంత సేపు హరీష్ స్వాతి చేయి వదలలేదు.  ప్రియా కూడా అతన్ని వదలలేదు.  ఒక సారి హరీష్ ప్లేట్ లోది తీస్కుని తింటే ఇంకోసారి తనకి తినిపిస్తోంది  లేదా చేతులేసి మాట్లాడుతోంది. హరీష్ స్పర్శ స్వాతికి ఊరటనిస్తున్నా, అంతకు ముందర వాళ్ళ అత్తయ్య మాటలే గుర్తు వస్తున్నాయి. స్వాతి మౌనంగా ఉండిపోయింది.


వాసు "ఏంటి సిస్,  ఏమి సరిగ్గా తినటమే లేదు"


"ఆకలిగా లేదన్నా" 


హరీష్ "ఇందాక ఆకలేస్తోంది అంటూ లాక్కొచ్చావు.  ఇప్పుడు లేదంటావేంటి ఏమి తినకుండా. మాట్లాడకుండా తిను" అంటూ తనే తినిపించాడు, స్వాతి ఎందుకో టెన్షన్ పడుతోంది అని గమనించి. 


వాళ్ళందరూ తినేసాక,  బయటంతా తిరిగి సాయంత్రం అవుతుండగా ఎక్సిబిషన్ ఏదో ఉంటే అక్కడికి చేరారు. ప్రియా అక్కడ ఉన్న రైడ్స్ అన్ని ఎక్కుదామని గొడవ చేసేసరికి హరీష్ సరే అంటూ ప్రియ తో వెళ్ళాడు. స్వాతి, వాసు మాత్రం కళ్ళు తిరుగుతాయి అంటూ పక్కకి కూర్చున్నారు


"ఏంటి స్వాతి, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లున్నావు ఇందాకటి నుంచి" 


"ఆహా  ఏంలేదన్నయ్యా" అంటూ హరీష్ ని ఒకసారి చూసింది.


"హ్మ్....  వాడూ ప్రియా క్లోజ్ గా ఉంటే నీకు నచ్చలేదా" అంటూ కొంచం నవ్వాడు 


"ప్రియా కి బావ అంటే ఇష్టం, అది స్నేహం కాదు. ఒక్కక్షణం కూడా తనని వదలటం లేదు. తన చేత్తో పెట్టింది తిన్నప్పుడు ఆమె నా వైపు ఒకలాంటి గర్వంతో చూసింది. తన ప్రతీ మాటలో తెలుస్తోంది.  ప్రియా కళ్ళలో బావ మీద ప్రేమ నాకు కనిపిస్తోంది,  అత్తయ్య కి కనిపిస్తోంది మరి బావ కి ఎందుకు తెలీటం లేదో అర్థం కావట్లేదు. తెలిసీ .... ఏమి అనలేకపోతున్నాడా  అని ఆలోచిస్తున్నా.  అన్నయ్యా....  ప్రియా మీరు కూడా మంచి ఫ్రెండ్సే.  నేను మీ ఫ్రెండ్ గురించి మీతోనే కంప్లైంట్ చేశాననుకోకండి.  బావ గురించి ఆలోచిస్తూ అనేశాను.  ప్రియా మీద కోపమేమి లేదు" 


"తను నా ఫ్రెండే అలాగే హరి కూడా.  నిన్ను కాకుండా ఇంకెవరిని వాడి లైఫ్ లో కి రానీయడు. అదే కనక జరిగితే వాడు సంతోషంగా ఉండడు. ప్రియ అంటావా,  తనది చిన్న పిల్లల మనస్తత్వం. ఒద్దు అంటే ఇంకా మొండిగా చేస్తుంది. అందుకే వాడికి తెలిసినా,  ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడేమో." 


"తన గురించి నాకూ తెలుసు అన్నయ్యా.  కానీ తన పక్కన ఇంకో అమ్మాయిని భరించలేకపోతున్నాను. నా బావ మీద నాకు నమ్మకముంది. కానీ అంత మాత్రాన తన మీద చేతులేస్తుంటే,  అదీ నన్ను రెచ్చగొట్టడానికే అని తెలుస్తున్నా కామ్ గా ఉండలేకపోతున్నా. నా బావ నాకే సొంతం. తను లేకపోతే నేను బతకలేను".


"నిన్ను వదిలి తను ఎక్కడికిపోతాడు. ప్రియా వాడి లైఫ్ లోకి రాకముందే వాడి మనసులో నిన్ను సింహాసనం వేసి కూర్చోపెట్టాడు. ప్రియా వచ్చినా, ఎంత చనువుగా ఉన్నా, నీ స్థానం దగ్గరలోకి కూడా ఎప్పుడూ ఎవరినీ రానీయలేదు. అవునూ.... వాళ్ళ అమ్మ గారికి కూడా ప్రియా వాడిని ఇష్టపడుతోందని గమనించ్చారా??"


"అత్తయ్య ఉద్దేశం లో బావకి కూడా ఆమె అంతే ఇష్టమని అనుకుంటోంది అన్నయ్యా. ఆవిడకి ఏంటి, నిజం తెలిసినా కూడా వాళ్లిద్దరినీ చూస్తే నాకూ అలాగే అనిపిస్తోంది. అలా అని, పిచ్చి ఆలోచనలతో బావని వదిలేసుకుంటా అనుకోకండి. మా బావ గురించి నాకు బాగా తెలుసు. బావతో చెప్తే తనని అనుమానిస్తున్నా అనుకుంటాడని భయం. సిస్టర్ అన్నారుగా, నాకు ఏ  సమస్య వచ్చినా మా అన్నయ్యతో మాట్లాడతాను. అందుకే మీతో చెప్పేసాను. నేనేదో పిచ్చిదాన్ని అనుకోకండి"


"నీ మాటల్లో, నాకు మాత్రం వాడి మీద ప్రేమే కనిపిస్తోంది. హి ఇస్ వెరీ లక్కీ." 


స్వాతి చిన్నగా నవ్వి,  ఏదో  గుర్తొచ్చినదానిలాగా "అన్నయ్యా, ఇప్పుడే వస్తాను. కార్ కీస్ ఇయ్యవా.  వాళ్ళు వచ్చాక కార్ దగ్గరకి వచ్చేయండి" 


"ఒక్కదానివి ఎక్కడికీ. నిన్నొక్కదాన్ని పంపిస్తే వాడు నన్ను చంపుతాడు. పదా నేనూ వస్తాను" 


"ఏమి అనడు. నేనే గోల చేసి వెళ్లిపోయానని చెప్పండి. మీరొచ్చేసరికి కార్ లో కూర్చునుంట. ప్లీజ్ అన్నయ్య" అని కీస్ తీస్కుని పరిగెత్తింది, వాసు పిలుస్తున్నా వినకుండా 


హరీష్, ప్రియా ఒకటి తర్వాత ఇంకోటి రైడ్స్ ఎక్కుతూ,  సడన్ గా అటు వైపు చూసిన హరీష్ కి వాసు ఒక్కడే కూర్చుని కనిపించేసరికి ఖంగారుగా వెనక్కి వచ్చేసాడు.  


"వాసూ స్వీటీ ఏది??" అంటూ అటు ఇటు వెతుకుతూ అడిగాడు 


"కార్ దగ్గర ఉంటాను. రమ్మని చెప్పిన్దిరా. నేనొస్తానన్నా వినిపించుకోలేదు. " 


"అబ్బా....  ఎందుకిలా టెన్షన్ పెడ్తుంది" 


"ఏమోరా. ప్రియని పిలువు. వెళదాము" 


"నువ్వు ప్రియ ని తీసుకునిరా.  నేను కార్ దగ్గరకి వెళ్తున్నా. నువ్వు బయటకి  వచ్చేటప్పుడు కాల్ చేయి" అంటూ పరిగెత్తాడు 


పార్కింగ్ లాట్ లో కార్ వెతుక్కుని కార్ దగ్గరకి రాగానే,  స్వాతి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకునుంది. హరీష్ తలుపు కొట్టటంతో  కార్ లాక్ తీసి బయటకి వచ్చి


"ఏమైందీ బావా అలా ఉన్నావు. వాసు అన్నయ్యా,  ప్రియా ఎక్కడా? " 


స్వాతిని చూడగానే "వాళ్ళు వస్తున్నారు. నువ్వు కనిపించకపోయేసరికి నేను ముందరొచ్చేశాను. నీకు బానే ఉందా. ఎందుకు చెమటలు పడ్తున్నాయి. ఏమయ్యిందీ. ఒంట్లో బాలేదా. ఇంటికి వెళ్ళిపోదాం పదా " అంటూ జ్వరంగా ఉండేమోనని నుదుటి మీద చేయి పెట్టి చూసాడు. 


అతని చేయి తీసి పట్టుకుని "ఏం కాలేదు బావా. నువ్వు కూర్చో. కొంచం నీళ్ళు తాగు. ఎందుకంత ఖంగారు. నాకేమయిపోలేదు. బానే ఉన్నాను"


హరీష్ కార్ లో వెనక సీట్లో కూర్చున్నాడు.  స్వాతి తన పక్కనే  కూర్చుని వాటర్ బాటిల్ ఇచ్చింది. నీళ్ళు తాగి, స్వాతిని హత్తుకున్నాడు. "నీకు ఆల్రెడీ పొద్దునే చెప్పాను,  నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదురా. అది ప్రియా అయినా కూడా. అది నీతో ఎలా ఉంటోందో  అన్ని గమనిస్తూనే ఉన్నాను. అప్పటికి నీ వెనకాలే ఉన్నానురా. ఇన్నేళ్ల స్నేహం వలన, చూస్తున్నా కూడా ఏమి చేయలేకపోయాను స్వీటీ. ఇప్పుడు కూడా నీనుంచి కొంచం సేపు దాన్ని దూరంగా ఉంచుదామనే రైడ్స్ అంటూ తీసుకెళ్ళాను. అంతే కానీ నీకు దూరంగా వెళ్ళలేదురా. నీకు కోపం వస్తే నాతో చెప్పవా, నన్నలా వదిలేసి వచ్చేస్తావా" అంటూ బాధగా అడిగాడు. 


స్వాతి కనిపించకపోయేసరికి ఒక్క సారిగా భయం,  ఖంగారు, బాధ అన్ని కలగలిపి వచ్చేసాయి. తనని దగ్గరకి తీసుకున్నాకే హరీష్ మనసు కుదుటపడింది. 


"బావా వాసు అన్నయ్య నీతో ఏమన్నా అన్నాడా? నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే ఏదో కారణం ఉంటుందని తెలుసు. నీ మీద నాకు నమ్మకముంది బావా, కానీ తను చేతులేసి మాట్లాడుతుంటే కుళ్ళోచ్చేసింది. అంతే కానీ నేను కోపంగా ఏమి వచ్చేయలేదు" అంది నవ్వుతూ


హరీష్ ఆమెని వదిలి ఆమే కళ్ళలోకి చిలిపిగా చూసి నుదుటిపై ముద్దు పెట్టి "నా స్వీటికి కుళ్ళు వచ్చేసిందా ఇంకో అమ్మాయి నా పక్కకి వస్తే..?? అంత ఇష్టమా నేనంటే" 


స్వాతి సిగ్గుతో తల దాచేసుకోగా, హరీష్ ఆమెని హత్తుకుని "ఇంతకీ ఎందుకు వచ్చేసావు. వాసు ఏమంటాడు. వాడికి ఏం చెప్పావు" 


"ఎందుకు వచ్చేసానంటే.... తర్వాత చెప్తానులే బావా,  ఇప్పుడే కాదు. ప్లీజ్. చెప్తా అన్నాను కదా. నువ్వు ముందుకి వెళ్ళు వాళ్ళొచ్చేస్తారింక. ఇలా బాగోదు" అంది తనని తోస్తూ.


"లేదు,  నేనిక్కడే ఉంటా. నా స్వీట్ హార్ట్ తో నా ఇష్టం. చూడలేకపోతే కళ్ళు మూసుకుంటారులే" అన్నాడు కొంచం నవ్వుతూ 


"అబ్బో ఏంటో సార్ మంచి జోరు మీదున్నారే" అంది నవ్వుతూ తన చేతుల్లోనుంచి జరిగి 


స్వాతి చేయి గుండెల మీద పెట్టుకునీ తనని చూస్తూ "నువ్వు మళ్ళి వెళ్ళిపోతావు కదరా. నిన్ను వదలాలని లేదు"


"నేనిప్పుడే వెళ్లట్లేదుగా ..... నీతో బోట్ షికార్ చేద్దామనుంది. అందుకే అన్నయ్య కి కాల్ చేసి పర్మిషన్ తీసేస్కున్నా. అయితే వద్దా??"


"వావ్.....  బోట్ లో నీతో పాటు. ఓకే కాదు డబల్ ఓకే" అంటూ స్వాతి ని దగ్గరకి తీస్కుని ముద్దుపెట్టుకోబోయాడు.


సరిగ్గా అప్పుడే ప్రియా ఫోన్ రావటంతో,  "ఇది ప్రతీసారి మధ్యలో వస్తోంది. ఈరోజు అయిపోయింది" మొదట హరీష్ ఎందుకలా అంటున్నాడో అర్థంకాకపోయినా ఎవరు చేస్తున్నారో చూసి, హరీష్  అరిచేలోపు అతని చేతిలో ఫోను తీసుకుని,


"హలో ప్రియా.....  బావ ఇక్కడే ఉన్నాడు .....ఏమైనా చెప్పాలా ..... సరే,  మేము గేట్ దగ్గరకి వస్తాము. అక్కడే ఉండండి" అంటూ ఫోన్ పెట్టేసి హరీష్ వైపు చూసింది 


"మన మధ్యలోకి ఎవరూ రారు. తను వచ్చాననుకుంటోంది అంతే. రేపు ఎలాగో వెళ్ళిపోతుంది. ఒక్క రోజు ఓపిక పట్టు" 


హరీష్ చిరాకుగా మొహం పెట్టి "సరేలే. నువ్వు మాత్రం ఇక్కడే కూర్చో,  డ్రైవింగ్ వాసు చేస్తాడు" అంటూ కార్ దిగబోయాడు


"ఆహా....  బావా ఇలా కాదు. నవ్వుతూ ఉండు. ఇందాకటి లాగా" అంటూ బుగ్గలు  మీద ముద్దు పెట్టుకుంది. 


హరీష్ గేట్ దగ్గరకి వాళ్ళని పిక్ చేసుకున్నాడు. ప్రియా ఫ్రంట్ సీట్ లో కూర్చోగానే,  వాసుని డ్రైవ్ చేయమని హరీష్, స్వాతి పక్కన సెటిల్ అయ్యాడు. 


హరీష్ చెప్పిన చోటుకి చేరుకుని బోట్ తీసుకున్నారు. అటు వైపు వెళ్తూ ఉండగా,  


స్వాతి... "అన్నయ్యా ఇందాకా మీరు అది తెచ్చింది కార్ లోనే మర్చిపోయారు. తీస్కునొద్దామా" అనీ అడుగుతుంటే, "ఏంటది" అన్నట్లు హరీష్ వాసు వైపు చూసాడు. 


స్వాతి కళ్ళతోనే వాసు ని "అవునని చెప్పూ" అంటూ బతిమాలాటంతో


వాసు తడబడుతూ "అవును కదా. సరే ఇప్పుడే వస్తానురా " అంటూ వెనక్కి వెళ్ళబోయాడు 


హరీష్... "ఏంటిరా అదీ,  నేనెళ్ళి తెస్తానులే,  నువ్వుండు"


వాసు "పర్వాలేదురా. వచ్చేస్తాను" అంటూ స్వాతి,  వాసు కార్ దగ్గరకి వెళ్ళి ఏదో కవర్ తీస్కుని వచ్చారు


అందరూ బోట్ లో కూర్చున్నారు. స్వాతి హరీష్ చేతిని గట్టిగా పట్టుకుంది. వాసు కి కళ్ళ తో సైగ చేయటం తో ఇందాకా తీసుకొచ్చిన కవర్ ని తీస్తూ "హ్యాపీ బర్త్డే"  అంటూ వాసు, స్వాతి అరిచారు 


హరీష్   ఆశ్చర్యపోతూ,  "థాంక్యూ" 


ప్రియ "హ్యాపీ బర్త్డే హరీ" అంటూ హగ్ చేసుకుంది. హరీష్ అసహనంగా దూరం జరుగుతూ "థాంక్ యూ ప్రియ" అంటూనే స్వాతి వైపు చూసాడు 


" వాసు ఇదంతా ఎప్పుడు ప్లాన్  చేసావురా" 


"ఆ క్రెడిట్ నాది కాదు బాబు, సిస్టర్ దే. పదా కేక్ కట్ చేయి" 


హరీష్ స్వాతి వైపు చూస్తుంటే, "ఇందాకా ముందరే ఎందుకు బయటకి  వెళ్ళిపోయాను అని అడిగావు కదా,  ఇందుకే" అని  "కట్ చేయి" అంటూ స్వాతి కళ్ళతోనే సైగ చేసింది.  హరీష్ స్వాతి చేయి పట్టుకుని ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు.


హరీష్ "ఈ బర్త్డే ఇంకా స్పెషల్ రా వాసు. స్వీటీ తో నా ఫస్ట్ బర్త్డే. షీ ఇస్ లవ్ ఆఫ్ మై లైఫ్ రా. థాంక్యూ స్వీటీ ఫర్ కమింగ్ ఇంటూ మై లైఫ్ అండ్ ఫర్ ఎవిరీథింగ్" అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు.


అందరూ కొంచం సేపు అక్కడే గడిపి, స్వాతి వాళ్ళింటికి వెళ్ళారు.


"స్వీటీ థాంక్యూ రా. నా బర్త్డే ని ఎప్పుడూ సెలెబ్రేట్ చేసుకోలేదు" 


"నేనొచ్చా కదా. అన్ని సెలెబ్రేషన్సే... వాసు అన్నయ్యా, ప్రియా లోపలికి రండి. మా అమ్మ వాళ్ళని, అన్నయ్యని కలిసి వెళ్ళండి


"సరే" అంటూ అందరూ లోపలికి వెళ్ళారు 


వాళ్ళు వెళ్లిపోయేటప్పుడు, ప్రియా స్వాతిని ఆపి,  "సారీ స్వాతి. నిన్ను బాధపెట్టాలని చూసాను. యూ అర్ లక్కీ. హరి ప్రేమ నీకు దక్కింది. ఎంత ప్రయత్నించినా నేను ఫ్రెండ్ గానే ఉండిపోయాను"  అని చెప్పి వెళ్ళిపోయింది


ఇంటికి వెళ్ళిపోయాక రాత్రి హరీష్, స్వాతికి మెసెజ్ చేసాడు. 


"ఈరోజు చాలా హ్యాపీ గా ఉన్నాను. థాంక్యూ రా" 


ఆ మెసేజ్ చూడగానే స్వాతి హరీష్ కి ఫోన్ చేసింది.


"స్వీటీ ఇంకా పడుకోలేదా" 


"లేదు బావా. నీతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. వాసు అన్నయ్య వెళ్లిపోయాడా"


"వాసు వెళ్ళిపోయాడు కానీ ఏం చెప్పావు వాసు కి" 


"నేనా?? ఏంలేదే. ఎందుకూ " 


"మా సిస్టర్ ని సతాయించావనుకో ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు" అంటూ నవ్వేసాడు


"అయితే వాసు అన్నయ్య నెంబర్ ఇయ్యి. కంప్లైంట్ చేయాలంటే కావాలి కదా" 


"హహహ అలాగే"


"ప్రియా ఏం చేస్తోంది"


"తను తన రూమ్ లో ఉందిరా. ఇందాకా సారీ చెప్పి వెళ్ళింది"


"ఓహ్ సరేలే".


"స్వీటీ.... అమ్మ చెప్తే మాత్రం నేనెలా ఒప్పుకుంటాను అనుకున్నావురా. నువ్వు నాతో చెప్పద్దా ఏం జరిగిందో. అమ్మతో ప్రియా గురించి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని నేను చెప్తాను. నువ్వు టెన్షన్ పడకు. సరేనా"


"సరే బావ....బావా ఏం చేస్తున్నావ్. ఏంటా సౌండ్స్" 


"ఏంలేదురా. ఒక ఫోటో ఉండాలి ఇక్కడ. అది కనిపించటం లేదు. ఈ షెల్ఫ్ లోనే పెట్టాను. ఎక్కడన్నా పడిపోయిందేమో అని అన్ని పీకుతున్నా 


"హాహాహా సరే" 


"నువ్వు తీసావా అది" 


స్వాతి నవ్వాపుకుంటూ "లేదు బావా.....  నాకేమ్ తెలుసూ. అయినా ఏం ఫోటో అదీ" 


"అదీ చిన్నప్పుడు నువ్వు నాకు ముద్దుపెడ్తున్నప్పటిది. నేను కోపంగా ఉండి  ఫోటో కి నవ్వటం లేదని నువ్వు ముద్దు పెట్టావు,  అప్పుడు వెంటనే నవ్వేసాను. స్వీటీ నాకు ఆ ఫోటో ఇచ్చేయి  లేదా అదే ఫోజ్ లో కొత్త ఫోటో అయినా తీసుకుందాము"


"కొత్తదయితే టైమ్ పడ్తుంది కదా బావా కానీ పాతదే చెప్పగలను ఇప్పుడే  ఎక్కడుందో" 


"నువ్వు దాచేసావా అదీ. చెప్పరా"


"నీ బుక్ షెల్ఫ్ లో బుక్స్ అన్నిటికన్నా సపెరేట్ గా ఒక నోట్బుక్  ఉంచావు. ఆ బుక్ ఎందుకలా అక్కడ పెట్టావు" 


"అదీ నువ్వు నాతో సబ్జెక్టు చెప్పించుకోటానికి వచ్చినప్పుడు దాంట్లో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో రాసి చూపించాను కదా. నువ్వేమో ఎప్పుడు గీసావో కానీ ఒక పేజీ లో హార్ట్ ఇంకోదాంట్లో రోజ్ అలా ఏవేవో డ్రా చేస్తూ ఆడావు. డ్రాయింగ్ బావుందని దాచాను" 


"హాహా.... నువ్వడిగే ఫోటో ఆ హార్ట్ దగ్గరే ఉంది. చూస్కో. ఉంటా" అంటూ పెట్టేసింది 


హరీష్ ఆ బుక్ తీసి ఆ పేజీ లో చూసాడు ఆ ఫోటో దానితో పాటు ఒక పేపర్ పెట్టుంది. దాంట్లో.... 


మన ప్రేమకి తొలి అడుగు ఈ తొలి ముద్దు 

నీ ముద్దు తోనే మొదలవ్వాలి జీవితాంతం నా ప్రతీ పొద్దు 


ఈ పైన ర్రాసింది చదవగానే మొహం మీద ఒక చిరునవ్వు వచ్చింది కదా అలా ఎప్పుడూ నవ్వుతూ, ప్రతీ పుట్టినరోజు నీకు రెట్టింపు సంతోషాన్ని, నీ మనసు కోరుకున్న ప్రతీది నీకు దొరకాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు....  


నీ 

స్వీటీ 


*****************************************************


ఈ ప్రియా లాంటి వాళ్ళు మన లైఫ్ లోను వచ్చిపోతూ ఉంటారు. కానీ మనం ప్రేమించేవాళ్ళు,  "ఆ ప్రియాకన్నా నువ్వే ఎక్కువ, నేను ప్రేమించేది నిన్నే" అని అనగానే మనసు కుదుటపడుతుంది. కొన్ని కొన్ని భావాలకి మాటలు అక్కర్లేదు కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఆ మాటలు తెలిసినవే అయినా,  వింటే ఊరటగా  ఉంటుంది. మీరేమంటారు



Comments