23
దారిలో... "నాన్నా... ఏమైంది. అత్తయ్య నువ్వూ ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు బాధపడుతోంది. నువ్వేం అన్నావు"
"నేనేమంటానురా. అదేదో పిల్లలి గురించీ చెప్తోంది, విన్నాను. అంతే"
"అత్తయ్య చెప్పలేదు, చాలా బాధగా ఉన్నట్లనిపించింది. స్వాతి గురించనా. తగ్గిపోతుంది నాన్నా. ఖంగారు పడక్కర్లేదు. చేయి ఎక్కువ స్ట్రైన్ చేయకపోతే తగ్గిపోతుంది "
"అది కాదులేరా... " అంటూ పద్మ గారు చెప్పిన విషయాలు చెప్పారు
హరీష్ ఆయన్ని ఇంటి దగ్గర దింపేసి, వచ్చి ప్రదీప్ తో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం స్వాతికి కాల్ చేసి,
"స్వీటీ..... లంచ్ అయ్యిందా"
"లేదు బావా చేయాలి. నీది?? "
"నేను తింటున్నాను. నాకో విషయం తెలిసిందీ పొద్దున. నీకు చెప్దామని కాల్ చేసాను"
"ఏంటి బావా"
"నీకు దెబ్బలు తగిలిన విషయం నువ్వు, మీ అన్నయ్య అత్తయ్య దగ్గర దాచారని చాలా ఫీల్ అయ్యారు. మొన్న నైట్ నీకు పెయిన్ వచ్చినా తనకి చెప్పలేదని బాధపడింది. రోజంతా హాస్పిటల్ లో ఉన్నా అత్తయ్య కి చెప్పలేదు"
"బావా మేమెందుకు అలా చేసామో నీకు తెలీదా"
"తెలుసురా. మీరు అత్తయ్య బాధపడ్తుందని నెమ్మదిగా చెప్పారు. కానీ అత్తయ్యకి మీరు తనని అవాయిడ్ చేస్తున్నారని బాధగా ఉంది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, కొంచం సేపు అత్తయ్య తో టైమ్ స్పెండ్ చేయి అని చెపుదామనే కాల్ చేసాను"
"సరే బావా"
"ఉండనా మరీ"
"సరే బావా బాయ్" అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంటే, పద్మ గారు వచ్చి, "స్వాతి, భోజనం చేస్తావా" అని అడిగారు
"సరే అమ్మా"
ఆవిడ ప్లేట్ తీసుకునీ వచ్చి ఇయ్యబోతుంటే, "అమ్మా చేయి నొప్పిగా ఉంది. నువ్వే పెట్టవా" అంటూ గారంగా అడిగిందీ
కూతురు అలా అడిగేసరికి, ఆవిడ ఎంతో సరదా పడిపోయారు. అమ్మ అంటే అంతే కదా మరీ.....
స్వాతికి చెప్పిన వారం రోజులు అయిపోయాయి. కాలేజ్ కి వెళ్ళాలంటే మళ్ళీ విక్రమ్ ఏం చేస్తాడో అనే భయం మొదలయ్యింది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
పొద్దున్న అందరూ ఫ్రెష్ అయ్యి, కాఫీ లు తాగుతుంటే, "స్వాతి.... ఏమయింది డల్ గా ఉన్నావు. చెయ్యి ఏమైనా నొప్పి ఉందా. ఎందుకలా ఉన్నావు" అంటూ పద్మగారు ప్రేమగా అడిగారు
ప్రదీప్ స్వాతి వైపు చూసాడు. స్వాతి కి మాత్రం మనసులో హమ్మయ్య తాడు దొరికింది అనుకుంటూ "అవునమ్మా చాలా నొప్పిగా ఉంది. అస్సలు చేయి పైకి లేపలేకపోతున్నాను. రేపు కాలేజ్ కి వెళ్లలేనమ్మా" అంటూ బాధగా అంది
ప్రదీప్ మాత్రం మనసులో, "చిన్నూ.... ఏం యాక్టింగ్ రా, ఆస్కార్ లెవెల్ లో ఉందిగా నీ పెర్ఫార్మన్స్. బ్రేక్ వేయకపోతే వీళ్ళిద్దరినీ బుట్టలో వేసేస్కుంటావు" అనుకుంటూ "ఏమి పర్వాలేదు, నేనే వచ్చి డ్రాప్ చేసి, మళ్ళీ తీస్కుని వస్తాను. నీ చేతికి ఈలోపు ఏమయిపోదు" అన్నాడు
స్వాతి వాళ్ళ నాన్నగారి వైపు చూసేసరికి, "అదేంట్రా అదలా బాధతో విలవిలాడిపోతుంటే పర్వాలేదు దింపుతాను అంటావు. దానికి నొప్పిగా ఉందేమో. ఒకసారి డాక్టర్ దగ్గరకి తీస్కుని వెళ్తే మంచిది"
"అవును నాన్నా. మీరు చెప్పేది నిజమే. ఈపాటికి ఎప్పుడో నొప్పి తగ్గిపోయుండాలి తగ్గటం లేదంటే, కుట్లు పడాలేమో. ఒకసారి తీస్కెళ్ళి వేయించేద్దాంలే"
స్వాతి "కుట్లా?? ఇదెక్కడ గోల. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదే. అన్నయ్యా ఎలా ఇరికించేసావో నన్ను" అని మనసులో అనుకుంటూ, "ఆ నొప్పి కైనా ఈ నొప్పే బెటర్ లే. నీకు కాలేజ్ కి వెళ్ళాలి అంతే కదా. వెళ్తాలే. ఇదిగోండి, నా చేయి పని చేయటం మానేసిందనుకో అది అన్నయ్య వలెనే" అంటూ మూతి ముడుచుకుని లోపలికెళ్ళిపోయింది
"ఎందుకురా దాన్నలా బాధపెడతావు. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే అదే సద్దుకుంటుంది కదా"
ప్రదీప్ "నాన్నా, దాన్ని కాలేజ్ కి వెళ్ళమని నాలుగు రోజులు క్రితమే డాక్టర్ చెప్పారు. నేనే రెస్ట్ తీసుకుంటుందని ఆగమన్నాను. కానీ ఇంకో ఇరవై రోజుల్లో ఎగ్జామ్స్. మళ్ళీ పోర్షన్ అర్థం కావద్దా. నేనున్నా కదా, చూసుకుంటానులే. ఖంగారు పడకండి. అది మీతో ఆడుకుంటోంది"
మధ్యాహ్నం స్వాతి, పద్మగారు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడూ, "అమ్మా నీకో విషయం చెప్తాను కానీ తిట్టకు. పూర్తిగా వినూ"
"ఏంటే?? నువ్వు తిట్టకూ అన్నావంటే ఏదో పిచ్చి పని చేసే ఉంటావు. ఏం చేసావో ముందు చెప్పు "
"ఆరోజున బయటకి వెళ్ళినప్పుడు, క్లాసుమేట్స్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. మీకు చెప్తే పంపించరని చెప్పలేదు"
"అబ్బాయిలతో వెళ్ళావా. అదీ ఇన్ని రోజులకి ఇప్పుడు చెప్తున్నావా. ఎవరైనా చుస్తే ఏమనుకుంటారు. అసలు ఎవరో ఎలాంటివాళ్ళో తెలీకుండా పంపించాడు కదా వాడిని అనాలి. అంత కేర్లెస్ గా ఉంటాడా. ఇద్దరూ అసలు మేమంటే లెక్కలేకుండా చేస్తున్నారు. మీ నాన్న అన్నిటికీ వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడు అంటారు. వాడు ఏదీ పట్టించుకోవటం లేదు అస్సలు నిన్ను" పిల్లలిద్దరిని కోప్పడ్డారు ఆవిడ.
"అమ్మా అన్నయ్య ని ఎందుకు తిడ్తావ్ మధ్యలో. అన్నయ్యకి ఏమి తెలీదు. ఆ రోజు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చెప్పాను. ఆల్రెడీ తప్పు చేశా అని ఫీల్ అవుతున్నా, ఇంకా తిట్టకమ్మా" అంది బాధగా
పద్మగారు ఏమి మాట్లాడలేదు. అప్పట్లో, "అన్నయ్యని మోసం చేసాను" అంటూ నిద్రలో ఏడవటం గుర్తొచ్చింది ఆవిడకి.
స్వాతి మళ్ళీ మాట్లాడుతూ, విక్రమ్ గురించీ చెప్పింది. "అమ్మా అన్నయ్య కి ఈ విషయం చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలీలేదమ్మా. అదీ కాకుండా, ఆ విక్రమ్ మంచోడు కాదు. అన్నయ్యకి చెప్పి ఏదైనా గొడవ పెట్టుకుంటే వాడేమన్నా చేస్తాడేమో అని భయమేసింది. ఇప్పుడు రేపు కాలేజ్ కి వెళ్ళాలంటే, వాడు ఉంటాడు. ఏమి చేస్తాడో అని భయంగా ఉంది. కాలేజ్ మానేస్తానమ్మా, ప్రైవేట్ గా ఎగ్జామ్స్ రాస్తాను. అన్నయ్య ని నాన్న ని నువ్వే ఒప్పించవా" అంటూ ఏడుస్తూ అడిగింది
కూతురు అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఆ తల్లి కరిగిపోయింది. "మొన్న ఎక్కడో అయ్యింది, వాడు కాలేజ్ లో ఉంటాడని కాలేజ్ మానేస్తావు, రేపు బస్సు ఎక్కితే ఇంకోడెవడో మీద చెయ్యేశాడని బస్సు ఎక్కవు.... ఇలాగే చేస్తే ఎప్పటికీ భయం భయంగానే ఉండిపోతావమ్మా. పట్టపగలే కదా జరిగింది. గట్టిగా అరిచి నలుగురిని పిలిస్తే అసలు ఆ సమస్య అప్పుడే తీరిపోయేది. రేపు కాలేజ్ కి వెళ్ళినా ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే లెక్చరర్స్ ప్రిన్సిపాల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళతో చెప్పూ. ప్రదీపు కి చెప్తే వాడూ అలెర్ట్ గా ఉంటాడు. ఈ విక్రమ్ లాంటి వాళ్ళు ఆడవాళ్ళ లైఫ్ లో ఎక్కడో అక్కడ తగులుతూనే ఉంటారు. అందుకని పారిపోకూడదు" అంటూ ధైర్యం చెప్పారు
"అన్నయ్యకి ఏమి చెప్పక్కర్లేదులే. వెళ్తాను కాలేజీ కి. చెప్పావు కదా" అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. కొద్ది సేపటికి పద్మగారు ఎంత పిలిచినా పలకకపోవటం తో రూమ్ లో కి వెళ్ళి చూసేసరికి స్వాతి పడుకునుంది. ఆవిడ ప్రదీప్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు
"అమ్మా ఇప్పటికి ఇంట్లో చెప్పిందా. నాకు ఈ సంగతీ ముందరే తెలుసు. ఆ విక్రమ్ తో దానికేమి ప్రాబ్లెమ్ ఉండదు. కాలేజ్ కి నేనే దాన్ని దింపి తీసుకొస్తాను కొన్ని రోజులు. నువ్వేమి ఖంగారుపడకులే"
"నీకెలా తెలుసురా. అది ఇప్పుడు కూడా నీకు చెప్పద్దంటోంది"
"సరే నువ్వూ చెప్పనట్లే ఉండు. నాకన్ని అలాగే తెలిసిపోతాయి. వాళ్ళ అయ్య గారు దాన్ని కొట్టిన ప్రతీసారి నోరు మూసుకునేది కదా, మనతోను చెప్పదు, అప్పటి నుంచి దాని వెనకాలే ఉండటం, చాటుగా వినటాలు అలవాటైపోయిందిలే. చెప్తే ఎవరికైనా నవ్వుతారు కూడాను. సరేలే. నేను చూస్కుంటా కానీ, దానితో ఈ టాపిక్ ఏమి మాట్లాడకు. ఉంటా" అని ఫోన్ పెట్టేసాడు
తర్వాత రోజున ప్రదీప్, స్వాతి ని కాలేజ్ లో దింపాడు. స్వాతిని చూడగానే రమ్య పరిగెత్తుకుని వచ్చి, "అబ్బా... ఎన్ని రోజులయ్యిందే చూసీ. ఎలా ఉంది ఇప్పుడు"
"బానే ఉందే. ఆ విక్రమ్ ని చూసావా"
"లేదే. వాడు కాలేజ్ కి రావటంలేదుగా. ఎవరో వాడిని బాగా కొట్టారు కాలేజీ బయట" హరీష్ తనని చెప్పద్దన విషయం గుర్తొచ్చి అతని పేరు చెప్పదు రమ్య.
"అంటే... అన్నయ్య వచ్చాడా. కానీ అన్నయ్య కి తెలీదు కదే. తెలుసంటావా" అంది స్వాతి అనుమానంగా
"ఒసేయ్ అనుమానపు పక్షి. ఆ విక్రమ్ ని కొట్టినప్పుడు నువ్వు హాస్పిటల్ లో ఉన్నావుట. మీ బావా ఫోన్ చేసి చెప్పాడు ఆ రోజు. మీ అన్నయ్య కూడా హాస్పిటల్ లోనే ఉన్నాడు కదా. వాడెంతమంది అమ్మాయిలని సతాయించాడు. ఎవరో కక్ష తీర్చుకున్నారనే అనుకుంటున్నారు"
"ఓహ్ అవునా. సరేలే. పద వెళదాం" అంటూ కాలేజ్ కి వెళ్ళారు
అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు హరీష్ ని కలుద్దామనుకుని, డౌట్స్ చెప్పించుకోవాలి అంటూ హరీష్ ఇంటికి వెళ్ళింది సర్ప్రైస్ చేయటానికి. తలుపు కొట్టగానే,
"ఓహ్ నువ్వా స్వాతి. ఎలా ఉన్నావు. రా లోపలికి" అంటూ వాళ్ళ అత్తయ్య తలుపు తీశారు
"బావున్నాను అత్తయ్యా. బావ ఉన్నాడా"
"పైన రూమ్ లో ఉన్నాడే. వెళ్ళు" అంటూ ఆవిడ లోపలికి వెళ్లిపోయారు
"బావా... ఏం చేస్తున్నావ్ " అంటూ తలుపు తీసుకుని లోపలికి వెళ్లేసరికి హరీష్ ఇంకో అమ్మాయితో తన మంచం మీద కూర్చుని ఉన్నాడు. హరీష్ కి సర్ప్రైస్ ఇద్దామనుకున్న స్వాతికి షాక్ తగిలింది
Comments
Post a Comment