22
"స్వీటీ.... నువ్వూ నీ కొత్త ఫోన్ చూస్కో నచ్చిందో లేదో చెప్పు. నేనిప్పుడే వస్తాను బావకి ఏదైనా కావాలేమో చూసీ" అంటూ బయటకి వెళ్ళాడు
ప్రదీప్ బిల్లింగ్ దగ్గర ఉండటం తో అక్కడికి వెళ్ళి, "బావా ఏమైందీ"
"ఇక్కడ పని అయిపొయింది. ఇంటికి వెళ్ళటమే. నువ్వూ వస్తున్నావు కదా"
"లేదు బావా. మీరు వెళ్ళండి. నేను రేపు వచ్చి కలుస్తానులే"
"సరే.... నువ్వూ చాలా అలిసిపోయావు కదా, రెస్ట్ తీస్కోలే. అలా బాదితే, కొట్టించుకున్నవాడికే కాదు కొట్టేవాడికీ చేతులు నొప్పెడతాయి" అంటూ నవ్వాడు
"అదేమీ లేదులే బావా. వాడిని చుస్తే అప్పటి వరకూ మాములుగా ఉన్నా కాని, ఇంక అప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాను" అని చెప్పి ఒక్క క్షణం ఆగి, అనుమానంగా "బావా.... ఈ విషయం నీకెలా తెలిసిందీ. కొంపదీసి నువ్వు వచ్చావా"
"హహహ.... కొంపలూ తీయలేదు, నేను రాలేదు. కానీ అక్కడ జరిగింది మొత్తం తెలుసు. ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాలేజ్ నువ్వే. ఎవరతను?? ఎందుకు కొట్టాడు?? ఎవరికోసం కొట్టాడు అని"
"అదే.... ఎలా తెలిసిందీ"
"నీ ప్లాన్ లు నీకుంటే నా సోర్సులు నాకూ ఉన్నాయి. ఇంకో విషయం చెప్పనా...... నీ యాక్షన్ వీడియో కూడా చూసాను"
"బావా అంటే స్వాతికి తెలుస్తుందా అయితే. తెలిస్తే ఇంక అసలు చెప్పదేమో ఎప్పుడూ "
"దానికి తెలిసే ఛాన్స్ లేదులే. అయినా... ఇంకా ఇంట్లో ఒప్పించలేదు, మేము ఒప్పుకోనూ లేదు, అప్పుడే ఫియాన్సే అని అంటున్నావేంటి, కాలేజ్ లో ప్రిన్సిపాల్ రూమ్ లో కుర్చున్నంత మాత్రాన అన్ని విషయాలు ఆ రూమ్ దాటి బయటకి రావనుకుంటున్నావా" అన్నాడు కొంచం కోపం నటిస్తూ
"బావా నువ్వే అన్నావా రూమ్ లో ఉన్నామని మేము ముగ్గురం కాకుండా ఇంకెలా తెలుస్తుంది. అయినా.... నువ్వోప్పేసుకున్నావ్ కదా.... అత్తయ్యా, మావయ్యా కూడా ఒప్పేసుకున్నట్లే" అన్నాడు నవ్వుతూ
"నేను ఒప్పుకున్నానని నీతో అనలేదే అసలూ. తెలుసు అన్నాను అంతే" అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. హరీష్ మనసులో "బా.... నీతో ఆడుకుంటా చూడూ, మా చెల్లి నాకు చెప్పేవరకూ నువ్వు బలి" అని నవ్వుకుంటూ
"ఇదేం ఫిట్టింగ్ రా బావా..... ఆడేసుకుంటున్నావ్ గా నాతో" అని నసుగుతూ ప్రదీప్ వెనకే వెళ్ళాడు.
స్వాతీ, ప్రదీప్ ఇద్దరూ బయల్దేరి వెళ్ళాక, తనూ వాళ్ళింటికి వెళ్ళిపోయాడు.
స్వాతీ వాళ్ళింటి దగ్గర....
బయట కార్ చప్పుడు అవటంతో, "పిల్లలు వచ్చేసినట్లున్నారు" అనుకుంటూ బయటకి వచ్చి చూసిన ఆవిడకి, స్వాతీ చేతికి కాళ్ళకి కట్టులతో దిగేసరికి
"ఏమైందే..... ఏంటీ దెబ్బలు. ఎలా తగిలాయి. ప్రదీపు ఏమయ్యిందిరా" అంటూ వాళ్ళ దగ్గరకి ఖంగారుగా వెళ్ళారు.
స్వాతి.... "అమ్మా.... ఏమి కాలేదు. ఖంగారు పడకూ. లోపలికి పదా"
లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇద్దరూ. వాళ్లకి మంచినీళ్ళు ఇచ్చీ, "ఇప్పుడైనా చెప్పవే ఏం జరిగిందో" అంటూ స్వాతిని బాధగా అడిగారు. స్వాతి, ప్రదీప్ వైపు చూసింది, తనని చెప్పమన్నట్లూ.
ప్రదీప్ "చిన్నూ నువ్వు కొంచం సేపు పడుకో. లోపలికి వెళ్ళు" అని ఆమెని పంపించి "అమ్మా నిన్న బండి స్కిడ్ అయ్యి పడింది. కాళ్ళు చేతులు గీసుకుపోయాయి. అంతే. పొద్దున్న కొంచం జ్వరంగా ఉంటే హాస్పిటల్ కి తీసుకునీ వెళ్ళాను"
"పొద్దున్న కాలికేదో గీసుకున్నాయి అవి కాకుండా చేతులకి తగిలాయా?? అదేమో నిన్న తగిలిన దెబ్బలు ఇంట్లో ఉన్న నాకు చెప్పనేలేదు. నువ్వూ, పొద్దున్న నుంచి హాస్పిటల్ లో ఉన్నా చెప్పలేదు.... బావుందిరా. ఇంక నేనెందుకు. దానికి నువ్వున్నావు కదా చూసుకోటానికి" అని లోపలికి వెళ్లిపోయారు
ప్రదీప్ కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చి "ఇదిగోండి, జ్యూస్ తీసుకోండి. తాగి నువ్వూ కొద్దిసేపు నడుము వాల్చు ప్రదీపు. ఈలోపు వంట అవుతుందీ" అంటూ లోపలికి వెళ్ళి వంటలో మునిగిపోయారు
కొంచంసేపయ్యాక, "ప్రదీపు, దానికి నొప్పెలా ఉంది ఇప్పుడూ. టాబ్లెట్ లు ఎప్పుడు వేసుకోవాలి. భోజనం రెడీ అయ్యింది. దానికి ఇచ్చేసి రా. నీకూ పెట్టేసి ఇస్తాను. ఇద్దరూ తినేసెయ్యండి"
తల్లి కోపంగా ఉందని గమనించి "తినేసాక వేస్కోవాలి అమ్మా టాబ్లెట్ లు. అది తినేసేయ్యని, మనిద్దరం తిందాములే" అంటూ స్వాతీ కి భోజనం ప్లేట్ తీసుకునీ వెళ్ళాడు.
ప్లేట్ ఇచ్చేసి స్వాతీ దగ్గరే కూర్చున్నాడు ప్రదీప్. వాళ్ళ అమ్మగారు ప్రదీప్ కి కూడా భోజనం పెట్టి అక్కడికి వెళ్ళి తనకి ప్లేట్ ఇచ్చి, స్వాతీకి మంచినీళ్ళు దగ్గర పెట్టారు.
పద్మ గారు.... "స్వాతి, చేయి నొప్పిగా ఉందా. నేను పెట్టనా"
"లేదమ్మా, నేను తినేస్తాలే. పర్వాలేదు. నొప్పి తగ్గింది"
ప్రదీప్... "అమ్మా మనం తర్వాత తిందాం అన్నాను కదా. నాకెందుకు ఇచ్చేసావు"
"లేదులే మీరిద్దరూ తినండి" అంటూ లోపలికి వెళ్లిపోయారు
"అన్నయ్యా... నిన్నొకటి అడగొచ్చా "
"ఏంటిరా"
"నేను కాలేజ్ కి వెళ్ళనూ"
"సరే.... ఈ వీక్ కి రెస్ట్ తీస్కో ఇంట్లో. మీ ప్రిన్సిపాల్ తో చెప్తాలే. కానీ కొంచం ఓపిక ఉన్నప్పుడు చదువు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేశాయి. హరీష్ ఏదో టైంటేబుల్ వేసి ఇచాడుట కదా. దాని ప్రకారం ఫినిష్ చేస్కో."
"సరే కానీ, ఈ వీక్ రెస్ట్ గురించీ కాదు మళ్ళీ వెళ్ళనింకా కాలేజ్ కి. ఇంటి నుంచి రాస్తాను" అనడిగింది స్వాతి
"ఒక చిన్న ఆక్సిడెంట్ అయితే, కాలేజ్ మానేస్తారా. అలా భయపడిపోకూడదు చిన్నూ. ఏమి కాదు. మండే నుంచి కాలేజ్ కి వెళ్ళిరా. నేనే వచ్చి దింపి తీసుకొస్తాను. నేను ఉంటాగా ఏ ఆక్సిడెంట్ లు అవ్వవు. ధైర్యంగా ఉండు. ఇప్పటికైతే తినేసి రెస్ట్ తీస్కో"
ఇంక ప్రదీప్ ఏమి చెప్పిన ఒప్పుకోడని, "సరేలే అన్నయ్యా " అంది
అన్నం తినేసి మందులు వేస్కుని పడుకుంది. ప్రదీప్ కూడా వెళ్ళి పడుకున్నాడు.
పొద్దున్న హరీష్ వాళ్ళ నాన్న, మహేశ్వర రావు గారు ఇంటికి వచ్చారు. పద్మ గారు వరండా లో కూర్చుని ఏదో ఆలోచిస్తుంటే, "ఏంటీ పొద్దునే కూర్చుని అంతలాగ ఆలోచిస్తున్నావు" అంటూ గేట్ తీసుకునీ లోపలికి వచ్చారు.
"ఏంలేదన్నయ్యా..... ఏంటి పొద్దునే వచ్చావు. అంతా బానే ఉందా" అన్నారావిడ ఆయన్ని పలకరిస్తూ
"వాకింగ్ కి అని బయటకి వచ్చాను, నిన్న రాత్రి హరీష్ చెప్పాడు, స్వాతి కి దెబ్బలు తగిలాయని. ఎలా ఉందొ చూసీ వెళదామని ఆ వాకింగ్ ఏదో ఇటొచ్చాను. బావగారు, పిల్లలూ ఇంకా లేవలేదా"
"ఈయన పనుందని ఊరెళ్ళారు. దానికి బాలేదని చెప్పాను, ఈరోజు రాత్రికి వచ్చేస్తారు"
వాళ్ళు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటుంటే, ప్రదీప్ బయటకి వచ్చి ఆయన్ని పలకరించి, స్వాతి దగ్గరకి వెళ్ళాడు. కానీ తనేదో కలవరిస్తుంటే దగ్గరకి వెళ్లేసరికి "అన్నయ్యా నిన్ను మోసం చేసి వెళ్లాను అంటూ నిద్రలో ఏడుస్తుండటం తో తన మంచం దగ్గర కింద కూర్చుని తల మీద రాస్తూ, తనని లేపాడు. స్వాతి కళ్ళు తెరిచినా, అదే ఆలోచనలో ఉండి ఏడ్చేస్తుంది.
"స్వాతి, నువ్వేమి మోసం చేయలేదురా. సరదాగా ఫ్రెండ్స్ తో వెల్దామనుకున్నావ్ అంతే కదా. పొద్దున చక్కగా నవ్వుతూ లేవాలి" అంటూ తనని లేపాడు
పద్మ గారు గుమ్మం దగ్గర నిల్చుని వాళ్ళని చూస్తూ, "ఇద్దరూ ఫ్రెష్ అయి వస్తే, మావయ్య కూడా ఉన్నారు. అందరికీ కాఫీ పెడతాను" అని లోపలికి వెళ్ళారు
పెరట్లో చెట్ల మధ్య లో కూర్చుని కాఫీ తాగుతూ "స్వాతి నొప్పి ఎలా ఉందమ్మా ఈరోజు. జ్వరం వచ్చిందా మళ్ళీ " అంటూ మహేశ్వర రావు గారు స్వాతిని అడిగారు
"నొప్పి ఉంది కానీ కొంచం తగ్గింది మావయ్య. జ్వరం ఏం రాలేదు. నీరసంగా ఉందంతే. మీరెలా ఉన్నారు. అత్తయ్య ఏం చేస్తోంది"
"అత్తయ్యా, నేనూ బానే ఉన్నామమ్మా. నేనొచ్చానంటే, తనని తీసుకుని రాలేదని గొడవ చేసేస్తుంది" అంటూ నవ్వారు
అలా కబుర్లు చెప్పి, బయల్దేరబోతుంటే టిఫిన్ చేసి వెళ్ళమని పద్మ గారు గొడవ చేస్తే ఉండిపోయారు.
స్వాతి లోపల బుక్స్ చూసుకుంటుంటే, ప్రదీప్ ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు. పద్మ గారు, మహేశ్వర రావు గారు ఇద్దరూ బయట కూర్చుని ఏదో మాట్లాడుకుంటుండగా హరీష్ లోపలికి వచ్చాడు.
"ఏంటి నాన్నా మీరిక్కడ ఉన్నారా. అమ్మ మీరింకా వాకింగ్ నుంచి రాలేదని ఖంగారు పడుతోంది " అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు
"బయల్దేరుతున్నా లేరా. నువ్వెంటి ఇక్కడా"
"ఆఫీస్ కి వెళ్తూ, బావ వస్తాడేమో అని ఇటొచ్చా. ఎలా ఉంది అత్తయ్యా స్వాతికి" అంటూ కూర్చున్నాడు
పద్మ గారు మహేశ్వర రావు గారిని చూసీ, "పర్వాలేదు కొంచం నొప్పి తగ్గిందిట. లోపల ఉంది, పదా కొంచం టిఫిన్ తిందువు" అంటూ లేచారు
"అత్తయ్యా నువ్వు కూర్చో. నేను తినేసి వచ్చాను. ఇప్పుడేమి ఒద్దు. మీ అన్న చెల్లెలు సీక్రెట్స్ మాట్లాడుకోండి. నేనిప్పుడే వస్తా" అంటూ లోపలికి వెళ్ళాడు
"ఏంటిరా ఈరోజు ఎండ మాడిపోతుందేమో" అన్నాడు స్వాతి రూమ్ దగ్గర నుంచుని
"హాయ్ బావా" హరీష్ ని చూడగానే స్వాతి మొహం వెలిగిపోయింది
"హహహ..... ఏంటిరా అంత సంతోషం. మొహం చూడు అసలూ" అంటూ మెల్లగా అని, ముద్దు పెట్టుకున్నాడు దూరం నుంచే గాల్లో.
నిన్ను ఎప్పుడు చూస్తానో అనుకుంటూ ఉన్నా.... వచేసావు"
"ఏంటి అంత బుద్ధిగా చదివేస్కుంటున్నావ్. నొప్పేలా ఉంది ఇప్పుడూ"
"నొప్పి తగ్గింది బావా. నువ్విచ్చిన టైంటేబుల్ టూ డేస్ మిస్ అయ్యాను కదా. ఫినిష్ చేసుకుందామని స్టార్ట్ చేశా. నువ్వెంటి, అన్నయ్య కోసమా"
"కాదురా నిన్ను చూద్దామని వచ్చాను" అని కళ్ళతోనే స్వాతికి సైగ చేసి, "అవును ఆఫీస్ కి వస్తే ఇద్దరమూ వెళదామని" అన్నాడు
స్వాతి కి కనిపించకుండా, పక్కనుంచి ప్రదీప్ "అంతొద్దులే బా... " అని హరీష్ చెవిలో అనేసి, "ఒక్క పది నిముషాలు ఆగుతావా. వస్తాను" అన్నాడు బయటకి వస్తూ
"అయితే ఒక పని చేస్తాను. నాన్న ని ఇంటి దగ్గర దింపేసి వస్తాను. మళ్ళీ ఆయన నడవాలి కదా" అని చెప్పి బయటకి వచ్చాడు
మహేశ్వర రావు పద్మ గారిని ఓదారిస్తుండటం తో హరీష్ లోపలికి వెళ్ళి ఒక్క క్షణం ఆగి "నాన్నా వెళ్దామా" అంటూ వెళ్ళి ఇంటికి తీస్కెళ్ళాడు
దారిలో... "నాన్నా... ఏమైంది. అత్తయ్య నువ్వూ ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు బాధపడుతోంది. నువ్వేం అన్నావు"
Comments
Post a Comment