21

 



"అది చెప్పింది కదా బా.... అన్ని తెలుసని నాకూ" అంటూ హరీష్ కళ్ళలోకి చూసాడు ప్రదీప్ 


"బావా....  ఎవరికీ చెప్పకూడదు అని మేము అనుకోలేదెప్పుడూ,  జాబ్ వచ్చేవరకూ అనే ఆగాను.  కానీ....  అసలూ ఎలా తెలుసూ" 


"ఎవరికి  'ఎలా తెలుసు'?? ....  నాకా లేదా నాకు తెలుసనీ చిన్నూకి ఎలా తెలిసిందనా. తన విషయమైతే నాకు తెలీదు" 


హరీష్ కి ఇప్పటికీ ప్రదీప్ రియాక్షన్ అర్థం కావటం లేదు.  అది కోపమా లేక మామూలుగానే ఉన్నాడా అని ఆలోచిస్తూనే,  "నీకెలా తెలిసింది" 


"బా....  చిన్నూ నా దగ్గర ఏ విషయం ఎక్కువ రోజులు దాచలేదు.  అది ఎవరినో ప్రేమిస్తోందని నీకన్నా ముందర నాతో చెప్పింది. కానీ నువ్వని అప్పట్లో తెలీదు. మీ ఇంటికి ఫస్ట్  టైమ్ డౌట్స్ చెప్పించుకోటానికి వచ్చిన తరువాత, ఏడుస్తూ చూసాను. ఆరోజునుండి దానిలో మార్పుని గమనిస్తూనే ఉన్నా. అదీ సరే, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా అనుకునేసరికి నువ్వు తనని కాలేజ్ లో పిక్ చేసుకున్నావు. ఆ రోజు అదే ఆలోచిస్తూ కాఫీ షాప్ కి వస్తుండగా, దారిలో షాప్ లో ఫోన్ రీఛార్జ్ చేయించుకుని వస్తుంటే, స్వాతి నీ భుజం మీద పడుకుని ఉండటం, నువ్వప్పుడే తన తల మీద ముద్దు పెట్టుకోటం చూసాను.  కన్ఫర్మ్  అయిపొయింది. ఆ రోజు నిన్ను ఆడేసుకున్నాను,  నువ్వేమో టెన్షన్ పడిపోయావు... హరీష్ కృష్ణా. ఆ కలలో హరివిల్లులా వచ్చిన కృష్ణుడివి నువ్వే కదా. పాపం నీ బాడ్ లక్, జాబ్ కూడా మా కంపెనీ లోనే వచ్చింది. అప్పుడైనా చెప్తుందేమో అని చూసాను. అమ్మాయిగారు ఇప్పట్లో చెప్పేలాలేదు" అన్నాడు నవ్వేస్తూ 


ప్రదీప్ మొహంలో నవ్వు చూసీ స్థిమితపడ్డాడు హరీష్. "అయితే బావా నీకు కోపంగా లేదా మా మీద" 


"అది చెప్పనీయి, చూద్దాం. అప్పుడు చెప్తా నాకు కోపమొచ్చిందో లేదో. అప్పటి వరకూ సస్పెన్స్. ప్రేమ ఎక్కువైపోయి నేను చెప్పినవి దాని దగ్గర అనకూ.  నాకు తెలీనట్లే ఉండు. దాని సరదా మనమెందుకు పాడుచేయటం " అన్నాడు నవ్వుతూ. "కానీ ఒక్కటి బా... ఆరోజున ఎందుకు అంత ఏడ్చిందో నాకు తెలీదు. కానీ ఇంకోసారెప్పుడూ దాన్ని బాధపెట్టకు. నీవలనే బాధపడిందని తెలిస్తే, నేను చూసి చూడనట్లు వదిలేయను".


హరీష్ ఏదో ఆలోచిస్తూ,  "లేదు బావా. ఆరోజున తన మనసులో మాట చెప్పేసి నా మాట వినకుండా అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఇంకోసారెప్పుడూ అలా జరగదు బావ.... బావా... నువ్వసలు ఎప్పటినుంచి ఇక్కడున్నావు" అని అడిగేశాడు కానీ మళ్ళీ ఏదైనా అనుకుంటాడేమో అని తడబడుతూ,  "అదే మెడిసిన్స్ తెచ్చేసావా. డాక్టర్ ఎప్పుడు వెళ్ళచ్చన్నారు" 


"జ్వరం కంట్రోల్ అయ్యింది. ఈవెనింగ్ మళ్ళీ టెంపరేచర్ రాకపోతే తీసుకుని వెళ్ళచ్చన్నారు. దెబ్బలు మెల్లిగా తగ్గుతాయన్నారు. ఇంక నీ అసలు క్వశ్చన్ ఎప్పటి నుంచి ఉన్నాను అంటే...  ఈ దెబ్బలు ఎందుకు తగిలాయి అసలు కారణం చెప్పినప్పటి నుంచే ఉన్నాను. నువ్వు అడుగుదామనుకున్నది అదే కదా. విన్నాను బా... " 


"బావా,  తను చెప్పలేకపోవటానికి..... " అంటూ ఏదో చెప్పబోతున్న హరీష్ ని అడ్డగిస్తూ 


"అర్థం చేసుకోగలను. నాకేమయిపోతుందో అని దాని భయం. కానీ నీకో డౌట్ వచ్చిందా బా...  నేను ఆ మనిషి మీద చెయ్యి లేపితే దీనికెలా తెలిసింది. నేను కూడా ఎవరితోనూ అనలేదు, ఆరోజు ఆ టైమ్ లో ఎవరూ లేరు అయినా ఎలా తెలిసింది. అంటే బాబాయి ఏదో మళ్ళీ గొడవ చేసాడు దీనితో. అక్కడ ఆగిపోయిందీ, నా మైండ్. సరేలే, నువ్వేం ఆలోచించకు. వీడి సంగతీ నేను చూస్కుంటాలే. అది నేను చదివిన కాలేజే కదా, చూస్తా ప్రిన్సిపాల్ తో మాట్లాడి వాడి సంగతీ. ఊరికే వదలను" అన్నాడు చాలా కోపంగా 


"బావా.... నేను కాలేజ్ కి వెళ్ళి ఒకసారి కనుకుని వద్దామనుకుంటున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే" 


ప్రదీప్, హరీష్ వైపు చూసీ "సరే.....  నీ ఇష్టం. కార్ తీసుకెళ్ళు" 


స్వాతి దగ్గరకి వెళ్ళిచూసాడు,  పడుకుని ఉంది. తన నుదిటి మీద ముద్దు పెట్టుకునీ "త్వరగానే వచేస్తానురా" అని చెప్పి ప్రదీప్ తో "కార్ ఒద్దు బావా. ఏదైనా కావాలంటే ఉంటుంది ఇక్కడే ఉండనీ. నేను క్యాబ్ లో వెళ్ళి నా బైక్ పిక్ చేస్కుని వెళ్తాను. ఒక చిన్న హెల్ప్ బావా....  తను లేస్తే,  ఆఫీస్ కి వెళ్లానని చెప్పు, వెళ్ళొస్తా" అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు


బైక్ తీసుకునీ, స్వాతి ఫోన్ లో సిం కార్డు తన దాంట్లో వేస్కుని రమ్య కి కాల్ చేసి,  తనకి జరిగిన విషయం చెప్పాడు 


"అయ్యయ్యో ఇంత జరిగిందా. వాడు అస్సలు మంచివాడు కాదన్న.  కాలేజ్ లో చాలా మంది ప్రాబ్లెమ్ ఫేస్ చేశారు. వెళ్ళద్దే  అని మొత్తుకుంటే,  వాళ్లందరితో టైమ్ స్పెండ్ చేస్తే దీనితో కలుస్తారని ఆశ. చివరికి నా మాట వినటం లేదని నీ భయం చెప్పాను. అయినా వెళ్ళింది" 


"నా గురించీ అన్నావని మాత్రమే చెప్పింది రమ్యా. ఇదీ విషయం అని తెలిస్తే అసలు వెళ్ళనిచ్చేవాడిని కాదు. వాడిప్పుడు కాలేజ్ లో ఉన్నాడా"


"ఈరోజు రావటం అయితే చూసాను. కాలేజ్ అవటానికి ఇంకో రెండు గంటలు పట్టచ్చు. అప్పుడు బయటకి వస్తాడు" 


"సరే ఆ టైమ్ కి నాకు దూరం నుంచి చూపించండి చాలు. నేనప్పుడు మిమ్మల్ని కలవను. ఇంకో విషయం,  మీ బ్యాచ్ లో ఎవరో అబ్బాయి ఉన్నాడుట కదా, ఇదే కాలేజా" 


"అవునన్నా. అన్నా.....  తను మంచి వాడే. ఒక్కసారెప్పుడో తెలీక పొరపాటయ్యింది. అప్పుడే స్వాతికి సారీ చెప్పాడు. మళ్ళీ ఎప్పుడూ అసలు తప్పుగా బిహేవ్ చేయలేదు" 


"ఎవరతను..... ఏం చేసాడు" 


"అంటే నీకు తెలీదా " అనవసరంగా నేనే వాగేశానా అని తిట్టుకుని,  "ఏంలేదులే అన్నా. అతని పేరు మనోజ్. నా క్లాస్సే" 


"ఏం చేసాడు అతను స్వాతిని.... చెప్పు" కొంచం కోపంగా అడిగాడు


"ఒకసారి ప్రపోజ్ చేసాడు. కానీ దానికి నువ్వంటే ఇష్టం అని చెప్పింది, నీకా విషయం అప్పటికి ఇంకా చెప్పలేదు" 


"ఓహ్.... ఆ తర్వాత  మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెట్టాడా" అన్నాడు ప్రశాంతంగా ఊపిరి తీసుకుని.


"లేదన్నా....  చాలా మంచి వాడు"


"సరే నేనొక్కసారి తనని కూడా కలవాలి. మీ కాలేజ్ కి వస్తున్నాను. మీ ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడతాను. ఏదైనా ఉంటే కాల్ చేస్తాను. థాంక్స్ అ లాట్ ఫర్ యువర్ హెల్ప్" అని ఫోన్ పెట్టేసాడు 


కాలేజ్ కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో కొంచం సేపు మాట్లాడి, ఆయన ఆఫీస్ కి మనోజ్ ని పిలిపించారు


హరీష్....  "హాయ్ మనోజ్. నా పేరు హరీష్, నేను మీ ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఫియాన్సేని. నాకు మీ హెల్ప్ కావాలి కొంచం" 


"సార్...  గ్లాడ్ టు మీట్ యూ. ఏం హెల్ప్ కావాలి. స్వాతి రాలేదా" 


"లేదు మనోజ్.  తనకి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది. ఒక వన్ వీక్ రెస్ట్ కావాలన్నారు. తనని కాలేజ్ లో ఎవరో ఏడిపిస్తున్నారు, విక్రమ్ అని. మీరు తనతో ఏమి చెప్పక్కర్లేదు కానీ. జస్ట్ వాచ్ హర్ బ్యాక్. నేను, వాళ్ళ బ్రదర్ ఉంటాము. బట్ కాలేజ్ లో ఏమాత్రం ప్రాబ్లెమ్ ఉన్నా నాకు చెప్తే నేను చూసుకుంటాను, మీ పేరు బయటకి రాదు. ప్రిన్సిపాల్ గారితో ఆల్రెడీ మాట్లాడాను. ఐ నీడ్ థిస్ బిగ్ ఫేవర్. స్వాతి చాలా భయపడిపోయింది" 


ప్రిన్సిపాల్....  "ఎస్ మనోజ్,  మీ ఫ్రెండ్స్ కి కాలేజ్ లో ఏదైనా ప్రాబ్లెమ్ అనిపిస్తే లెట్ మి నో ఫస్ట్. ఐ విల్ టేక్ యాక్షన్" 


మనోజ్ ప్రిన్సిపాల్ తో "ఎస్ సార్", హరీష్ వైపు చూస్తూ "సార్ తను మా ఫ్రెండ్. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. మేము తనని గమనిస్తుంటాము. నా రూమ్మేట్ వాళ్ళ క్లాస్సే. క్లాస్ లో ప్రాబ్లెమ్ ఉన్నా కూడా తెలుస్తుంది అది చెప్పకపోయినా" 


"వన్ మోర్ థింగ్,  స్వాతికి మీరు నన్ను కలిసినట్లు కానీ, మాట్లాడినట్లు కానీ, మీరు తన చుట్టూ గమనిస్తున్నట్లు కానీ, ఏవీ తనకి తెలియనీయకండి. ఏం ఉన్నా నాకు కాల్స్ చేయచ్చు" అంటూ తన నెంబర్ ఇచ్చి బయటకి వెళ్ళిపోయాడు 


రమ్యా కాలేజ్ అయిపోయాక,  గేట్ బయట హరీష్ దగ్గర ఉన్న స్వాతి నెంబర్ కి కాల్ చేసి,  విక్రమ్ ని దూరం నుంచే చూపించింది. 


అప్పటి వరకూ ఎంతో హుందాగా ఉన్న హరీష్ కి, విక్రమ్ ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. విక్రమ్ దగ్గరకి వెళ్ళి ఏమి మాట్లాడకుండా కడుపులో పిడి గుద్దులు గుద్దేసి,  తన కాలర్ పట్టుకుని  చెంపలు వాయించేసాడు. సడన్ గా హరీష్ అలా ఎటాక్ చేసేసరికి,  విక్రమ్ తో ఉన్న అతని ఫ్రెండ్స్,  ముందర షాక్ అయ్యి తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడుకునే  ప్రయత్నం చేశారు. హరీష్ ని ఎవరూ ఆపలేకపోయేసరికి విక్రమ్ నొప్పి తో బాధపడుతూ "అసలెవర్రా నువ్వూ.....  నన్నెందుకు కొడ్తున్నావ్, చెప్పైనా కొట్టరా.....  క్లారిటీ అయినా ఉంటుంది" 


"ఆడపిల్లలు కనిపిస్తే వదలవా, అమ్మాయిలని ఇబ్బంది పెడతావా,  అసలు వాళ్ళ మనసేంటో తెలుసుకోకుండా మీద చేయి ఎలా వేస్తావు" అంటూ విక్రమ్ చేయి వెనక్కి తిప్పాడు హరీష్


నొప్పి వలనేమో దెబ్బ కి దెయ్యం కొంచం దిగింది...  "ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టాను బాస్..... వదలండి..... అమ్మా  " అంటూ రా అన్నవాడు బాస్ లో కి వచ్చాడు 


"ఏరా నీకు నచ్చకుండా చేయి పట్టుకుంటే తట్టుకోలేకపోతున్నావ్ మరి అమ్మాయిల మీద నువ్వు చేతులు వేయచ్చా. ఇంకోసారి ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టావని తెలిసిందో చేతులు విరిచేస్తాను జాగ్రత్త" అంటూ వార్నింగ్ ఇచ్చి,  బైక్ తీసుకునీ వెళ్ళిపోయాడు. వచ్చినదేవరో, ఎందుకు విక్రమ్ ని కొట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. 


అక్కడ నుంచి స్వాతి దగ్గరకి వెళ్లేసరికి ప్రదీప్,  స్వాతీ మాట్లాడుకుంటున్నారు. హరీష్ ని చూడగానే స్వాతి... 


"బావా ఎక్కడికెళ్ళి వస్తున్నావ్ అసలూ" అంటూ ఖంగారుగా అడిగిందీ 


తానెందుకు అలా అడిగిందో అర్థంకాక,  ప్రదీప్ వైపు చూసాడు హరీష్.  ప్రదీప్ "అవును బా...  ఆఫీస్ కి వెళ్తా అన్నావ్ ఏంటి అంత టైర్డ్  గా ఉన్నావ్" అన్నాడు స్వాతి అలా  అడగటానికి కారణం చెప్తూ  


"అదా....  వెళ్ళేటప్పుడు క్యాబ్ దొరకలేదు బావా. వచేటప్పుడేమో బైక్ కోసం  మెకానిక్ దగ్గరకి వెళ్తే వాడు కుర్చోపెట్టేసాడు. ఇంకెలా ఉంటుంది అవతారం... స్వాతీ ఇదిగో ఆ ఫోన్ పనిచేయదన్నాడు. కొత్తది తీసుకున్నాను. నీ సిం వేసేసాను. ఇప్పుడైనా ఫోన్ ని ఆర్నమెంట్ లాగా కాకుండా అవసరం లో ఉన్నప్పుడు,  వాడటం నేర్చుకో " కొంచం మందలించాడు.


స్వాతి కొత్త ఫోన్ హరీష్ దగ్గర తీసుకోవటానికి ప్రదీప్ వైపు చూసింది ఏమంటాడో అని. మళ్ళీ హరీషే "ఫోన్ తీసుకోటానికి మీ అన్నయ్య పర్మిషన్ అక్కర్లేదు,  నేను అడిగే తీసుకున్నాను" అన్నాడు చిన్నగా నవ్వి 


"బావా డాక్టర్ ఏమన్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారుట. అత్తయ్య కి చెప్పావా" 


"చెప్పలేదు బా....  ఎలాగో ఇంటికి వెళ్తాం కదా ఇప్పుడే చెప్తే,  ఇంట్లో నాన్న కూడా లేరు కంగారు పడ్తుంది ఒకత్తి. ఇప్పుడు తీసుకునీ వెళ్ళచ్చన్నారు. నీకోసమే ఆగాను. నువ్వు ఇక్కడుంటావా. నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అవీ కంప్లీట్ చేసొస్తా" అంటూ బయటకి వెళ్ళాడు. 


హరీష్,  స్వాతి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని స్వాతిని చూస్తూ ఉన్నాడు. 


"బావా.....  ఇటు రా" అంటూ స్వాతి చేతులు చాపి పిలిచింది. తను పిలవటమే ఆలస్యం అన్నట్లు లేచి వెళ్ళి స్వాతిని గట్టిగా హత్తుకున్నాడు.  


"ఇప్పుడు చెప్పూ" అంది స్వాతీ అలాగే పట్టుకుని 


"ఏంటీ"  


"మా బుజ్జబ్బాయి ఎందుకిలా ఉన్నాడు. టైర్డ్ గా కాదు డల్ గా ఎందుకున్నావ్" అనడిగింది హరీష్ తల నిమురుతూ 


"నిన్ను వదిలి వెళ్లాలని లేదురా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడో కలుస్తాము.  బెంగొచ్చేస్తోంది" 


"పోనీ ఇక్కడే హాస్పిటల్ లో ఉండిపోనా" 


హరీష్ తన చేతులో నుంచి జరిగి స్వాతి ని కోపంగా చూసీ "చుప్....  ఏం మాటలవి. ఇంకోసారి ఏదైనా విషయం ఇంట్లో మాకు చెప్పలేదనుకో ఈసారి మంచిగా చెప్పను" 


"అలాగే సార్" అంటూ నవ్వుతూ ఉంటే హరీష్ మళ్ళీ స్వాతిని హత్తుకుని,  


"స్వీటీ....  దూరంగా ఉండలేనురా. పెళ్ళి చేసేసుకుందామూ" 


"చేస్కుందామురా....  ఇంకొంచం సేపు ఇలాగే ఉంటే అన్నయ్య వచ్చి చూసాడనుకో ఇంక పెళ్ళే" 


"ఈ ఐడియా బావుంది. నిన్ను చెప్పమంటే చెప్పటం లేదు నేనిలాగే ఉంటాను,  మీ అన్న చూసీ పెళ్ళి చేసేస్తాడు. ఇంక అప్పుడు ఇలాగే ఉండిపోవచ్చు" అన్నాడు నవ్వుతూ 


"బావా...  ఇలా పెడితే చేయి స్ట్రెచ్ అయ్యి నొప్పెడుతోంది" అంది తన చెవి లో 


"అయ్యో సారీ రా" అంటూ తన దగ్గర నుంచి లేచీ,  తన అరచేతిలో ముద్దు పెట్టి,  ఇంటికి వెళ్ళాక సరిగ్గా మందులు వేసుకో. మా అత్తయ్యని, మీ అన్న ని సతాయించకు. జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం చుస్కో. ఏం కొంచం ఇబ్బందనిపించినా ఇంట్లో చెప్పు. అర్ధరాత్రైనా సరే బాగోలేకపోతే ఫోన్ చేయి" 


"బావా వెళ్ళిపోతున్నావా" 


"వెళ్ళాలి కదరా. అందరి ముందర ఇవన్నీ చెప్పలేను. అందుకే ఇప్పుడే చెప్తున్నా" అంటూ కూర్చున్నాడు


"స్వీటీ....  నువ్వూ నీ కొత్త ఫోన్ చూస్కో నచ్చిందో లేదో చెప్పు. నేనిప్పుడే వస్తాను బావకి ఏదైనా కావాలేమో చూసీ" అంటూ బయటకి వెళ్ళాడు



Comments