19
"నువ్వంత దగ్గరగా ఉండాలనుకుంటున్నావ్ కాబట్టే నీ కౌగిట్లో ఒదిగిపోయాను బావా" అంది సిగ్గుగా తల దాచేసుకుంటూ.
కొద్దిసేపటికి ప్రదీప్ రావటం తో తనతో, ఆఫీస్ లో జాయినింగ్ విషయాలు అవీ మాట్లాడి వెళ్ళిపోయాడు.
రోజులు చక చకా తిరుగుతున్నాయి. హరీష్ జాబ్ లో జాయిన్ అయ్యాక ముందర లాగా స్వాతిని కలవలేకపోతున్నాడు. కానీ ప్రతీరోజు ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళు. ఒక రోజు....
స్వాతి.... "హలో "
"స్వీటీ కాలేజ్ లో ఉన్నావా"
"బావా.... ఇప్పుడే అయిపొయింది. బయటకి వస్తున్నా. చాలా రోజులయింది నువ్వు ఈ టైమ్ లో కాల్ చేసి. కొంచం ఫ్రీ టైమ్ దొరికిందా."
"ఈరోజు వర్క్ ఫినిష్ అయిపోతే, త్వరగా బయల్దేరిపోయాను. నిన్ను పిక్ చేసుకోవచ్చా, లేక నీకేదన్నా ప్లాన్స్ ఉన్నాయా"
"నాకేం ప్లాన్స్ ఉంటాయి. నువ్వొస్తే నీతో వచ్చేస్తాను. రమ్మీ వాళ్లకి చెప్పేస్తానులే. నువ్వు రా"
"సరే. ఒక్క 10మినిట్స్ లో ఉంటాను. ఆల్రెడీ దగ్గరకొచ్చేసాను" అని ఫోన్ పెట్టేసాడు
తను చెప్పినట్లు పది నిమిషాల్లో అక్కడకి చేరుకున్నాడు. రమ్య స్వాతితో కోపంగా మాట్లాడటం చూసీ ఆశ్చర్యపోతూనే, స్వాతి దగ్గరకి వెళ్ళాడు. హరీష్ ని చూసీ, రమ్య ఏదో మాట్లాడ్తున్నదల్లా ఆపేసింది.
"హాయ్ స్వాతి" అంటూ, "హలో సిస్టర్, ఎలా ఉన్నారు" అంటూ రమ్యని పలకరించాడు
"బావున్నా అన్నా. బస్ వస్తోంది. వెళ్తాను" అంటూ అక్కడ నుంచి స్వాతిని సీరియస్ గా చూసి వెళ్ళబొయింది
"నేను డ్రాప్ చేస్తాను కదా సిస్టర్, అటు వైపేగా వెళ్ళేది. రండి"
"లేదన్నా, అయినా అసలే జాబ్ లో జాయిన్ అయ్యాకా మేడంతో టైమ్ స్పెండ్ చేయటం లేదు. ఉన్న టైమ్లో నేనెందుకు మధ్యలో. మీరు ఎంజాయ్" నవ్వేసి హరీష్ కి మాత్రం బాయ్ చెప్పి వెళ్ళిపోయింది
హరీష్, స్వాతి కార్ లో కూర్చున్నారు.
"అవును బావా... నిన్న ఏదో కోడ్ లో ఎర్రర్ వచ్చిందన్నావు సాల్వ్ అయ్యిందా"
"అయ్యిందిరా. అది కాదు కానీ, నేను ఇలా కాలేజ్ కి రావటం వలన నీకేదన్న ప్రాబ్లెమా"
"అదేంటి బావా అలా అడిగావు" అయోమయంగా అడిగింది స్వాతి
"నేను రావటం రమ్య కి ఇష్టం లేదేమో అని డౌట్ వచ్చింది. ఎందుకో తను నీ మీద కోపంగా ఉన్నట్లుంది కదా"
"అదా...... అది నీ గురించీ కాదులే"
"మరీ.... "
"బావా...... నేనే చెప్దామనుకున్నా..... కానీ ఇంతలో నువ్వే అడిగావు. నాకు నీ పర్మిషన్ కావాలి"
"నా పర్మిషనా...... దేనికీ"
"రేపు మా క్లాస్మేట్స్ అందరూ లాంగ్ డ్రైవ్ వెళదామని ప్లాన్ చేస్తున్నారు. నేనూ వెళ్ళనా"
"వెళ్ళాలనుంటే వెళ్ళరా. ఎందుకూ అంత స్పెషల్ గా అడుగుతున్నావు"
"అదీ..... బావా.... అబ్బాయిలు కూడా ఉంటారు, బైక్స్ మీద వెల్దామనీ ప్లాన్ "అంటూ అసలు సంగతీ చెప్పింది
"అబ్బాయిలతో బైక్ మీద వెళ్ళినంత మాత్రాన నువ్వేదో తప్పు చేసినట్లు అనేసుకుంటానా స్వీటీ. నా బంగారం గురించి నాకు తెలీదా. నీకూ వెళ్ళాలనుంటే, ప్రదీప్ బావకి ఓకే అయితే వెళ్ళు.
"సరే "
"ఇందుకేనా రమ్య కోపంగా ఉందీ"
"అవును. నీకు నచ్చదేమో, అనవసరంగా ప్రోబ్లెంస్ తెచ్చుకోకు అంటుంది. దానికేమో రీసన్ చెప్పినా అర్థం చేసుకోదూ. దాని గోల దానిదే" అంది ఒకింత బాధగా
"ఏంటా రీసన్"
"బావా.. కాలేజ్ లో జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయినా నాకంటూ క్లాస్ లో ఎవరూ ఫ్రెండ్స్ లేరు. ఎందుకో వాళ్ళతో నేను కలవలేకపోతున్నాను. కాలేజ్ అయ్యాక కూడా రమ్య కోసం వెయిట్ చేసేది అందుకే. అదీ లేకపోతే అస్సలు ఇంటరెస్టే ఉండదు రావటానికి. ఫస్ట్ ఇయర్ నుంచే ఎప్పుడైపోతుందిరా బాబూ ఈ కోర్స్ అని వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఇలా రమ్మనప్పుడు వెళ్ళినా కొంచం వాళ్ళ గ్రూపులో కలుపుకుంటారేమో అని"
హరీష్, స్వాతిని గమనిస్తున్నాడు. చిన్నప్పటి ఒంటరితనపు ఛాయలు తనలో ఇంకా అలాగే ఉండిపోయినట్లుగా అనిపించింది. ఒక చేయి స్టీరింగ్ మీద ఉంచి ఇంకో చేత్తో తనని దగ్గరకి తీసుకున్నాడు.
"సరేలే, బావని అడుగు. రేపు వెళ్ళేటట్లు అయితే మాత్రం నాకు లొకేషన్ షేర్ చేస్తూ ఉండు. సరేనా" అన్నాడు ప్రేమగా
హరీష్ ఒప్పుకుంటాడని తనకీ నమ్మకం ఉండింది. కానీ, రమ్య ఎందుకు కోప్పడిందో పూర్తిగా చెప్పనేలేదు హరీష్ తో.
"ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి కదరా. రివిషన్ స్టార్ట్ చేసావా. ఎక్కడి వరకు వచ్చింది"
"ఆమ్మో మొదలెట్టేసాడు. నేను పడుకున్నా" అంటూ మనసులో అనుకుని కళ్ళు గట్టిగా మూసేసుకుంది
"ఓయి దొంగా..... వేషాలు వేయకు. నువ్వు సరిగ్గా చదువకపోతే బయట తిరగటానికి వీల్లేదు. ముందు స్టడీస్.... అయినా, మంచి మార్క్స్ రావాలి కదా, ఇద్దరి టార్గెట్స్ రీచ్ అవ్వాలిగా.... పడుకున్నావా.... సరే రేపు నిన్ను పంపిచద్దని మీ అన్నకి చెప్తాలే. నువ్వు పడుకున్నావ్ కదా, ఇప్పుడే చెప్పేస్తే నీకు తెలీదు ఎలాగో" అంటూ నవ్వుతూ ఫోన్ తీయబోయాడు
స్వాతి వెంటనే కళ్ళు తెరిచి, తన చేతిలో ఫోన్ లాగేసుకుని "నేనేం పడుకోలేదు. చదువుతున్నాలే బానే"
"సరే ఇంటికి వెళ్ళాక ఈరోజు నీ పని.... నీ సబ్జక్ట్స్ ఏమేం ఉన్నాయో రాసి, వాటిని ఎలా చదివి రివిషన్ చేస్తున్నావో, ఏమేం టాపిక్స్ అయ్యాయి, ఇంకా ఏం మిగిలాయి అన్ని ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించు. అప్పుడు నమ్ముతాను. చదివేసా అనేస్తే సరిపోదు, నేను రేపు మళ్ళీ క్వశ్చన్లు అడిగితె చెప్పకపోతే అప్పుడు ఉంటుంది"
"సరే" అంది వత్తి పలుకుతూ
"కోపం తెచుకోకురా. నన్ను ప్రేమించటం వలెనే మార్కులు తగ్గిపోయాయి అన్నాడనుకో మీ అన్న అప్పుడు నేనేం చెప్పనూ"
"నాకా సబ్జక్ట్స్ ముందరివే కదా"
"అందుకే కదా, నేనూ చెప్పచ్చుగా, మీ చెల్లి ప్రేమిస్తుంటే ఇంకా బాగా చదివింది. నేనూ ప్రేమించటం మొదలెట్టాక వెంటనే జాబ్ వచ్చేసింది. అలా మేము గెలవాలంటే ఇద్దరికీ ఒకరికొకరం కావాలి అని చెప్పి ఒప్పించేస్తా అన్నమాట" అన్నాడు ఏదో చిన్నపిల్లలని బుజ్జగిస్తున్నట్లు
"ఓహ్ అలా అంటావా బావా.... సరేలే బాగా చదువుతానులే" అంది ఆలోచిస్తూ
"అదీ.... గుడ్ గర్ల్ " అంటూ స్వాతి అమాయకత్వానికి తనలో తనే నవ్వుకున్నాడు
స్వాతి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి ప్రదీప్ వచ్చాడు. ప్రదీప్ తో కబుర్లు చెప్తూ, "అన్నయ్యా మేడ మీదకి వెళ్దామా" అంటూ బతిమాలింది. ఆ ఇల్లు మొత్తం లో కి తన రూమ్ కన్నా ఎక్కువ ఇష్టం అంటే ఆ మేడే. ఆ మేడ మీద అన్ని కబుర్లు చెప్తుంది, సంతోషం వచ్చినా బాధ వచ్చినా అక్కడ కూర్చోటం ఇష్టం. చాలా వరకు ప్రదీప్ తో ఏది మాట్లాడాలన్నా అక్కడే మాట్లాడ్తుంది, ఏది అడగాలన్నా అక్కడే. అందుకే ప్రదీప్ కి కూడా మేడ మీదకి అనగానే బయటకి చెప్పకపోయినా ఏదో విషయం ఉందని అర్థమయిపోతుంది. రమ్మంది కదా అని పైకి వెళ్ళి కూర్చున్నారు
"అన్నయ్యా రేపు క్లాస్ లో అందరమూ @@@@@ పార్క్ కి వెళదామనుకుంటున్నాము. వెళ్ళనా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ " అంటూ బతిమాలింది
"రేపు కాలేజ్ సెలవా, రమ్య, మనోజ్ వాళ్ళు వస్తున్నారా. అయినా ఆల్రెడీ చెప్పేసుంటావ్, ఇంత లేట్ గా నన్ను అడుగుతున్నావంటే ఏదో జస్ట్ ఫార్మాలిటీనే కదా "
"సెలవు లేదు. వాళ్ళూ రావట్లేదు. ఓన్లీ మా క్లాసే. నేనేమి చెప్పలేదు, నిన్ను అడిగాకే చెప్తా అని చెప్పాను ముందరే"
"సరే. అమ్మ ఏమంది"
"హీహీ..... నేనడగలేదు. నువ్వు చెప్పులే తర్వాత, ఇప్పుడు నేను చెప్తే ఒప్పుకోదు, తిడుతుంది. అది కాదు కానీ ముందర నువ్వు ఓకే చెప్పూ"
"ఓకే నే. అమ్మ కి నేను చెప్పనూ. నీకు పడాల్సిన నాలుగు నాకు పడతాయి"
"మా బుజ్జన్నయ్యవి కదూ. నేనంటే నీకు ఇష్టం కదా నాకోసం ఈసారికి ఆ నాలుగు నువ్వే తినేయవా" అంటూ బతిమాలుతున్నట్లు అడిగింది నవ్వుతూ
అంతముద్దుగా అడిగితె ఎవరైనా కరిగిపోవాల్సిందే, "సరేలే, నేను నిన్ను దింపేసి వెళ్తాను పొద్దున్న"
"ఏమక్కర్లేదు. అందరం కాలేజ్ దగ్గర కలిసి అటు నుంచి వెళ్తాము." ప్రదీప్ ఏదో చెప్పబోతుంటే తనకి అడ్డుపడుతూ "నువ్వు రేపు కాలేజ్ లో కూడా దింపక్కర్లేదు. వచ్చి సర్వేలెన్స్ చేయక్కర్లే. బానే వెళ్ళగలనులే"
"సరే అన్ని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాక ఇంక నన్నెందుకు అడగటం" అంటూ కోపంగా వెళ్ళిపోబోతుంటే
"ప్లీజ్ అన్నయ్యా, కోప్పడకూ" అంటూ మళ్ళీ బతిమాలింది. అన్ని సార్లు అడిగేసరికి ప్రదీప్ కూడా కాదనలేకపోయాడు
తర్వాత రోజు పొద్దున, రెడీ అయ్యి హరీష్ కి ఫోన్ చేసి "అన్నయ్య ఒప్పుకున్నాడు. వెళ్తున్నాను" అంటూ లొకేషన్ షేర్ చేసి ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది
ఆ రోజంతా బయట తిరిగి ఈవెనింగ్ ఇంటికొచ్చి, ఆకలి లేదంటూ, తన రూమ్ లో కి వెళ్ళి తలుపేసుకుని పడుకుండిపోయింది.
ప్రదీప్ ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళ అమ్మ గారు భోజనానికి పిలిస్తే , "చిన్నూ ఏది, నేనొచ్చినప్పటి నుంచి కనిపించలేదు. భోజనానికి పిలువు దాన్ని"
"అది వస్తూనే టైర్డ్ గా ఉంది పడుకుంటాను, ఆకలి లేదంది. ఏం తినను, లేపద్దు అని చెప్పి మరీ పడుకుంది"
తర్వాత రోజు పొద్దున్న, స్వాతి వాళ్ళ అమ్మ గారు తనని లేపటానికి వెళ్ళి, "స్వాతీ..... ఏమయిందే..... లే అమ్మా" అంటూ బాధగా లేపేసరికి స్వాతి కళ్ళు తెరిచి ఆవిడని చూసీ ఖంగారుగా "అమ్మా.... ఏమైందిప్పుడు. గట్టిగా మాట్లాడకమ్మా. అన్నయ్య లేస్తే తిడతాడు. ప్లీజ్ అమ్మా" అంటూ ఏడ్చేసింది
"నిన్ను అసలు పంపించినందుకు వాడిని అనాలి" అంటూ ఆవిడ కోపంగా వెళ్లిపోతుంటే ఆవిడని ఆపి బతిమాలింది. ఆ తర్వాత తను లేచీ కాలేజ్ కి బయల్దేరింది.
"ఈరోజు కాలేజ్ కి వాడు దింపుతాడు. ఆగు" అన్నారు ఆవిడ స్వాతి బయల్దేరబోతుంటే
"అమ్మా.... అన్నయ్య కి నన్ను దింపి వెళ్ళటం అంటే లేట్ అవుతుందీ"
"పర్వాలేదురా. నేనూ ముందరే బయల్దేరుతున్నాలే. చాలా టైమ్ ఉంది ఈరోజు. అమ్మ లేచినప్పుడే చెప్పింది. అమ్మా నాకూ టిఫిన్ పెట్టవా"
స్వాతి వాళ్ళ అమ్మగారిని చూసింది కానీ ఆవిడ అదేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు
ప్రదీప్ టిఫిన్ చేస్తుంటే, హరీష్ కాల్ చేసాడు.
"చెప్పు బా... "
"ఏంలేదు బావా, నిన్న బైక్ చిన్న రిపేర్ ఉంటే ఆఫీస్ దగ్గర మెకానిక్ కి ఇచ్చాను కదా. నువ్వు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నేనూ నీతో వస్తాను"
"సరే. కానీ నేనొక 5మినిట్స్ లో బయల్దేరుదాం అనుకుంటున్నా. స్వాతి ని కాలేజ్ లో దింపేసి వెళదామని. మరీ నువ్వు రెడీ ఆ"
"నేను రెడీనే బావా ... బయట వెయిట్ చేస్తాను. ఉంటా" అంటూ ఫోన్ పెట్టేసాడు
ప్రదీప్, స్వాతి కార్ లో బయల్దేరారు. స్వాతీ చాలా ముభావంగా, నీరసంగా ఉంది. ప్రదీప్ తో లేచాక ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న తిరుగుడికి అలసిపోయిందేమో అనుకున్నాడు తనలో తనే
"ఏమయిందిరా అంత డల్ గా ఉన్నావు. నిన్న బాగా ఎంజాయ్ చేశారా. ఎప్పుడొచ్చావు ఇంటికి. ఈరోజు రెస్ట్ తీస్కోలేకపోయావా కొంచం" అంటూ స్వాతిని మాట్లాడించే ప్రయత్నం చేసాడు ప్రదీప్
"అన్నయ్యా నీ దగ్గరో విషయం దాచాను" అంది బాధగా. నిన్న పొద్దున్న కాలేజ్ లో దింపాక తన గొంతుని మళ్ళీ ఇప్పుడే వినటం. ఆ మాటలో ప్రదీప్ కి తప్పు చేసాను అనే భావము కనిపించింది
"నా దగ్గర దాచాల్సిన పనేముందిరా, ఏ విషయం"
***********************************************
అసలు రమ్య ఎందుకు కోపంగా ఉంది, హరీష్ తో పూర్తిగా చెప్పలేదంటే ఇంకా ఏం దాస్తోంది
స్వాతి వాళ్ళ అమ్మగారు ఎందుకు పొద్దున్న ఆవేదన పడ్డారు
అసలూ అన్నిటికైనా, స్వాతి ఏ విషయం దాచిందని అంది ప్రదీప్ తో. హరీష్ గురించి చెప్పేస్తుందా?? మరీ ప్రదీప్ ఒప్పుకుంటాడా??
మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయటం మర్చిపోకండి.
నా ఈ తొలి ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు కథలో నచ్చినది లేదా నచ్చనిది ఏదైనా ఉంటే తెలుపగలరు.
Comments
Post a Comment