17

 


అక్కడ హరీష్....  "బావా నువ్వు ఎదురుగా రాకు. ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తా" అంటూ లోపలికి వెళ్ళాడు.  


సారథి గారు కూర్చుని ఫోన్ చూసుకుంటున్నారు. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని, హరీష్ "మీరు ఇందాకా మా స్వాతి ని ఏదో అన్నారేంటి. దరిద్రురాలా....  ఎవరు?? తనా?? మీరా? ఎవరూ లేకుండా,  కన్న కూతురు ఉన్నా, ఒక్కరూ బతుకుతున్న మీరా?  లేదా కన్నతండ్రి ప్రేమ లేకపోయినా పెదనాన్న నాన్న అయ్యారు. అన్న అంటే అమ్మ నాన్నలో సగం అంటారు... అలా తల్లీ తండ్రి ప్రేమని పంచుతూ అన్నగా స్వాతి బాధ్యత తీసుకున్నాడు. అమ్మలా లాలించే మీ ఒదిన. ఇంత మంచి మనుషులు చుట్టూ ఉన్న తనా? తను ఈ ఇంటి మహాలక్ష్మి. అలాంటిది ఆ అమ్మాయిని నట్టింట్లో అవమానిస్తారా. ఈ ఇంటిపెద్దకి తమ్ముడిగా మీకు గౌరవం ఇస్తున్నప్పుడు అదే గౌరవం ఈ ఇంటి ఆడపిల్లకి కూడా ఇస్తే మీకూ మర్యాద. అయినా ఇవే మాటలు మీ అన్నయ్యగారు విని ఉంటే ఎంత బాధపడతారో ఆలోచించారా" అంటూ చాలా ఆవేశంగా మాట్లాడాడు 


"బాబూ ఇంతకీ దానికి నువ్వేం అవుతావు" అన్నారు వెటకారంగా నవ్వి 


"పరాయివాడినేమి కాదులెండి. ఈ ఇంటికి కావాల్సినవాడినే. ఈ ఇంట్లో ఎవరు బాధపడినా మేమెవరమూ చూస్తూ ఊరుకోము"  అని చెప్పేసి బయటకి వచ్చి ప్రదీప్ ని చూసీ కన్ను కొట్టి ఆగకుండా పక్కకి వెళ్ళిపోయాడు. 


ప్రదీప్ రాగానే ఇద్దరూ హైఫై ఇచ్చుకుని,  "సూపర్ బావా నువ్వు. పనిలోపని నా బదులు లాగి ఒక గుద్దు గుద్దేయాల్సింది" అంటూ ప్రదీప్ గట్టిగా నవ్వాడు 


"ఏమో బావా.... అనుకున్నా కానీ ఆయన పెద్దరికం అడ్డొచ్చింది. సరేలే,  ఆయన నన్ను గుర్తు పట్టలేదు. పట్టేలోపు నేను జంప్. నేనెవరో తెలిస్తే ముందు మన వాళ్ళు గొడవ చేసేస్తారు. నువ్వు నవ్వు కంట్రోల్ చేస్కో. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి ఎగ్జిట్ అవుతాను. అయన వెళ్ళగానే వచ్చేస్తా. అమ్మా వాళ్ళు అడిగితె నీకూ తెలీదని చెప్పు" అంటూ కోపంగా ఫేస్ పెట్టి బయటకి వెళ్ళిపోయాడు  


హరీష్ అలా వెళ్ళటం చూసీ స్వాతి భయపడుతూ "అన్వి....  ఏమైందే. అన్నయ్యా,  బావా ఏం మాట్లాడుకున్నారు. ఎందుకు తను అలా కోపంగా వెళ్ళిపోయాడు. ఏమయ్యుంటుందే. ఆగు నేను అన్నయ్యని అడిగొస్తాను" అంటూ అన్విత సమాధానం కూడా వినకుండా పరిగెత్తింది. 


అన్విత పక్కనే ఉన్న స్వాతి ఫోన్ రింగ్ అవటంతో ఎవరా అని చూసేసరికి హరీష్ పేరు కనిపించింది అన్వితకి. "తననే అడుగుదాం ఏంజరిగిందో"  అనుకుంటూ,  "హలో" అంది 


"స్వీటీ. ... లవ్ యూ సో మచ్ రా. అలాంటి మనిషిని కూడా నాన్నా  అంటూ  ప్రేమించగలిగే నువ్వు, నన్ను ప్రేమిస్తున్నావంటే నేను చాలా లక్కీ స్వీటీ. నిన్ను అస్సలు వదులుకోనురా. లవ్ యూ సో మచ్" అంటూ ఫోనులోనే ముద్దుపెట్టాడు. 


"అన్నయ్యా అసలు ముందర ఫోన్ ఎవరు తీశారో కూడా చూసుకోవా. ఇదే కాల్ హిట్లర్ ఎత్తుంటే??? " అంటూ అన్విత నవ్వేసరికి.... 


"అయ్యో నువ్వా. సారీ. గమనించలేదు. స్వీటీ ఏది" 


"మీ స్వీటీ కి ఇస్తాలే కానీ ముందర నువ్వు అలా సీరియస్ గా వెళ్లిపోయావ్ ఏంటీ. ఏమయినా అన్నాడా ప్రదీప్ బావ. అది ఖంగారుగా తన దగ్గరకి పరిగెత్తింది. అందుకే ఫోన్ ఇక్కడే మర్చిపోయింది"


"తనేమి అనలేదు. స్వీటీ....  ఐ మీన్ స్వాతి వాళ్ళ నాన్నకి చిన్న ఝలక్ ఇచ్చేసి బయటకి వచ్చేసా. నా బంగారాన్ని ఏదైనా అంటే చూస్తూ ఊరుకుంటానా. తనకి చెప్పకు మళ్ళీ ఫీల్ అవుతుంది" 


"మీ స్వీటీకి చెప్పనులే కానీ నువ్వేదో చెప్పేసావేమో మీ గురించి వాళ్ళ అన్నకి అనుకుని, అడగటానికి వెళ్ళింది. నువ్వెప్పుడొస్తావ్ అన్నయ్యా" 


"అయన వెళ్ళగానే కాల్ చేయి, వచ్చేస్తా. ముందు స్వాతి ఏం మాట్లాడుతోందో చూడవా. టెన్షన్ పడద్దని చెప్పు. వచ్చేస్తాను" 


"సరే" అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది అన్విత. "ఇప్పుడు స్వాతిని పిలిచే బదులు, ఏదో ఒకటి మాట్లాడితే ప్రదీప్ బావకి దొరికిపోతుంది కదా. అప్పుడు తనే ఆలోచిస్తాడేమో ఏం చేయాలోను. నేను ప్రదీప్ కి చెప్పినట్లు అవ్వదు కదా. కానీ....  స్వాతి ఫ్రెండ్ గా నేను చేసేది తప్పేమో. అయినా హరీష్ అన్నయ్యతో అదీ హ్యాపీ గా ఉంది. తనూ అది బాధ పడకుండా చూసుకోగలడులే. సరేలే అక్కడికి వెళ్ళి చూద్దాం" అని తనలో తనే అనుకుని స్వాతి,  ప్రదీప్ దగ్గరకి వెళ్ళింది. 


"ఏంటీ అన్నా చెల్లెళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు. అవును హరీష్ అన్నయ్య ఏడి" 


"ఏంటే,  వాడు వెళ్ళి పావుగంట అవలేదు ఇద్దరూ చెరో సారి వచ్చి అదే క్వశ్చన్ మార్చి మార్చి అడుగుతున్నారు. ఏదో కాల్ వస్తే వెళ్ళిపోయాడు ఎటెళ్ళాడో నాకేం తెలుసు" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్ 


అన్విత  "స్వాతి..... హరీష్ అన్నయ్య కాల్ చేసాడే. వచ్చేస్తా, టెన్షన్ పడద్దని చెప్పమన్నాడు"


"అసలెటు వెళ్ళాడు బావా" 


"ఏమో స్వీటీ....  వచ్చాక నువ్వే అడుగు"


"ఓయి.....  నీకూ .... ఎలా తెలుసు"  అంది తడబడుతూ


"ఫోన్ ఎత్తిందెవరో కూడా తెలీకుండా లవ్ యూలు,  స్వీటీ అంటూ ముద్దులు అబ్బబ్బో ఏం ప్రేమలమ్మా" అంటూ ఆటపట్టించింది. అన్విత అలా అంటుంటే స్వాతి సిగ్గుపడిపోయింది. 


కొద్దిసేపటికి సారథి గారు వెళ్ళిపోయాక,  ప్రదీప్ ఫోన్ చేసి హరీష్ ని రమ్మని చెప్పాడు. అందరూ మళ్ళీ కూర్చుని  కబుర్లు మొదలెట్టారు. 


స్వాతి,  ప్రదీప్ దగ్గరకొచ్చి...."అన్నయ్యా నాకో సలహా చెప్పూ... త్వరగా" అని అడిగింది 


"ఏంట్రా" 


"అమ్మ ని బుక్ చేసేయనా నీ పేరు వాడేసుకోనా.... త్వరగా చెప్పూ. అదొచ్చేస్తోంది" అంటూ ఖంగారు పెట్టింది 


అప్పటికి కానీ స్వాతి చూపు ఎక్కడో ఉందని గమనించి, అటుగా తలతిప్పి చూసి మళ్ళీ ఏమీ తెలియనట్లే "సరే నా పేరు చెప్పులే. ఇంతకీ ఏంటీ మేటర్" 


రమ్య వస్తోందన్నయ్యా. దాన్ని పిలవలేదని గొడవ చేస్తుంది. ఇప్పుడు  నువ్వే ఒద్దన్నావని చెప్పేస్తా " అంది నవ్వుతూ 


"హహహ.....  తనని పిలిచిందే నేను. నీకు సర్ప్రైస్ అని చెప్పా. అందుకే ఇప్పుడు నిన్ను ఏమి అనదు" అని నవ్వేసాడు ప్రదీప్ 


స్వాతి ఉడుక్కుంటూ, హరీష్ తో "బావా... మా అన్నయ్య అందరిని భయపెట్టటమే తప్ప భయపడటం చూడలేదు కదా, ఇప్పుడు కొంచం సేపట్లో చూడు. రమ్మీ వచ్చిందంటే ఇక్కడ షేకే" అని నవ్వేసి పరిగెత్తింది 


రమ్య ఇంట్లోకి వస్తూనే అప్పటి వరకూ చిన్న చిన్న సవ్వడులు వినిపించిన ఆ ఇల్లు కోలాహలంగా మారిపోయింది. కొత్త పాత, తెలిసినవాళ్ళు తెలీని వాళ్ళు అని లేకుండా అందరి దగ్గరకి వెళ్ళి పరిచయం చేసుకుని పలకరించింది. స్వాతి, రమ్య ఎప్పటి నుంచో స్నేహితులు అవటం, అలాగే ఒకరి ఇంటికి ఒకళ్ళు వచ్చి ఉండటాలు వలన ఇంట్లో వాళ్లకి తన అల్లరి తెలుసు. 


రమ్య  "అవునూ అన్వి,  ఇంతకీ హీరో ఎక్కడున్నాడు. ఎక్కడో దాచేసినట్లుందిగా" అంది వెతుకుతూ అన్వితతో 


"హాహా....  నీకు చూపిస్తే ఊరంతా తెలిసేలా గోల చేస్తావనేమో. అయినా అంతలా వెతికటానికి నీకు ఎలా ఉంటాడో తెలిసేంటి. అది నిన్ను తన పక్కనుంచి దాటించేసినా నువ్వు గుర్తుపట్టలేదు" అంటూ నవ్వేసింది


"అవునా!!! అయితే ఇప్పుడు నాకు తెలియాల్సిందే. చెప్పవే ఎక్కడున్నాడో. నేనే షాక్ ఇస్తాను బాస్ కి" 


"అదిగో అక్కడ నుంచుని ఫోన్ మాట్లాడుతున్నాడు కదా,  తనే" అంటూ హరీష్ ని  చూపించింది అన్వి 


రమ్య,  హరీష్ దగ్గరకి వెళ్ళి,  "ఐ లవ్ యూ" అంది సిగ్గుపడుతూ, అతన్ని ఆట పట్టిద్దామని,  


హరీష్ నవ్వుతూ "ఐ లవ్ యూ టూ సిస్టర్" అన్నాడు


స్వాతి దూరం నుంచి హరీష్ ని గమనిస్తూ, రమ్య తన దగ్గరకి వెళ్లేసరికి, తను వాళ్ళ బావని ఇబ్బంది పెట్టేస్తుందేమోనని అటు వెళ్లేసరికి, రమ్య కళ్ళు పెద్దవి చేస్కుని హరీష్ ని చుస్తూండటంతో అర్థం కాక


"బావా ఏమైందీ" అని హరీష్ ని అడిగిందీ.


"ఏమో స్వీటీ.....  మీ రమ్య వచ్చింది,  నన్ను ఆట పట్టిదామనుకుంది. ఐ లవ్ యూ అంది. నేనూ ఐ టూ అన్నాను అంతే" అన్నాడు నవ్వాపుకుంటూ 


స్వాతి కోపంగా రమ్యని చూడగా, రమ్య "అంతేనా..... చివరిలో సిస్టర్ అనలేదూ" అంది హరీష్ ని కోపంగా చూస్తూ తన ప్లాన్ ప్లాప్ చేసినందుకు 


"బాగా అయ్యిందా" అంటూ రమ్య ని చూసీ నవ్వి "ఇంతకీ బావా,  నీకెలా తెలుసు తనే రమ్య అని" హరీష్ ని అనుమానంగా అడిగిందీ 


"ఇందాకా తనొస్తున్నప్పుడే చుపించావ్ కదా,  పైగా ఇంకోటేదో డైలాగ్  కూడా అన్నావ్ కదా" అన్నాడు నవ్వుతూ 


"ఏం చెప్పావే నా గురించీ" అంది స్వాతీ అనుమానంగా చూస్తూ రమ్య 


హరీష్ "ఏమిలేదులెండి. అయినా ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను రమ్యగారు. మీరనుకుని మీ మెసేజ్ లు నాకు పంపిస్తుంది కానీ మిమ్మల్ని మాత్రం పరిచయం చేయలేదు" 


" 'మీరు', 'గారు' లు ఎందుకూ,  సిస్టర్ అని కమిట్ అయ్యారు కదా ఇంక.  అలాగే కంటిన్యూ అవ్వండి బ్రదర్" అని అనటంతో అందరూ నవ్వేశారు 


"ఓయి మీ మీటింగ్ లు అయితే మేమింక బయల్దేరతాము. హరీష్ అన్నా నన్ను కొంచం మెయిన్ రోడ్ దగ్గరకు దింపుతావా. క్యాబ్ లు దొరుకుతాయి అక్కడ నుండి" అంటూ వాళ్ళ దగ్గరకి వచ్చింది అన్విత.


రమ్య "అదేంటి అన్వి, నేనిప్పుడే వచ్చాను కదా. కొంచం సేపు ఏవైనా గేమ్స్ ఆడుదాము. అందరిని రమ్మనూ",  స్వాతి వైపుకి తిరిగి తనకి మాత్రం వినిపించేలాగా,  "నువ్వూ మీ హీరో నా మీద జోకులేస్కుని నన్ను ఆటపట్టిస్తారా,  ఇప్పుడు మీరు అయిపోయారు నా చేతుల్లో" అంటూ విల్లన్ లా ఒక నవ్వు నవ్వింది 


రమ్య మాటలు పట్టించుకోకుండా, అన్విత ఏదో చెప్పబోతుంటే, "రమ్మీ ఫిక్స్ అయిందంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్లే.  నువ్వు మాట్లాడి వేస్ట్ కానీ పదా అందరిని రమ్మందాం " అంటూ అన్విత తీసుకునీ వెళ్ళింది స్వాతి 


అందరూ వచ్చి కూర్చున్నాక,  అందరూ కూర్చుని ఆడేలాగా అంటే నాకు అంత్యాక్షరే గుర్తొస్తుంది. మీ ఎవరికైనా ఇంకో గేమ్ తెలుసా" అంటూ ఒక్క క్షణం ఆగి,  సరే అదే ఆడదాము కానీ ఒక చేంజ్. అబ్బాయిలు ఒక వైపు అమ్మాయిలు ఒక వైపు కూర్చుందాం. అలాగే వాళ్ళు పాడే పాట సందర్భానుసారంగా ఉండాలి,  మనసులో నుంచి వచ్చిందై ఉండాలి,  ముందర వాళ్ళు పాడిన  పాట లోని పదం అయ్యుండాలి.స్టార్ట్ ఆ మరి",  రమ్య ప్రదీప్ వైపు చూస్తూ,  "నువ్వు మాత్రం.....  నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో అంటూ పాడితే ఊరుకోను. మంచి లవ్ సాంగ్స్ ఏ పాడాలి." అంటూ వార్నింగ్ ఇచ్చింది  


అమ్మాయిలు నుంచి సందర్భానుసారం అంటే ఈరోజు పూజ చేసుకున్నాం కాబట్టి ముందర దేవుడి పాట తో మొదలు పెడతాం అంటూ... 


తిరుమల వాసా

తిరుమల వాస సుమధుర హాస

ఈ హారతి గొనవయ్యా

శ్రితజన పోష జయ జగదీష

మా ఆర్తిని కనవయ్యా


అడుగె పడని పయనాన

అడుగె పడని పయనాన

వెలుగై నడిపె నీ కరుణా

ఆ వరాన్ని ఈ దోసిలిలోన

నిలుపుకొందుకె తపములు చెసా


అని పాడుతుంటే,  అబ్బాయిల వైపు నుంచి.... 


స్వాతి కి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు 


రమ్య ఇంక ఈ రౌండ్ అయిపొయింది. నెక్స్ట్ రౌండ్ బర్త్డే గర్ల్ స్పెషల్ రౌండ్. తన నచ్చినదేదైనా సరే మనసులో ఉన్న ఫీలింగ్స్ ఒక కవిత చెప్పాలి. ఇప్పుడే" అంటూ కన్ను కొట్టి స్వాతి వైపు చూసింది


"ఇదిగో కవితలు అవీ అంటే అందరికీ రావాలి కదా,  ఇలాంటివి మెమొప్పుకోము" అన్నారు అబ్బాయిల వైపు నుంచి ఎవరో,  వాళ్ళని కూడా అడుగుతారేమో  అని భయంగా 


"ఎవరికి ఏం వస్తే వాళ్ళని అదే అడుగుతాము. దీని టాలెంట్ మీ ఎవరికీ తెలీదేమో. నాకు బాగా తెలుసు"


స్వాతి,  అన్విత తో....."ఇది ఇరికించేసిందే. అందరి ముందు వాగుతోంది. నువ్వే ఏదో ఒకటి చేయవే" అంటూ బతిమాలింది 


అన్విత లేచీ "అది ఇప్పుడేదైనా కవిత చెప్పిందే అనుకో అక్కడ వాళ్ళ అన్న ఆ కవిత ని ఖూనీ చేసేసి దానికి టార్చర్ చూపిస్తాడు" అది అందుకే చెప్పదూ" 


హరీష్ మాత్రం,  స్వాతి కొత్తల్లో ఎప్పుడో మెసేజ్ చేసింది కానీ డైరెక్ట్ గా తను ఎప్పుడూ స్వాతి కవితలు విననేలేదు. వినాలని తనూ చూస్తున్నాడు 


చివరికి ప్రదీప్ ,  "ఏమి అననురా. సరదాగా ఆటే కదా. అయినా ఏదో నిజంగా నువ్వు నాకు భయపడిపోతున్నావ్ అనుకుంటారు అందరూ"  అంటూ నవ్వాడు 


ఇంక ప్రదీపే భరోసా ఇచ్చాకా తప్పదనుకుని "ఒక్క క్షణం టైమ్ కావలి" అంటూ ఆలోచనలో పడింది 


తనని మనమూ డిస్టర్బ్ చేయకుండా కొంచం సేపు ఆగి చూద్దాము. ఏం చెప్తుందో,  ప్రదీప్ కి అర్థమవుతుందా,  హరీష్ కి నచ్చుతుందా తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే

*************************************************

ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి.....  ఈ కథలో,  చాలామంది మేనమామ మేనత్త  పిల్లలు,  పెద్దమ్మ పెదనాన్న పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు,  అందరూ కలిసినప్పుడే వస్తూ ఉంటారు స్టోరీ లో. అందుకే పేర్లు రాయలేదు. అందరూ కలిసి ఆటలు ఆడినా పాటలు పాడినా వీళ్ళ నలుగురే కాకుండా చుట్టూ ఇంకా జనాలు  ఉన్నారు. మనకి తెలిసిన ఆర్టిస్టులు పేర్లు మాత్రమే రాస్తున్నాను. అర్థం చేస్కోగలరు



Comments