12
"అంటే..... పొద్దున్న ఫోన్ చేసినప్పుడూ, నేనేదో ఒకటి చేస్తాను అన్నావూ. తర్వాతేమో అన్వి ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మా వాళ్ళు కూడా వెళ్లారు. అందుకే నువ్వేమైనా చేశావా అనీ " అంది నవ్వుతూ
"ఓయి... నేనెలా అరేంజ్ చేస్తాను. పొద్దున్న అన్నాను కానీ ఏం చేయాలో తెలీక పిచ్చెక్కుతోంది, ఇంతలో నువ్వే కాల్ చేసావు"
ఇద్దరూ నవ్వుకున్నారు. స్వాతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకునీ
"స్వీటీ ... ఇప్పుడైనా చెప్తావా ఏమయిందో నిన్న. నిన్ను ఎవరు ఏమన్నారు "
"ఏ.. ఏమవలేదు బావ" స్వాతి మాటలో ముందరున్న నవ్వు ఇప్పుడు లేదు, మాట వణుకుతోంది
"చెప్పరా.... నువ్వు నా ప్రాణానివి. నీ పక్కన ఉండలేకపోయినా నిన్ను వదిలేసినట్లు కాదు, నువ్వొక్కదానివీ కాదురా. నేనున్నాను. ఏదైనా కూడా నాతో షేర్ చేస్కో."
హరీష్ అలా మాట్లాడుతుంటే స్వాతికి అప్పటి వరకూ ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని బయటకి వచ్చేసింది. అతని గుండెల పై వాలిపోయి ఏడ్చేసింది.

"బావా నిన్నొదిలి నేనుండలేను. కానీ అన్వి మన పెళ్ళికి ఎవరూ ఒప్పుకోరు. పెళ్ళి జరగదూ, హోప్స్ పెట్టుకోవద్దంటోంది. నాకు భయమేస్తోంది"
స్వాతి కన్నీళ్లు తుడిచి, తల మీద ముద్దుపెట్టుకుని, స్వాతి తల ఎత్తి తన కళ్ళలోకి చూస్తూ
"బంగారం... చెప్పాను కదా, నువ్వు నా ప్రాణం అని. పెళ్ళి అనే బంధం తో నువ్వు నాతోనే ఉంటావు కదా, మరి నిన్నెలా వదిలేసుకుంటాను"
"అత్తయ్య వాళ్ళు ఒప్పుకోకపోతే? "
"వాళ్ళు ఒప్పుకోలేదని నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు. వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు తెలుసూ, మీ అమ్మతో ఎలా ఒప్పించాలో కూడా తెలుసు. సరేనా. మన పెళ్ళి జరుగుతుంది. నువ్వు నాకు దూరంగా ఉండేది కొన్నాళ్ళు మాత్రమే. కొంచం ఓపిక పట్టు. ఎవరేమన్నా కూడా నా మాట మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఇలా ఏడవకూడదు. సరేనా"
"సరే"
"స్వీటీ... ఐ లవ్ యూ రా. నేనుండగా నువ్వు లోన్లీ గా ఫీల్ అవ్వకూడదు. ఏ టైమ్ లో అయినా సరే నీకు మాట్లాడాలనిపిస్తే నేను నీకోసం అవైలబుల్ గానే ఉంటాను" అన్నాడు ప్రేమగా.
స్వాతి అతని కళ్ళలోకి చూసి, పొద్దున గుడిలో దేవుడిని ప్రదీయపడటం గుర్తుకు వచ్చి, హరీష్ రూపంలో తన నమ్మకం నిజామావుతుందని చెప్పినందుకు ఆయనకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది.
హరీష్ "ఆమె మౌనం అర్థంకాక "ఏంటిరా అలా చూస్తున్నావ్"
"ఏంలేదు బావా... పొద్దున్న 'నేనెలా అయినా కలుస్తాను' అని చెప్పేసి ఆ తర్వాత 'ఎలా కలవాలా' అని ఆలోచించినట్లు ఇప్పుడు నాకు ఒప్పిస్తాను అని చెప్పి తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తావా ఏం చేయాలి అని" అంది నవ్వుతూ
"స్వీటీ ... ఇంత ఎమోషనల్ సీన్ లో కూడా నా మీద డైలాగ్లు ఆపవా"
"మరి నేను ఏడ్చేసారికి నువ్వు డల్ అయిపోయావు. నువ్వలా ఉంటే బాలేదు. నవిద్దామని"
"నువ్వు ఏడుస్తే నాకు మనసులో పీకేస్తుందిరా. నీకెలా నా మీద నమ్మకం తెప్పించాలో తెలీటం లేదు. పోనీ ఇంట్లో చెప్దామంటే, ఉద్యోగం కూడా లేదు అంటారేమో అని ఆలోచిస్తున్నా "
"సరే.... ఏడవనులే. ఏడుపొచ్చినా ఆపేసుకుంటాను, లేదా నీ ముందర ఏడవను"
"అది కాదురా... ఏడవద్దు అనటం లేదు. బాధగా అనిపిస్తే నాతో షేర్ చేస్కో. ఒక్కదానివి బాధపడటం కాదూ అంటున్నా"
"లేదు బావా. నువ్వు చెప్పావు కదా. నేను ధైర్యంగానే ఉంటాను. నువ్వు జాబ్ సంగతీ చూస్కోలే. నేను బానే ఉంటా"
'ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పనివి"
అప్పటి వరకూ సంతోషంగా ఉన్న స్వాతి కొంచం అసహనంగా "ఆఁహాఁ ఏమి లేవు బావా" అంది తన పక్క నుంచి జరుగుతూ
స్వాతి చేయి పట్టుకునీ, ఆమెని కదలనీయకుండా "ఇంకా ఏమున్నాయిరా"
"అదీ... చెప్తే..... నువ్వు నవ్వుతావేమో అని చెప్పలేదు"
"నేనా.... ఎందుకూ"
"నాకూ లాస్ట్ ఇయర్ లో రెండు సబ్జక్ట్స్ ఉండిపోయాయి. అవి చదువుతున్న ప్రతీసారి నీకు చెప్పలేదే అని గిల్టీ ఫీలింగ్"
"హాహాహా .. "
"అదిగో.... చెప్పానా నవ్వుతావని. అందుకే చెప్పలేదు" అంది బుంగమూతి పెట్టి
"మూతి అలా పెట్టకూ, కొరికేయాలనిపిస్తుంది. నాకు నవ్వోచింది నువ్వు చెప్పిన విషయం గురించి కాదు చెప్పిన విధానం కి... సరేలే. చెప్పేసావు కదా. ఇప్పుడైనా సరిగ్గా చదువు. ఏదైనా అర్థం కాకపోతే అడుగు మొహమాట పడకుండా " తన తలనీ స్వాతి తలకి కొట్టి
"సరే "
"ఇప్పుడు పనేమిలేదు కదా, ఆ బుక్స్ తీసుకునిరా. టాపిక్స్ ఏంటో చూద్దాం"
స్వాతి గట్టిగా నవ్వేసింది. అంతలోనే నోరు మూసేస్కుని "తీసుకొస్తా" అంటూ లోపలికి వెళ్ళబొయింది
"ఓయి ఆగు. ఎందుకురా నవ్వావు అంత గట్టిగా. నేనేమన్నాను"
"బావా.... ఇంట్లో ఎవరూ లేరు. నీ ప్లేస్ లో ఇంకోళ్ళెవరైనా ఉంటే, కూర్చుని కబుర్లు చెపుదాం ఈ టైమ్ నీ నాతో బాగా స్పెండ్ చేయాలి ఇంకా ఏవేవో అంటారు. నువ్వేమో, బుక్స్ తీసుకునిరా అంటున్నావ్. నవ్వు రాదా మరీ " అంది సిగ్గుపడుతూ
హరీష్ ఆమెని చూసి నవ్వి "ముట్టుకోకు, ముద్దుపెట్టుకోకు అంటే ఇంకేం చేస్తాం. బుక్స్ తీసామనుకో నువ్వూ చదువుకోవచ్చు, నేనూ నీ టైమ్ వేస్ట్ చేయకుండా నీతో పాటు ఉండచ్చు కదా అని"
"ఆ.... నేను చెప్పేవన్నీ వినేస్తున్నట్లూ" అని అక్కడ నుంచి పారిపోతుంటే చేయి పట్టుకుని ఆపి
"నిజంగా చెప్పు.... నువ్వు ఒద్దు అన్నాక నేనెప్పుడైనా నిన్ను అలా ఇబ్బంది పెట్టానా"
స్వాతి చిన్నగా నవ్వుతూ, "బావా ఇలా చెప్పచో లేదో తెలీదు కానీ, నువ్వడిగావని చెప్తున్నా. నువ్వు నన్ను పట్టుకున్నప్పుడన్నా, దగ్గరకి తీస్కున్నప్పుడన్నా, నాకు అమ్మా వాళ్ళతో ఉంటే ఎంత సెక్యూర్డ్ గా అనిపిస్తుందో అలానే ఉంటుంది నీ దగ్గర. నువ్ నా మాటకి గౌరవం ఇచ్చి నన్ను ఎప్పుడూ టెన్షన్ పెట్టలేదు. అందుకే ప్రతీరోజూ మళ్ళీ మళ్ళీ ఫిదా అయిపోతున్నా. లవ్ యూ సో మచ్" అంటూ లోపలికి పరిగెత్తేసింది.
స్వాతి వెళ్ళినవైపే చూస్తూ హరీష్ చిన్నగా నవ్వుకున్నాడు.
స్వాతి బుక్స్ తీసుకుని వస్తూ, "ఒకళ్ళతోనే అనుకుంటే ఇప్పుడు ఇద్దరయ్యారు. బుక్స్, ఎగ్జామ్స్ అంటూ" అని తనలో తానే మాట్లాడుకుంటూ వచ్చింది
" ఏంటిరా అంటున్నావ్"
"ఏంలేదులే కానీ ఇదిగో నువ్వు అడిగిన బుక్స్"
"నువ్వేమన్నావో చెప్పు ముందర "
"మొన్నటి వరకూ అన్నయ్య సతాయించేవాడు. చదువూ, బుక్స్ తీయి అంటూ. పైగా 50% అయినా రాకపోతే పెళ్ళి చేసేస్తాడట, బెదిరిస్తున్నాడు"
"ఓయి ఇద్దరూ కలిసి నా కొంప ముంచకండి. 50 కాదు నా టార్గెట్ 75%"
"ఏంటీ?? " హరీష్ మాట అర్థం కానట్లుగా అడిగింది
"నీ లవ్ కి టెస్ట్ రా బంగారం 75% తెచ్చుకుని మీ అన్నయ్య ముందు గొప్పగా చూపించు"
స్వాతి గారంగా "బావా.... నా వల్ల కాదూ "
"ఎందుకవదూ.... నీ ప్రేమని నేనే దగ్గరుండి గెలిపించుకుంటాను కదరా. కానీ చదువు విషయం లో మాత్రం నా మాట వినాలి. అలా అని ఎప్పుడూ చదువు..... చదువు అననులే "
"సరే"
అలా ఇద్దరూ బుక్స్ పట్టుకుని కూర్చున్నారు. ఇంతలో ప్రదీప్ ఫోన్ చేసాడు
స్వాతి.... "చెప్పు అన్నయ్యా "
"ఏం చేస్తున్నావురా. నేను ఒక 30 మినిట్స్ లో వచ్చేస్తాను. ఇంటి దగ్గర్లోనే ఉన్నా. టైమ్ చూసుకోలేదు. భయపడ్తుంటావని కాల్ చేస్తున్న"
"సరే. నాకేం భయం లేదు. నేనేం చిన్న పిల్లని కాను. బాయ్ " అని ఫోన్ పెట్టేసింది
హరీష్ " ఓహో అదా సంగతీ. నీకు భయమేసి నాకు కాల్ చేసావా. నేనింకా నా మీద ప్రేమతో చేసావనుకున్నాను" అన్నాడు నవ్వుతూ
"నాకేమి భయం లేదులే. నేనుండగలను ఒక్కదాన్ని"
"సరేలే అయితే ఉండు, నేను బయల్దేర్తాను. 30మినిట్స్ ఒక్కదానివీ ఇంట్లో ఉండాలి. కరెంటు పోయినా నీకు భయం వేయదు కదా, చిన్న పిల్లవి కాదుగా" అన్నాడు ఏడిపిస్తూ
"బాబోయ్.... ఒక్క దాన్ని ఉండాలా. చీకటి పడుతోంది. నా వల్ల కాదు. ఇప్పుడు ఏమైనా అంటే దొరికిపోతాను" అనుకుంటూ "ఏంటి వెళ్ళేది. ముందర ఈ టాపిక్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళు" అంటూ గట్టిగా అడిగింది
హరీష్ కి స్వాతి భయాన్ని, అది కప్పిపుచ్చటానికి కోపాన్ని నటించటం చూసీ నవ్వుకుని అక్కడే ఉన్నాడు. కొంచం సేపటికి ప్రదీప్ ఇంటికి వచ్చి, హరీష్ ని అక్కడ చూసీ ఆశ్చర్యంగా "ఏంటి బా... సర్ప్రైస్."
"అంతే బావా.... ఇంటి వరకూ వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావు మళ్ళీ నన్ను అంటున్నావు"
"అప్పుడేదో పనిమీద వెళ్తూ రాలేదు. ఏంటి సంగతులు. నీ జాబ్ సెర్చ్ ఎక్కడ వరకు వచ్చింది"
"అది నడుస్తోంది. నీకెక్కడన్నా ఓపెనింగ్స్ తెలిస్తే కొంచం నన్ను గుర్తు పెట్టుకో బావా"
"ఓకే.... తప్పకుండా. ఇంకేంటి కబుర్లు"
"ఏమి లేవు. చాలా రోజులయ్యింది కదా అని వచ్చాను. ఇదిగో ఈ మేడం కి డౌట్స్ ఉన్నాయంటే కూర్చున్నా"
"అదే కదా. అందుకే ఇందాక ఫోన్ చేస్తే నాకేం భయంలేదూ అంది. అసలప్పుడే గెస్ చేయాల్సింది." అన్నాడు నవ్వేస్తూ
"అన్నయ్యా..." అంటూ కోపం గా చూసింది స్వాతి
"సరేలే కానీ, ఫుడ్ పార్సెల్ తీసుకొచ్చాను. ముందర తినేసి అప్పుడు కంటిన్యూ చేస్కోండి "
"ఆఁహాఁ... నేను బయల్దేరతాను బావా. మీరు తినండి. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది.
"ఏం పర్వాలేదు. ఫోన్ చేసి చెప్పు ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నా అని. మనమూ కలిసి చాలా రోజులయ్యింది కదా. ఉండు కొంచం సేపు" అన్నాడు నవ్వుతూ
ఇంక సరే అని, హరీష్ ఇంటికి ఫోన్ చేసి తినేసి వస్తా అని చెప్పాడు.
ప్రదీప్ ప్లేట్స్ లో పెట్టి ఇస్తుంటే "ఎందుకన్నయ్యా, బయట నుంచి తీసుకునీ రావటం. నేనేదో ఒకటి వండేసేదాన్ని కదా" అంది స్వాతి
"లాస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ నేనంత ధైర్యం చేయగలనా"
"ఏమయ్యిందీ" అన్నాడు హరీష్ అర్థంకాక
హరీష్ వెనకగా వెళ్ళీ, ప్రదీప్ కి "నీకు దణ్ణం పెడతా అన్నయ్యా పరువు తీయకు" అంటూ బతిమాలుతూ అడిగిందీ మెల్లిగా సైగ చేస్తూ
"బావా... మీ చెల్లి దణ్ణాలుకి నువ్వేం కరిగిపోవక్కర్లేదు కానీ చెప్పూ ఏమయిందో" అన్నాడు హరీష్ కుతూహలంగా
"నీకెలా తెలుసు బా.... అది దణ్ణం పెడుతోందని. నీకు వెనకాల కూడా కళ్లున్నాయా"
"హాహాహా.... కాదు. ముందర కళ్ళతోనే ఎదురుగా అద్దం లో కనిపిస్తోంది" అన్నాడు నవ్వేస్తూ
"హహహ... లాస్ట్ టైమే ఇలాగే ఇద్దరమే ఉంటే, కూర అన్ని ఉన్నాయి అన్నం ఒకటే పెట్టాలి కదా. నేను పెట్టేస్తానులే అంది. సరేలే అని బుద్ధి తక్కువయ్యి అన్నాను. ఆ కుక్కర్ లో నీళ్లు పోయలేదో ఏం చేసిందో కానీ కుక్కర్ పేలింది"
హరీష్ కంగారుగా "అయ్యయ్యో..... ఏమవలేదు కదా నీకు " అంటూ స్వాతి దగ్గరకి వెళ్ళబోయాడు.
స్వాతి... హరీష్ కంగారుని ప్రదీప్ గమనిస్తాడేమో అని అన్న వైపు చూసి, హరీష్ ని కూర్చోమని సైగ చేసింది.
ప్రదీప్ అదేమీ పట్టించుకోకుండా "కుక్కర్ పేలినప్పుడు ఏమి కాలేదు. లక్కీ గా వంటిట్లో లేదు, కానీ క్లీన్ చేద్దామని ఆ వేడిది పట్టుకుంది. అప్పుడే చేయి కాల్చుకుంది. అందుకే దాన్ని కిచెన్ వైపుకి వెళ్లనీయను" అంటూ చెప్పుకొచ్చాడు
హరీష్ ఇంకా కంగారుగానే "ఇప్పుడు మరి తగ్గిందా. అలా చూస్కోకపోతే ఎలా "
స్వాతి.... "అది ఎప్ప్పుడో చాలా కాలం క్రితం జరిగింది. ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పటికి అదే చెపుతున్నావ్ అన్నయ్య అదేదో నిన్నో మొన్నొ అయినట్లుగా. "
తర్వాత నవ్వులు కబుర్లతో భోజనం ముగించేసి హరీష్ ఇంటికి వెళ్ళిపోయాడు, వెళ్తూ వెళ్తూ స్వాతి కి హోంవర్క్ ఇచ్చి మరీ వెళ్ళాడు.
"అన్నయ్యా.... అమ్మా వాళ్ళు ఎప్పుడొస్తారో కాల్ చేయాల్సింది"
"నేనొచ్చే ముందర మాట్లాడానురా. వాళ్ళు అప్పుడే బయల్దేరుతాము అన్నారు, వస్తూ ఉంటారు"
"అవునా.... ఎలా అయ్యిందో అక్కడా. నాకు చూడాలనుండింది. అమ్మ ఒద్దంది. వాళ్ళు ఏమన్నారో"
"వాళ్లేమో కానీ వీళ్ళే డ్రాప్ ట. ఇదే నచ్చలేదని చెప్పేసిందిట. నీకు పెళ్ళి చూపులు సరదాగా ఉందని నాకు తెలీదురా. నెక్స్ట్ వీకెండ్ మన ఇంట్లో ప్లాన్ చేద్దాములే. నువ్వెలాగో నా టార్గెట్ రీచ్ అవ్వవు కదా, మేము ప్రేపరేషన్స్ స్టార్ట్ చేస్కున్నట్లూ ఉంటుంది, నీ సరదాను తీరుతుంది" అన్నాడు నవ్వుతూ
"ఏంటన్నయ్యా ఇందాకటి నుంచి నన్ను ఏడిపిస్తున్నావ్. నేను నీతో మాట్లాడను. గుడ్ నైట్. 50 కాదు 75% తెచుకుంటా చూడూ" అంటూ కోపంగా తన రూమ్ లో కి వెళ్ళీ తలుపు వేసేసుకుంది.
Comments
Post a Comment