18

 

స్వాతి ఆలోచనలో పడింది కానీ,  కళ్ళు హరీష్ వైపు చూస్తున్నాయి.  హరీష్ ఏదో అర్థమయినట్లుగా,  "చెప్పరా" అంటూ కళ్ళతోనే సైగ చేసాడు. 

"ఇంతమందిలోనా?? ఎప్పుడూ చెప్పనేలేదు?? టెన్షన్ గా ఉంది"

"ఏమి కాదు, ఎవరూ లేరనుకుని చెప్పేయి" అంటూ నవ్వాడు

అన్విత,  రమ్య కి మాత్రమే వినిపించేలా "వీళ్ళ మూగ సైగలు మళ్ళీ మొదలుపెట్టారే బాబూ " అంది నవ్వుతూ

రమ్య గట్టిగా "అంత ఆలోచించక్కర్లేదు నీ హీరో గురించే చెప్పు" అంది.  స్వాతి చూపుకి భస్మం అయిపోతానని భయపడిందేమో, వెంటనే "ఎవరికన్నా ఉంటారు కదా,  డ్రీం బాయ్....  తన గురించే చెప్పు" అని నవ్వేసింది

"సరే... " అంటూ కళ్ళు మూసుకుని.....

నా కలల ప్రపంచం లోకి
రంగుల హరివిల్లులా వచ్చావు
కల్లోలంగా ఉన్న మనసుని
అందంగా మార్చావు
ముద్దుగా ముద్దు చేసావు
మురిపెంగా గుండెల్లో దాచుకున్నావు
నన్ను పొదవిపట్టుకున్న నువ్వు
ఒక్కోసారి, అమ్మ ప్రేమని మరిపిస్తావు
ఇంకోసారి,  నాన్నలా భరోసా ఇస్తావు
మరోసారి అన్నలా,  స్నేహితునిలా
మనసులోని బాధని పంచుకోమంటావు
నీ కౌగిట్లో సేద తీరమంటావు
అండగా నేనున్నానని చెప్పకనే చెప్తావు
ఆ చేతులని తాకాలనుంది నాకు
కళ్ళు తెరిచి చూడాలనుంది నిన్ను
కానీ,  కళ్ళు తెరిస్తే కల చెదిరిపోతుందేమో
కలో...  ఊహో తెలియని అయోమయం లో
నీకోసం వెతుకుతూనే ఉన్నా
కలలో ఉన్న నువ్వు ఎదురుగా ఎప్పటికి వస్తావు కృష్ణా
నీ గుండెల సవ్వడిని ఎప్పుడు వినిపిస్తావయ్యా

స్వాతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా హరీష్ ముసి ముసిగా నవ్వుతూ తన పెదాలతో గాల్లో ముద్దు పెట్టి స్వాతి కి పంపించాడు. పక్కనే ప్రదీప్ స్వాతిని కన్నార్పకుండ చూస్తుంటే (అది కోపమో,  ఆశ్చర్యమో మరింకెంటో స్వాతి కి తెలీలేదు), వెంటనే కళ్ళు మూసేసుకుని, ఇంకా తను చెప్పేది పూర్తవన్నట్లుగా

"కృష్ణా.....  నువ్వొచ్చిన్నప్పుడు నీ బావ నిన్ను ఉరిమి చూస్తాడేమో. తనని కూడా నువ్వే,  నన్ను పడేసినట్లు ...... నీ మాయతో  పడేయాలయ్యా "

అంటూ ఒక కన్ను తెరిచి ప్రదీప్ వైపు చూసింది.

ప్రదీప్  "కృష్ణ మాయ కాదురా నువ్వే మాయ చేసేస్తావు" అంటూ నవ్వేసాడు

అందరూ చప్పట్లు కొట్టి బావుందనటం తో ధైర్యంగా కళ్ళు తెరిచింది స్వాతి.

"మేమింకా నిజమేమో,  ఎవరా అబ్బాయ్ అని అడగబోయానే. చివరికేమో కల అనేసావు" అన్నారు అప్పుడే అక్కడికొచ్చిన పద్మ, రామ్ గారు నీరసంగా

"అత్తయ్యా  చెప్పలేము కదా, అందరూ ఉన్నారని కల అనేసిందేమో, నిజమేనేమో" అంది అన్విత ఆవిడకి కన్ను కొట్టి, స్వాతి రియాక్షన్ కోసం చూస్తూ

అసలిదంతా నీ వలెనే అన్నట్లు కోపంగా రమ్య వైపు చూసింది స్వాతి. "ఇదొకత్తి. ఎవరేమన్నా నాదే తప్పు అంటుంది" అని గొణుక్కుంటూ "ఆంటీ నేనే డ్రీం బాయ్ గురించీ చెప్పమని అడిగాను,  అన్విత కావాలనే ఇరికిస్తోంది. అయినా ఎలాగో వచ్చారు కదా ఒక మంచి పాట పాడండి" అంది టాపిక్ మారుస్తూ

"ఏంటీ నేనా....నాకు పనుంది.  వెళ్తున్నా" అంటుంటే అందరూ ఆవిడ పాడాల్సిందే అని పట్టుబట్టటం తో,  ఆవిడ పాడబోతుంటే, రమ్య " ఆంటీ అడిగాము కదా అని పాత పాట కాదు కొత్తగా వచ్చిన వాటిలోవి ట్రై చేయండి మా కోసం" అంటూ గొడవ చేసింది. ఇంక ఆవిడ తప్పదనుకుంటూ

సదా నన్ను నడిపే నీ చెలిమే పూదరి నిలిచే
ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా …
అని నేడే తెలిసే

"ఇంక  చాలర్రా...." అంటూ ఆవిడ సిగ్గు పడి ఆపేసారు

"అంకుల్ ఇప్పుడు మీరు"

"నాకిలా పాటలు రావమ్మా"

"పాటలే అక్కర్లేదు.....  మీరు ఆంటీ గురించీ ఏదైనా చెప్పండి. ఎప్పుడు మీరు చెప్పనిది, చెప్పాలనుకున్నది..." అంటూ నవ్వింది రమ్య

ఇంక స్వాతి,  ప్రదీప్, తర్వాత అందరూ కూడా రామ్ గారిని చెప్పమని బలవంతపెట్టారు

"నేను మాట్లాడితే కొంతమందికి నచ్చదేమోనమ్మా. కానీ చెప్తాను....

స్వాతి మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అది మా బంగారం అయిపొయింది. పద్మ కూడా అంతే ప్రేమగా ఉండేది. కానీ సొంత కూతురు అనుకున్నాక మళ్ళీ బయటకి పంపించాల్సి వచ్చినప్పుడు నేను తన దగ్గరైనా బాధపడ్డానేమో కానీ,  తను తన బాధని తోబుట్టువులతో కూడా పంచుకోలేదు. కారణం నా వాళ్ళని తక్కువ చేయకూడదు అనే ఆలోచన. ఆ తర్వాత మళ్ళీ స్వాతి ని ఆ స్థితిలో చూసినప్పుడు, గుండె తరుక్కుపోయింది. కానీ తీసుకొచేస్తే నా భార్య సొంత కూతురులా  చూడగలుగుతుందా అని భయపడ్డాను. సారీ పద్మ.... ఆరోజు నిన్ను అనుమానించాను" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. స్వాతి, ప్రదీప్ అయన దగ్గరకి వచ్చి ఆయన చెరో పక్క నిల్చుని ధైర్యం చెప్తుంటే,  పద్మ గారు "ఆరోజు మీరు భయపడటానికి కారణం నా మీద అనుమానం కాదు ఇదిగో ఈ చిట్టి తల్లి మీద ప్రేమే. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా" అంటూ చెమర్చిన కళ్ళతోనే ఆయనకి ధైర్యం చెప్పారు.

అయన మళ్ళీ మాట్లాడుతూ "నేనిలా ఆలోచిస్తుంటే ఇదిగో వీడు, చెల్లి ని తీస్కెళ్లిపోదాము. ఇక్కడ ఉంటే నేను ఉండిపోతాను అంటూ బంగారు తల్లిని వదలలేదు. పద్మ కళ్ళ నీళ్లతో నా బిడ్డలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అన్నాకే నేను తీసుకొచ్చాను. ఏనాడు తను వీళ్ళిద్దరిని వేరుగా చూడలేదు. నా తమ్ముడిని వదిలేసానన్న వాళ్ళకోసం, నేను మాట పడ్తున్నానే అనే బాధతో, ఈరోజు నా తమ్ముడ్ని ఇక్కడికి పిలిచింది. కానీ తను మనసు లో ఎంత భయపడుతూ ఉందొ ప్రదీపు నీకు కూడా తెలీదురా. చిట్టి తల్లిని తెలిసి తెలిసి ఏడిపిస్తోందే అనుకుంటూ వారం రోజుల్నుంచి నిద్రపోలేదు. నాకోసం ఇంత చేసీ, అందరితోనూ మాట పడినా, నా వరకూ ఏది రానీయలేదు. నా సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకుంది. ఈరోజు ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు అంత ప్రేమగా ఉంటున్నారంటే కూడా దానికి కారణం వీళ్ళ అమ్మే. అలాంటి తనకి నేనేమని చెప్పగలను. థాంక్స్ అని చెప్పి తనని తక్కువ చేయదల్చుకోలేదు" అంటూ ముగించారు

అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. కొద్దిసేపటికి మళ్ళీ రమ్య "సరే ఇప్పుడు అమ్మాయిలు మీరేదయినా కొంచం మంచి ఊపున్న పాటేసుకోండమ్మా,  కొంచం లైటప్ చేయండి"

అమ్మాయిలందరూ కలిసి ఆలోచించుకుని

వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  

మగవాళ్ళు మస్తు చాలు... మగవాళ్ళు మస్తు చాలు... మగవాళ్ళు మస్తు చాలు...
మస్కాలు గోడతా ఉంటారే... నువ్వు వెన్నపూస లెక్క... కరిగితే అంతే సంగతే... 
ఓసారి సారీ అంటూ ఓసారి సరే అంటూ... 
మెయింటైన్ నువ్వు చేస్తే... లైఫ్ అంతా పడుంటాడే...  
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 

ఇక్కడ పాడలేదు కానీ అక్కడ మాత్రం అమ్మాయిలందరూ పాడి,  అబ్బాయిల చుట్టూ  డాన్స్ లు చేసి హడావిడి చేశారు

అమ్మాయిలు ఇంత చేసేసరికి, అబ్బాయిలు ఏ పాట పాడాలా అనే కన్ఫ్యూషన్ లో ఉండేసరికి,  హరీష్ పాట అందుకున్నాడు....

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ లవ్వనేది బబులు గమ్ము, అంటుకున్నాదంటే పోదు నమ్ము
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమనాపలేవు నన్ను నమ్ము
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంటూ దగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే 

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
.
.
.
.

అన్వి,  రమ్య.... "ఇంతకీ ఎవరు చుట్టుకున్నారు,  ఎవరా బుట్ట బొమ్మా,  ఎవరి మీదా ప్రేమా" అంటూ ఆట పట్టిస్తుంటే స్వాతి మాత్రం సిగ్గుతో మూగబోయింది.

ఆ తర్వాత,  "అవునే అన్వి,  ఇందాకటి నుంచి నువ్వెంటి సైలెంట్గా తప్పించుకుంటున్నావ్. నువ్వూ ఏదైనా పాడు" అంటూ స్వాతి గొడవ చేసేసరికి రమ్య కూడా తనకి తోడయ్యింది. ఇంక చేసేది లేక, అన్వి....

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
నామనసు నీనీడలో వదిలేసి వెళుతున్న....
నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న
వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న

ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని
ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ
ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ
ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ
....

ఈసారి నేను ఆపలేదండి,  అన్వితే ఆపేసింది. అందరూ తనని చూడటం ఒక ఎత్తైతే,  రెండు జతల కళ్ళు తన వైపు బాధగా ఏం జరిగిందో అనే ఖంగారు కనిపించేసరికి తను ఆగిపోయింది.

"ఏమైంది అన్వి సడన్ గా.  ఎందుకలా డల్ అయిపోయావు" అంటూ స్వాతి,  రమ్య ప్రశ్నలు ఆపకుండా అడుగుతుంటే,  అన్వి  "ఇంక ఇంటికి వెళ్ళద్దా చిట్టీ....  అందుకే వెళ్తున్నా" అన్నాను  అంది నవ్వుతూ

వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న
నీలోన దాగున్న నాకోసం వస్తున్న
నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న

అలా సడన్ గా పాట అందుకొనేసరికి అందరూ ప్రదీప్ వైపు ఆశ్చర్యంగానూ అనుమానంగానూ చూసారు. ప్రదీప్ లేస్తూ, "అంత అనుమానం గా చూడక్కర్లేదు. అత్తయ్యా వాళ్ళు మధ్యాహ్నమే చెప్పారు దాన్ని ఇంటి దగ్గర దింపమని. అది వెళ్లాలంటే నేనూ వెళ్ళాలి కదా, సింక్ బావుందని పాడాను" అని నవ్వేసి లోపలికి వెళ్ళాడు.

అందరూ ఒక్కొకరుగా బయల్దేరారు. రమ్య,  అన్వితని దింపి, మరి కొంతమందిని స్టేషన్ లో దింపటానికి వెళ్ళాడు ప్రదీప్. హరీష్ మాత్రం అక్కడే ఇంట్లో వాళ్ళ అత్తయ్యకి  చిన్న చిన్న పనులు సద్దటం లో సహాయం చేస్తూ ఉండిపోయాడు.

"అమ్మా అందరం మేడ మీద కూర్చుందాము. బయట చల్లగా  బావుంది.

పద్మ గారు...... "నాకు ఓపిక అయిపొయింది. ప్రదీప్ వస్తే పడుకుందామని కూర్చున్నా బలవంతంగా"

"సరేలే,   బావా నేనూ ఇక్కడ బయట వరండా లో కూర్చుంటాము అన్నయ్య వచ్చేవరకు. నువ్వు పడుకోలే."

"హరీష్ కి లేట్ అవుతుందేమో. వాడిని ఇబ్బంది పెట్టకు"

స్వాతి హరీష్ వైపు చూసింది,  ఏమంటాడో అన్నట్లుగా

"లేదత్తయ్యా  బావని కలిసి వెళ్తాను. మాట్లాడే  పనుంది"

"సరే అయితే,  మీరు కబుర్లు చెప్పుకోండి" అంటూ ఆవిడ లోపలికి వెళ్లిపోయారు

స్వీటీ తన చున్నీ ని వెళ్ళాలి చుట్టూ తిప్పుతూ ఏదో ఆలోచిస్తోంది. హరీష్ తనని కొంచంసేపు గమనించి, 

"స్వీటీ.....  చెప్పూ" అనడిగాడు

"ఆ....  అహ్హ్....  అదీ.....  అదే.....  ఎప్పుడూ జాయినింగ్"

"ఇంకో టూ డేస్ లో"

"ఓహ్ సరే "

"స్వీటీ.... ఏమడుగుదామనుకున్నావో అడగరా..... ఎందుకంత మొహమాటం,  ఇబ్బంది నా దగ్గర కూడా"

"బావా...... అదీ.......  పొద్దునా....   దగ్గర వరకూ వచ్చి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు"

"ఎక్కడికీ వెళ్ళలేదుగా,  నువ్వు వెళ్లనీయలేదు కదా"

స్వాతి సిగ్గుతో అక్కడ కూర్చోలేకపోయింది.

హరీష్ ఆమె చేతిని చేతిలోకి తీసుకునీ,  "నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను,  ముద్దు పెట్టుకుందామనే దగ్గరకి తీసుకున్నాను. కానీ,  మొదటి సారి నువ్వు ప్రేమంటే ముద్దులు,  కౌగిలింతలు కాదు అన్నమాట గుర్తొచ్చి,  నిన్ను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక వెనక్కి వెళ్ళిపోబోయాను. నువ్వెప్పుడైతే నన్ను దగ్గరకి తీస్కున్నావో అప్పుడే నీకు సమ్మతమే అనిపించి ముద్దు పెట్టాను. మరి నువ్వెందుకు నన్ను వెళ్ళిపోనీయలేదు"

"అదీ....  బావా....  ఆరోజు తర్వాత ఈ నెల రోజుల్లో చాలా మారాయి కదా బావా. దానికి ముందర,  నువ్వు నన్ను ఎన్ని సార్లు తల్చుకుని ఉంటావు,  ఎన్ని సార్లు నా తలపు రాగానే మొహం మీద చిరునవ్వు గుండెల్లో  ఒక తీపి బాధ,  పక్కన నేను లేనే అని అనిపించింది. ఎన్ని సార్లు నన్ను చూడాలనిపించిన మరు క్షణం నన్ను చూడకుండా ఉండలేక పరిగెత్తుకుంటూ వచ్చావో చెప్పగలవా. అవన్నీ ఎందుకు, ఈ ఒక్క మాట కి సమాధానం చెప్పు,   ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకూ నాతో ఉండవా అని నేను అడిగాను కాబట్టి వచ్చావా లేదా నీకు నాతో ఉండాలనిపించి ఉన్నావా? "

"నిన్ను ఎన్నోసార్లు తల్చుకున్నాను, నువ్వు కాలేజీకి వెళ్తుంటే నీ వెనకే వచ్చేవాడిని, ఎన్నిసార్లు నిన్ను చూడాలని నీకోసం మీ ఇంటి బయటా, నీ కాలేజీ చుట్టూ తిరిగానో నీకు తెలీదు స్వీటీ" నవ్వుతూ చెప్పాడు హరీష్.

స్వాతి ఆశ్చర్యంగా "నిజమా బావా??" నేను నీ ఆలోచనల్లో పిచ్చిదాన్నావుతుంటే నువ్వు నా వెనకే ఉన్నావా?? నాకు తెలియను కూడా తెలీదు. నేనేమో కాలేజీ నుండి ఇంటికి వస్తూ మీ ఇంటి ముందు నుండి వచ్చేదాన్ని. గేట్ దగ్గరో, లేదా మీ బాల్కనీలో నిల్చునుంటే దూరం నుండైనా చూడచ్చు కదా అనే ఆశతో. ఇంటికి వచ్చాను ఒకటి రెండు సార్లు... "

హరీష్ నవ్వి "కానీ రోజూ చూడాలనే ఆశ పోదు. రోజూ వస్తే పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటం..." అతనిదీ అదే పరిస్థితి అన్నట్లుగా ఆమె రాలేకపోవటానికి కారణం చెప్పాడు. స్వాతి అంటే మునుపటి నుండే అతనికి అంత ప్రేమని ఆమెకి ఎప్పుడూ తెలీదు. ఆమె పడిన ఆరాటం తనూ అనుభవించాడని తెలిసాక, అతని చేతిని ముద్దాడి, అతని భుజం గట్టిగా పట్టుకుంది.

హరీష్ ఆమె తల ముద్దుపెట్టి "నీతో ఉండగలిగే ఏ టైమ్ ని వేస్ట్ చేసుకోలేనురా,  నువ్వు అడిగినందుకు కాదు నీతో రోజంతా గడపచ్చనే వచ్చాను స్వీటీ" చివరిగా ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పాడు.

అప్పట్లో నువ్వు ప్రేమిస్తున్నావని తెలీదు బావ. నువ్వంత దగ్గరగా ఉండాలనుకుంటున్నావ్ అని తెలుసుంటే, నీ కౌగిట్లో ఎప్పుడో ఒదిగిపోయేదాన్ని బావా" అంది సిగ్గుగా తల దాచేసుకుంటూ.


Comments